ఆ ఖాళీ పవన్ కోసమేనా… ?

బీజేపీ తాజాగా జరిపిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణ మీద ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఈ క్యాబినెట్ కూర్పు అన్నది [more]

Update: 2021-07-22 15:30 GMT

బీజేపీ తాజాగా జరిపిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణ మీద ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఈ క్యాబినెట్ కూర్పు అన్నది అందరికీ తెలిసినా కూడా జాతీయ స్థాయిలో విపక్షం అయితే మరీ బూతద్ధంలో నుంచి చూస్తోంది. సరే జాతీయ రాజకీయాలు ఎలా ఉన్నా ఏపీ విషయానికి వస్తే ఒక్కరికీ కేంద్ర మంత్రిగా చాన్స్ ఇవ్వలేకపోయారు. ఒక విధంగా ఏపీ మీద బీజేపీ వివక్ష అలాగే కొనసాగుతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హోరెత్తిపోతోంది. కానీ బీజేపీ పెద్దలు మాత్రం ఆ ఖాళీని రిజర్వ్ లో పెట్టారని అంటున్నారు.

చాలా టైమ్ ఉందిగా…?

కొత్త మంత్రులతో మాట్లాడుతూ మోడీ ఒక మాట అన్నట్లుగా వార్తల్లో వచ్చింది. ఇదే చివరిది అని అనుకోవద్దు. పనితీరు బాగా లేకపోతే ప్రక్షాళన ఉంటుందని కూడా హెచ్చరించారు. మరి ఆ హింట్ ని బట్టి చూస్తే మూడేళ్ళలో మరోసారి కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నరు. ఇంత పెద్ద ఎత్తున 42 మంది మంత్రులతో కాకపోయినా చేర్పులూ మార్పులకూ ఎపుడూ అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. అందువల్ల ఏపీ విషయంలో బెంగ లేదని, ఆ మార్పులతో పాటే ఇక్కడా భర్తీ ఉంటుందని కూడా వినవస్తున్న మాట.

సేనాని నోట అలా..?

ఇక ఏపీలో బీజేపీ కేంద్ర మంత్రి పదవిని ఏదో ఇచ్చామనంటే ఇచ్చామని అన్నట్లుగా ఇవ్వదుట. దానికి చాలా రాజకీయ లెక్కలు ఉన్నాయిట. అయితే వైసీపీ, లేకపోతే జనసేన ఈ రెండు పార్టీల విషయం తేలితే కచ్చితంగా ఏపీకి కేంద్ర మంత్రి ఉంటారని అంటున్నారు. ఇప్పటిదాక టైమ్ ఇచ్చి చూసినా అటు జగన్ కానీ ఇటు పవన్ కల్యాణ్ కానీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇపుడిపుడే పవన్ ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది అంటున్నారు. మూడు నెలల సుదీర్ఘ విరామం తరువాత మంగళగిరి పార్టీ ఆఫీస్ కి వచ్చిన పవన్ కల్యాణ్ క్యాడర్ కి జోష్ తెప్పించకపోగా నిరాశనే పెంచారు. పార్టీ నడపడం కష్టమనే బరువైన మాటను కూడా ఆయన చెప్పారు. ఇది పవన్ వైఖరిలో వచ్చిన గుణాత్మకమైన మార్పుగా విశ్లేషిస్తున్నారు. ఈ రోజుల్లో పార్టీని నడపడం కష్టమని కూడా ఆయన అన్నారు. మరి జనాంతికంగా అన్నా కూడా ఆయన మనసులోని మాటలను అవి బయటపెట్టాయని అంటున్నారు.

కలసిపోతే కిరీటమే…?

బీజేపీ ఒక వైపు జనసేన పార్టీని విలీనం చేయమంటోంది. పవన్ కల్యాణ్ ఇంతకాలం బాగా నాన్చారు. ఈ లోగా విస్తరణ క్రతువు పూర్తి అయింది. అయితే పవన్ కనుక ఓకే అంటే మరో విడతలోనైనా ఆయనకు చాన్స్ ఇస్తారని అంటున్నారు. ఆయన్ని బీజేపీ నేతగా చేసుకుని రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రిని చేస్తారని కూడా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కి మంచి అవకాశం కూడా రాజకీయాల్లోకి వచ్చి ఏమీ సాధించలేదు అన్న బాధ నుంచి కేంద్ర మంత్రిగా కొన్నాళ్ళు అయినా పనిచేయడం మంచిదే అన్న మాట వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ బీజేపీలో చేరితే ఏపీలో రాజకీయ సమీకరణలు మార్చేయవచ్చు అన్నదే బీజేపీ ఎత్తుగడట. మరి పవన్ ఇపుడు సగం దారిలో ఉన్నారు. ఆయన కనుక ఫుల్ క్లారిటీతో డెసిషన్ తీసుకుంటే ఏపీలో ఉన్న ఆ ఖాళీలో కొత్త కేంద్ర మంత్రి ఆయనే అంటున్నారు.

Tags:    

Similar News