కమల్ దెబ్బకు ప్లాన్ మార్చిన పవన్

పవన్ కల్యాణ్ కు అసలే రాజకీయంగా ఇబ్బందులు ఎక్కువ. ఇక పొరుగున ఉన్న తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరింత ఇబ్బందిపెట్టాయి. కమల్ హాసన్ పార్టీ అక్కడ ఒక్క [more]

Update: 2021-05-05 08:00 GMT

పవన్ కల్యాణ్ కు అసలే రాజకీయంగా ఇబ్బందులు ఎక్కువ. ఇక పొరుగున ఉన్న తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరింత ఇబ్బందిపెట్టాయి. కమల్ హాసన్ పార్టీ అక్కడ ఒక్క సీటును కూడా దక్కించుకోకపోవడం పవన్ కల్యాణ్ అభిమానులను నిరాశ పర్చింది. కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావడాన్ని పవన్ కల్యాణ్ స్వాగతించారు. మార్పు కోసం అందరూ రాజకీయాల్లోకి రావాల్సిందేనని పవన్ కల్యాణ్ అన్నారు.

సినీ గ్లామర్ కు…..

కానీ సినీ హీరోలకు ప్రజల ఆమోదం లభించందని మరోసారి కమల్ హాసన్ ఓటమి ద్వారా స్పష్టమయింది. సినీగ్లామర్ కేవలం గ్రౌండ్, స్క్రీన్ లకే పరిమితమవుతుందని, పోలింగ్ కేంద్రాల వరకూ అది రాదని తేలిపోయింది. దీంతో పవన్ కల్యాణ్ మరోసారి పునరాలోచనలో పడినట్లు తెలిసింది. నిజానికి పవన్ కల్యాణ్ కు కమల్ హాసన్ మాదిరిగానే వీరాభిమానులున్నారు. లక్షలాది మందిద అభిమానులతో పాటు సామాజికపరమైన మద్దతు కూడా పవన్ కల్యాణ్ కు ఉంది.

ఒంటరిగా పోట చేసి…

కానీ గత ఎన్నికల్లో ఘోర ఓటమిని పవన్ కల్యాణ్ చూడాల్సి వచ్చింది. ఒంటరిగానే పోటీ చేయడం వల్లనే ఓటమి పాలయ్యాయని పవన్ కల్యాణ‌్ తన సన్నిహితుల వద్ద అభిప్రాయపడ్డారు. కమల్ హాసన్ కూడా ఒంటరిగానే పోటీ చేసి భంగపడ్డారు. సినీ గ్లామర్ ను మరింత పెంచుకోవడం, పార్టీ కోసం నిధులను కూడబెట్టడం కోసమే పవన్ కల్యాణ‌్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అయితే డబ్బుల సంగతి పక్కన పెడితే సినీగ్లామర్ పనిచేయదన్నది స్పష్టమయింది.

ఎంపిక చేసిన నియోజకవర్గాల్లోనే…?

తాను గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలన్న ప్రయత్నంలో పవన్ కల్యాణ్ ఉన్నారు. ముందుగా తనకు బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించడం, అక్కడ పార్టీని బలోపేతం చేయడం. కనీసం యాభై నుంచి అరవై స్థానాల్లో తాము బలంగా ఉంటే కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్నాయిని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. కమల్ హాసన్ నేర్పిన పాఠంతో మొత్తం నియోజకవర్గాలపై దృష్టి పెట్టకుండా ఈసారి యాభై నుంచి అరవై నియోజకవర్గాల్లో బలోపేతం అయ్యేందుకు పవన్ కల్యాణ్ ప్రణాళికను రచిస్తున్నారంటున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News