Pawan kalyan : ఆ తిక్కకు లెక్క లేనేలేదట

నాకు తిక్కుంది.. దానికో లెక్కుంది అన్న డైలాగ్ ను నిజజీవితంలో సయితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుసరిస్తున్నారని పిస్తుంది. ఒక సినిమా ఫంక్షన్ లో రాజకీయ [more]

Update: 2021-09-28 03:30 GMT

నాకు తిక్కుంది.. దానికో లెక్కుంది అన్న డైలాగ్ ను నిజజీవితంలో సయితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుసరిస్తున్నారని పిస్తుంది. ఒక సినిమా ఫంక్షన్ లో రాజకీయ అంశాలను లేవనెత్తి అభ్యంతరకర వ్యాఖ్యలు, కులాల ప్రస్తావన తెచ్చి మరోసారి ఏపీ రాజకీయాలను హాట్ హాట్ గా మార్చారు. పవన్ కల్యాణ్ ఆ సినిమా ఫంక్షన్ కు సంబంధించిన ప్రసంగానికే పరిమితమయి ఉంటే బాగుండేది. కానీ అలా చేస్తే పవన్ కల్యాణ‌్ ఎందుకవుతారు.

ఆవేశం ఎక్కువే….

పవన్ కల్యాణ‌్ లో ఆవేశం పాళ్లు ఎక్కువ. ఆయన తొలి నుంచి మాట తూలుతారు. తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కాంగ్రెస్ నేతలను పంచెలూడదీసి కొడతానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యానికి పద్ధెనిమిది సీట్లు మాత్రమే వచ్చాయి. తర్వాత ఆయన ఎన్నికల బరిలోకి దిగకుండా టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చారు. మోదీ పాల్గొన్న రెండు, మూడు సభల్లో ఆయన పాల్గొన్నారు. మరి పవన్ కల్యాణ‌్ వల్లనో, కాదో తెలియదు కాని టీడీపీ కూటమి 2014లో అధికారంలోకి వచ్చింది.

సిద్ధాంతాలంటూ….

అప్పటి నుంచి పవన్ కల్యాణ‌్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేశారు. కమ్యునిస్టులు, బీఎస్పీతో కలసి పోటీ చేసి దారుణ ఓటమిని చవి చూశారు. తాను పుట్టుకతోనే కమ్యునిస్టునని, ఆ సిద్ధాంతాలే తనకు ఆదర్శమని పవన్ కల్యాణ‌్ చెప్పారు. చివరకు ఎన్నికలు పూర్తయిన వెంటనే కమ్యునిస్టులను వదిలేసి బీజేపీతో జత కట్టారు. పవన్ కల్యాణ్ కు ఒక పొలిటికల్ స్టాండ్ లేదని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

కులప్రస్తావనతో….

ఇక పవన్ కల్యాణ‌్ రెడ్డి సామాజికవర్గం గురించి మాట్లాడారని, ఆయన సోదరుడు చిరంజీవి కుటుంబంలో రెడ్డి సామాజికవర్గం వారు ఉన్నారని సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు. కాపు సామాజికవర్గానికి పవన్ కల్యాణ‌్ చేసిందేమిటని ప్రశ్నిస్తున్నారు. కాపు కులానికి చెందిన యువతిని వదిలేసి మరో ఇద్దరిని పెళ్లి చేసుకున్న సంఘటననుకూడా వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ ఆవేశం రాజకీయాల్లో ఆయనకే నష్టం చేకూరుస్తుందన్నది వాస్తవం.

Tags:    

Similar News