pawan kalyan : ఎన్నికలకు ముందు వస్తే మళ్లీ?

నాయకుడనేవాడు సమస్యలపై స్పందించగలిగాలి. ప్రజాపక్షాన నిలబడగాలి. ప్రజల్లో నిత్యం ఉంటూ వారికి అండగా నిలబడాలి. అప్పుడే ప్రజల్లో ఆ నాయకుడి పట్ల నమ్మకం కలుగుతుంది. కానీ జనసేన [more]

Update: 2021-09-21 15:30 GMT

నాయకుడనేవాడు సమస్యలపై స్పందించగలిగాలి. ప్రజాపక్షాన నిలబడగాలి. ప్రజల్లో నిత్యం ఉంటూ వారికి అండగా నిలబడాలి. అప్పుడే ప్రజల్లో ఆ నాయకుడి పట్ల నమ్మకం కలుగుతుంది. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం రాజకీయాల్లోకి వచ్చి ఏడేళ్లవుతున్నా ఇంకా జనం అంటేనే భయపడుతున్నారు. జనాల్లోకి రావాలంటేనే ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఎంతకాలం అని జనసేన క్యాడర్ కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చింది.

అన్ని పార్టీలూ…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హీట్ గానే ఉంటాయి. విపక్ష తెలుగుదేశం పార్టీ నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తుంది. ఏదో ఒక కార్యక్రమం చేపట్టి వార్తల్లో ఉంటోంది. ఇటు వామపక్షాలు, చివరకు కాంగ్రెస్ పార్టీ సయితం ప్రజా సమస్యలపై స్పందిస్తుంది. తన పార్టనర్ బీజేపీ కూడా అనేక సమస్యలపై పోరాటాలు చేస్తుంది. కానీ జనసేన మాత్రం కేవలం సోషల్ మీడియాకే పరిమితమయింది.

రెండున్నరేళ్లవుతున్నా….

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసి రెండున్నరేళ్లు గడిచింది. ఈ రెండున్నరేళ్లలో పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో సమావేశమయింది అతి తక్కువ సార్లు మాత్రమే. జిల్లాల వారీగా సమీక్షలంటూ తొలుత హడావిడి చేసిన జనసేనాని తర్వాత ఆ ఊసే మరిచిపోయారు. ఇక జిల్లాల పర్యటనలు కూడా చేయలేదు. విజయవాడ కార్యాలయానికి అప్పుడప్పుడు రావడం తప్పించి క్యాడర్ తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది లేదు.

బీజేపీతో కలసి….

పవన్ కల్యాణ్ ఇలాగే జనసేనను వదిలేస్తే ఏపీలో పార్టీ ఎదగడం కష్టమే. తాను పొత్తు పెట్టుకున్న బీజేపీకి సయితం ఏపీలో బలంగా లేదు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీతో జనసేనాని నడవాలని నిర్ణయించుకున్నా, తన సొంత పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారన్న టాక్ విన్పిస్తుంది. ఎన్నికలకు నెలలు ముందు హడావిడి చేస్తే ప్రజలు ఎలా నమ్ముతారు? పవన్ కల్యాణ్ యాటిట్యూడ్ జనసేనలోనూ చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News