పవన్ అరిచి గోల పెట్టినా

ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన రాజకీయాన్ని అధికార, విపక్షాలు అనుసరిస్తున్నాయి. అధికారపార్టీకి తామే ప్రధాన ప్రతిపక్షం కావాలని ఇటీవల జనసేన పోరాటం ముమ్మరం చేసింది. వైసిపి సర్కార్ ను [more]

Update: 2019-08-19 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన రాజకీయాన్ని అధికార, విపక్షాలు అనుసరిస్తున్నాయి. అధికారపార్టీకి తామే ప్రధాన ప్రతిపక్షం కావాలని ఇటీవల జనసేన పోరాటం ముమ్మరం చేసింది. వైసిపి సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శల దాడిని స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తూ వస్తున్నారు. వాస్తవానికి కొత్త ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇస్తున్నట్లు ఆ తరువాతే పాలన తీరుపై విమర్శలు ఉంటాయన్న పవన్ కళ్యాణ్ తన మాట మార్చారు. తమ పార్టీ నేతలపై కేసులు పెడుతూ వేధిస్తున్న కారణంగా తాము ఆగేది లేదంటూ రాజకీయం మొదలు పెట్టారు.

వైసిపి గెలుపు డబ్బుతో అని వరద వరకు …

రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రావడానికి డబ్బు బాగా పనిచేసిందని పవన్ కళ్యాణ్ కొంత కాలంగా ఆరోపిస్తూ వస్తున్నారు. తనను ఓడించేందుకు వందకోట్లకు పైగా డబ్బు వెదజల్లారంటూ ఆరోపించిన జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా మొత్తం పార్టీ అధికారంలోకి రావడం వెనుక నోట్ల పంపకాలు పని జరిగేలా చేశాయంటున్నారు. అలా మొదలైన పవన్ కళ్యాణ్ విమర్శల దాడి ఇప్పుడు అధికార విపక్షాల పైనా మొదలైంది. కృష్ణా వరదల్లో బాధితులను ఆదుకోవడం వదిలి చంద్రబాబు ఇంటి చుట్టూ డ్రోన్ రాజకీయం నడిపిస్తున్నారని విమర్శించారు ఆయన. అధికార విపక్షాలు వరద రాజకీయాలకు స్వస్తిపలికి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.

జనసేనను లైట్ తీసుకుంటున్నారా …

అధికార, విపక్షాలు ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి జనసేన పార్టీని మరీ లైట్ తీసుకోవడం మొదలు పెట్టాయి. మూడోపక్షం ఏ రకంగాను బలపడటం ఇష్టం లేని రెండు ప్రధాన పక్షాలు పవన్ కళ్యాణ్ ఇస్తున్న అటాక్ కి కౌంటర్ ఇవ్వడం లేదు. అధికార విపక్షాలు రోజు తిట్ల దండకాన్ని కంటిన్యూ చేస్తున్నా జనసేన అధినేత విమర్శలు తమ దృష్టిలో లేనేలేనట్లుగా వ్యవహారం నడుపుతూ వస్తున్నాయి. దాంతో ప్రధాన మీడియా లో పవన్ కళ్యాణ్ విమర్శల పర్వం స్క్రోలింగ్ లకు మాత్రమే పరిమితం అవుతుంది. కొన్ని ఛానెల్స్ ఆ మాత్రం కూడా జనసేనకు కేటాయించకపోవడం గమనార్హం.తాము సమాధానం ఇచ్చి జనసేనను పెద్దది చేయడం ఇష్టం లేకే వ్యూహాత్మకంగా ఈ విషయంలో ఒకే విధానం అమలు చేస్తూ ఉండటం విశేషం.

Tags:    

Similar News