ప‌వ‌న్ ప్రమోష‌న్ బాధ్యత‌.. ఆ రెడ్డిగారు తీసుకుంటున్నారా..?

ఔను! ఇప్పుడు జ‌న‌సేన‌లో ఏ నేత‌ను క‌దిపినా.. ఈ మాటే వినిపిస్తోంది. సినీ ఇండస్ట్రీ ప‌రంగా. ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ ‌కు తిరుగులేదు. ఆయ‌న అభిమానుల [more]

Update: 2021-02-27 09:30 GMT

ఔను! ఇప్పుడు జ‌న‌సేన‌లో ఏ నేత‌ను క‌దిపినా.. ఈ మాటే వినిపిస్తోంది. సినీ ఇండస్ట్రీ ప‌రంగా. ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ ‌కు తిరుగులేదు. ఆయ‌న అభిమానుల సంఖ్యకు కొద‌వ‌లేదు. కానీ, రాజ‌కీయంగా చూసుకుంటే మాత్రం.. ప‌వ‌న్ క్షేత్రస్థాయిలో ఇంకా గుర్తింపు పొందాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. రాజ‌కీయంగా ప‌వ‌న్ ఏడేళ్లుగా ర‌ణ‌క్షేత్రంలో ఉన్నా ఇంకా బుడిబుడి అడుగులే వేస్తున్నారు. పవన్ కల్యాణ్ కు సినిమాల ప‌రంగా కావాల్సినంత ప్రచారం… ఆయ‌న వ‌ద్దంటే వార్తలు వ‌చ్చేస్తాయి. అయితే రాజ‌కీయంగా చూస్తే ఆయ‌న మీడియా మేనేజ్మెంట్‌లో బాగా వెన‌క‌ప‌డిపోయారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు మీడియా ప్రమోష‌న్ త‌ప్పదు. ప్రస్తుతం రాజ‌కీయాల‌ను ప్రమోష‌న్ చేస్తోంది.. మీడియానే. క‌నుక ఖ‌చ్చితంగా.. మీడియా ప్రాప‌కం.. ఎంత‌టి నాయ‌కుడికైనా అవ‌స‌రం. అయితే.. పవన్ కల్యాణ్ ప‌రిస్థితి భిన్నంగా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది.

అన్ని పార్టీలకూ సొంతంగా….

రాజ‌కీయంగా చూసుకుంటే. రెండు రాష్ట్రాల్లోనూ ఏ పార్టీకి ఆ పార్టీకి సొంత‌గానో.. ప‌రోక్షంగానో .. మీడియా సంస్థలు ఉన్నాయి. వైసీపీని తీసుకుంటే.. సాక్షి, టీడీపీకి అనుకూలంగా మ‌రికొన్ని ప‌త్రిక‌లు, ఛానెల్స్ ఉండ‌నే ఉన్నాయి. ఇక‌, తెలంగాణ‌లో కేసీఆర్‌ను స‌పోర్టు చేసేందుకు న‌మ‌స్తే తెలంగాణ ఉన్నాయి. ఆ మాట‌కు వ‌స్తే తెలంగాణ‌లో 90 శాతం మీడియా కేసీఆర్‌కు జీ హుజూర్ అంటోన్న ప‌రిస్థితి. పవన్ కల్యాణ్ కు సొంత మీడియా లేదా ? అంటే.. ఉంది. అయితే.. దాని రేటింగ్ నానాటికీ ప‌డిపోతోంది. దీంతో ప‌వ‌న్ ఏం చేస్తున్నా.. అటు పార్టీలోను, ఇటు ప్రజ‌ల్లోనూ ప్రొజెక్టు కావ‌డం లేదు. దీంతో ఆయ‌న తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

పారిశ్రామికవేత్తల సాయంతో?

ఎన్నిక‌ల‌కు ముందు ఓ వామ‌ప‌క్ష పార్టీకి చెందిన ఛానెల్‌ను పార్టీకే చెందిన ఓ నేత‌ లీజుకు తీసుకుని (జ‌న‌సేన నేత తోట చంద్రశేఖ‌ర్‌) దానిని ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కు న‌డిపించారు. పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డంతో ఆ త‌ర్వాత ఆ ఛానెల్‌ను వ‌దిలేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మ‌ళ్లీ పవన్ కల్యాణ్ ను ప్రమోట్ చేసేందుకు కొంద‌రు పారిశ్రామిక‌వేత్తలు సిద్ధమ‌వుతున్నట్టు తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే రాయ‌ల‌సీమ‌కు చెందిన రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఓ నేత ఇప్పుడు ప‌వ‌న్‌ను మీడియా ప‌రంగా సపోర్ట్ చేసే విష‌యంలో పెట్టుబ‌డి పెట్టేందుకు రెడీ అవుతున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు పవన్ కల్యాణ్ ను స‌పోర్ట్ చేసే డీల్ కుదిరింద‌ని… దీనిని ముందుండి న‌డిపించేది రెడ్డి వ‌ర్గం వ్యక్తే అయినా.. దీని వెన‌క మ‌రి కొంద‌రు పారిశ్రామిక‌వేత్తలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఓ కేంద్ర మాజీ మంత్రి సైతం అయిష్టంగా అయినా ఇందులో పెట్టుబ‌డిగా ఎంతో కొంత త‌న వాటా స‌మ‌ర్పించుకోక త‌ప్పడం లేద‌ట‌.

బీజేపీ ప్రభుత్వంతో లబ్దిపొంది….?

కొద్ది రోజుల వ‌ర‌కు వైసీపీతోనే స‌న్నిహిత సంబంధాలు నెర‌పిన వారు సైతం అనేక కోణాల్లో ఆలోచ‌న చేసి ఇప్పుడు ప‌వ‌న్ + బీజేపీ కూట‌మికి వెన్నుద‌న్నుగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నార‌ట‌. కేవ‌లం పవన్ కల్యాణ్ కోస‌మో లేదా ప‌వ‌న్‌ను న‌మ్మో వీరు మీడియాలో పెట్టుబ‌డులు పెడ‌తారా ? అన్నది కూడా ఓ సందేహ‌మే. అయితే బీజేపీ నుంచి ఈ పారిశ్రామిక‌వేత్తల‌కు భారీ కాంట్రాక్టులు రావ‌డంతో వీరు అక్కడ నుంచి వ‌చ్చిన డైరెక్షన్‌లోనే ఇక్కడ పవన్ కల్యాణ్ ను ప్రొజెక్ట్ చేయ‌డంతో పాటు బీజేపీ వాయిస్‌ను బ‌లంగా ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్లేలా ఒప్పందం కుదిరింద‌ని అంటున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సోష‌ల్ మీడియాతో పాటు మిగిలిన ప్రధాన పార్టీల మీడియాను ధీటుగా ఎదుర్కొని ఈ మీడియా జ‌నసేన + బీజేపీ కూట‌మి వాయిస్‌ను ఎలా బ‌లంగా ప్రొజెక్ట్ చేస్తుందో ? అన్నది చూడాలి.

Tags:    

Similar News