సింబల్ ను చేజేతులా చేజార్చుకుంటారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన చేజేతులా పార్టీని ప్రజలకు దూరం చేసుకుంటున్నారు. ఆయన వ్యూహాత్మకంగా, ముందు చూపుతో వ్యవహరించకపోవడం వల్లనే జనసేన పార్టీ గుర్తింపు లేకుండా [more]

Update: 2021-05-01 11:00 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన చేజేతులా పార్టీని ప్రజలకు దూరం చేసుకుంటున్నారు. ఆయన వ్యూహాత్మకంగా, ముందు చూపుతో వ్యవహరించకపోవడం వల్లనే జనసేన పార్టీ గుర్తింపు లేకుండా పోతుంది. ఎన్నికలకు ఆయన దూరంగా ఉంటున్నందునే పార్టీ గుర్తు కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఏదైనా పార్టీకి కామన్ గుర్తు ప్రధానం. గుర్తు ను చూసే అనేక మంది ఓట్లను వేస్తారు. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ సింబల్ కు విలువ ఎక్కువగా ఉంటుంది.

రెండు రాష్ట్రాల్లో….

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీకి ఇప్పుడు గాజు గ్లాసు గుర్తు లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు. ఇది జనంలోకి బాగా వెళ్లింది. సరే ఎక్కువ స్థానాల్లో జనసేన గెలవకపోయినప్పటికీ దాదాపు ఏడు శాతం ఓట్లు వచ్చాయంటే అందుకు పవన్ కల్యాణ్ ఇమేజ్ తో పాటు గుర్తు కూడా ఒక కారణమని చెప్పాలి.

క్యాడర్ చెబుతున్నా…..

కానీ 2019 ఎన్నికల్లో దారుణ ఓటమితో పవన్ కల్యాణ‌్ కొంత నిరాసక్తత చూపారు. సినిమాల పైన ఫోకస్ పెట్టారు. వచ్చిన ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన నేతలు పోటీ చేయాలని భావించారు. బీజేపీతో కలసి పోటీ చేయాలని లోకల్ నేతలు నిర్ణయించారు. కొన్ని వార్డులను కూడా ఎంపిక చేసుకున్నారు. చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ తాము పోటీచేయడం లేదని ప్రకటించారు. దీంతో తెలంగాణలో జనసేన గుర్తు కోల్పోవాల్సి వచ్చింది.

బీజేపీ వత్తిడికి…..

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న జనసేనకు గాజుగ్లాసు గుర్తు దక్కలేదు. ఇక తిరుపతి ఉప ఎన్నికలోనూ తామే పోటీ చేేయాలని జనసేన స్థానిక క్యాడర్ నిర్ణయించింది. ఈ మేరకు తీర్మానం కూడా చేసింది. అయినా చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ బీజేపీ నేతల వత్తిడికి తలొగ్గారు. ఇక్కడ కూడా గాజుగ్లాసు గుర్తు వేరే పార్టీ అభ్యర్థికి వెళ్లిపోయింది. ఇలా గుర్తు విషయంలో జనసేన గందరగోళంలో పడింది. దీనికి ప్రధాన కారణం పవన్ కల్యాణ్ తీసుకున్న, తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని చెప్పక తప్పదు.

Tags:    

Similar News