పవన్ కు ఆ ఫ్యామిలీలో సపోర్టు పెరుగుతుందా?

పవన్ కల్యాణ్ చరిష్మా ఉన్న నేత. సినిమా క్రేజ్ తో పాటు ఆయనకు మెగా కుటుంబం నుంచి రావడంతో మరింత కొండంత అండగా ఉంటుంది. కానీ ఆయనకు [more]

Update: 2021-07-18 03:30 GMT

పవన్ కల్యాణ్ చరిష్మా ఉన్న నేత. సినిమా క్రేజ్ తో పాటు ఆయనకు మెగా కుటుంబం నుంచి రావడంతో మరింత కొండంత అండగా ఉంటుంది. కానీ ఆయనకు తొలి నుంచి ఎందుకో రాజకీయాల్లో ఆయనకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం కొరవడింది. అదే ఆయనకు మైనస్ గా మారింది. పవన్ కల్యాణ్ కు మెగా కుటుంబం సహకారంతోడైతే మరింత ప్రయోజనం చేకూరుతుంది. కానీ ఆ దిశగా మాత్రం పవన్ కల్యాణ్ ప్రయత్నించడం లేదు.

అప్పడు అందరూ ఏకంగా….

ప్రజారాజ్యం పార్టీని తన అన్న చిరంజీవి స్థాపించినప్పుడు మెగా కుటుంబం మొత్తం ఏకమైంది. అందులో పవన్ కల్యాణ్ యువరాజ్యం అధినేతగా ఉన్నారు. అందరూ చిరంజీవికి అండగా నిలబడ్డారు. గెలుపోటములను పక్కన పెడితే ఎన్నికల సమయంలోనూ ప్రచారంలో వారు ముమ్మరంగా పాల్గొన్నారు. కానీ పవన్ కల్యాణ్ విషయంలో మాత్రం అది జరగడం లేదు. దానికి కారణం పవన్ కల్యాణ‌ అనేది టాక్.

కొత్త పార్టీ పెట్టిన తర్వాత….

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత పవన్ కల్యాణ్ లో కసి పెరిగింది. జనసేన పార్టీని ఆయన ప్రకటించారు తాను ఒంటరిగానే పార్టీని సమర్థవంతంగా నడుపుకుంటానని, ఎవరి సహకారం అవసరంలేదని ఆయన నిష్కర్షగా చెప్పినట్లు సమాచారం. దీంతో మెగా కుటుంబం జనసేనకు దూరంగా ఉన్నారు. నాగబాబు తప్ప మరెవ్వరూ పార్టీ దరిదాపుల్లోకి కూడా రాలేదు. గత ఎన్నికల్లో కొన్ని చోట్ల మెగా హీరోలు ప్రచారం చేసినా అది నామమాత్రమేనని చెప్పాలి.

వచ్చే ఎన్నికల్లో….

అయితే వచ్చే ఎన్నికలలో పవన్ కల్యాణ్ కు పూర్తి స్థాయి సహకారం అందించాలని మెగా కుటుంబం డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మెగా కుటుంబంలో అనేక మంది హీరోలు ఉన్నారు. చిరంజీవి నుంచి వరుణ్ తేజ్ వరకూ పవన్ కల్యాణ‌్ కు సహకారం అందించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కూడా ఈసారి అందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద రాజకీయంగా పవన్ కల్యాణ్ కు మెగా కుటుంబం దగ్గరవుతుండటం పవన్ ఫ్యాన్స్ కు శుభవార్తే.

Tags:    

Similar News