పవన్ కి అక్కడ మళ్లీ ఛాన్సు ఉంటుందా… ?

పవన్ కళ్యాణ్ కి ఇపుడు అర్జంటుగా సేఫెస్ట్ ప్లేస్ ఒకటి కావాలిట. ఆయన ఇల్లు కట్టుకుని ఉండడానికి కాదు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవడానికి. అసెంబ్లీలో అధ్యక్ష [more]

Update: 2021-06-22 14:30 GMT

పవన్ కళ్యాణ్ కి ఇపుడు అర్జంటుగా సేఫెస్ట్ ప్లేస్ ఒకటి కావాలిట. ఆయన ఇల్లు కట్టుకుని ఉండడానికి కాదు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవడానికి. అసెంబ్లీలో అధ్యక్ష అని గొంతు సవరించడానికి. పవన్ చూపు చూస్తే ఆ మూడు జిల్లాల మీదనే ఉంది అంటున్నారు. విశాఖ ఉభయ గోదావరి జిల్లాలలోనే మరోమారు తన లక్ ని పరీక్షించుకోవాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన విశాఖలోని గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేస్తే రెండు చోట్ల దారుణంగా ఓడిపోయారు. అది జరిగి ఇప్పటికి రెండేళ్ళు అయింది ఆయన రాజకీయ దూకుడుని కనబరచలేకపోతున్నారు.

ముందు సెట్ అవాలి….

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉన్నారు. ఆయన కరోనా కారణంగా తన సినిమాల షూటింగులను వాయిదా వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. అయితే చేతిలో అయిదారు సినిమాలు ఉన్నాయి. వాటిని కచ్చితంగా పూర్తిచేస్తేనే తప్ప ఆయన అడుగు బయటపెట్టలేరు అన్న మాట ఉంది. దాంతో పవన్ కళ్యాణ్ 2023 నాటికి ఫ్రీ అవుతారు అన్న టాక్ వినిపిస్తోంది. అంటే 2024 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయంగా స్పీడ్ పెంచుతారన్న మాట. నాటికి పవన్ కళ్యాణ్ కి పోటీ చేసేందుకు ఒక కచ్చితమైన అసెంబ్లీ నియోజకవర్గం ఉండాలి అంటున్నారు. పవన్ ముందు తాను పోటీ చేయాలనుకున్న చోట గట్టిగా పర్యటనలు చేస్తారని కూడా చెబుతున్నారు.

గాజువాక ఓకేనా ….?

ఒకసారి ఓడిపోయామని ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. రెండవ మారు పట్టుబట్టి అక్కడ నుంచి పోటీ చేస్తే సానుభూతి కూడా వర్కౌట్ అవుతుంది. గతసారి ఓడించామన్న ఫీలింగ్ తో జనాలు టర్న్ అయితే గెలుపు గ్యారంటీ. ఇక్కడ గాజువాక గురించి చెప్పుకోవాలంటే టీడీపెకి స్ట్రాంగ్ హోల్డ్ గా ఉంది. కానీ ఈ మధ్యనే బీటలు వారుతున్నాయి. పట్టున్న నేత పల్లా శ్రీనివాసరావు భూ కబ్జా ఆరోపణలతో పాటు, సొంత పార్టీలో అసమ్మతిని కూడా ఎదుర్కొంటున్నారు. పైగా ఆయన ఈసారి ఎంపీగా పోటీ చేస్తారు అంటున్నారు. దాంతో గాజువాకలో టీడీపీకి సరైన అభ్యర్ధి లేరనే అంటున్నారు. అలాగే వైసీపీలో తిప్పల నాగిరెడ్డి మళ్ళీ పోటీ చేయరు, చేసినా గెలవరు, మూడు కుంపట్లు ఆరు వర్గాలుగా వైసీపీ ఇక్కడ ఉంది.

భారీ మెజారిటీ అట….

ఇదిలా ఉంటే గాజువాక నుంచే పవన్ కళ్యాణ్ మళ్ళీ పోటీ చేయాలని స్థానిక జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు. గత ఎన్నికల్లో సడెన్ గా ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగారని, దానికి తోడు సరైన వ్యూహాలు కూడా అనుసరించలేకపోయామని చెబుతున్నారు. ఈసారి అలా కాకుండా చూసుకుంటామని కూడా వారు మాట ఇస్తున్నారు. ఇదే విషయాన్ని వారు జనసేనానికి కూడా విన్నవిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కనుక ముందుగానే గాజువాకను ఎంపిక చేసుకుని తరచూ వస్తూ పోతూ ఉంటే కచ్చితంగా ఆయన 2024లో గెలవడం ఖాయమనే అంటున్నారు. ప్రధాన పార్టీలు వీక్ గా ఉండడం, అక్కడ మెగాభిమానులు దండీగా ఉండడం, బలమైన కాపు సామాజికవర్గం ఈసారి పోలరైజ్ కావడం వంటివి జనసేన గెలుపు ఆశాలను పెంచుతున్నాయట. చూడాలి మరి పవర్ స్టార్ ఈ వైపునకు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటాడో లేదో.

Tags:    

Similar News