మ‌ళ్లీ ప‌వ‌న్ బాబును దెబ్బ కొట్టనున్నాడా ?

మెగా సోద‌రులు మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండుసార్లు పార్టీలు పెట్టి వారు గెలవ‌క‌పోయినా… రెండుసార్లు ప‌రోక్షంగా చంద్రబాబును దెబ్బకొట్టారు. చిరంజీవి 2009లో ప్రజారాజ్యం [more]

Update: 2021-02-10 12:30 GMT

మెగా సోద‌రులు మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండుసార్లు పార్టీలు పెట్టి వారు గెలవ‌క‌పోయినా… రెండుసార్లు ప‌రోక్షంగా చంద్రబాబును దెబ్బకొట్టారు. చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు కాపులు బ‌లంగా ఉండే గుంటూరు, కృష్ణా, గోదావ‌రి, విశాఖ జిల్లాల్లో బ‌లంగా ఓట్లు చీల్చి టీడీపీని దెబ్బకొట్టారు. ఈ దెబ్బతో ప్రజారాజ్యం అధికారంలోకి రాక‌పోయినా ఓట్ల చీలిక ఎఫెక్ట్‌తో టీడీపీ అధికారానికి దూరం కాగా… నాడు వైఎస్ ట్రయాంగిల్ ఫైట్‌లో సులువుగా గెలిచేశారు. క‌ట్ చేస్తే ప‌దేళ్ల త‌ర్వాత 2019లో ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీతో ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. ఏపీలో మ‌ళ్లీ జ‌న‌సేన – వైసీపీ – టీడీపీ మ‌ధ్య ట్రయాంగిల్ ఫైట్ న‌డిచింది. 2009కు 2019కు తేడా ఏంటంటే నాడు వైఎస్‌తో పోటీప‌డ్డ చంద్రబాబు నేడు ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్‌తో… నాడు చిరంజీవితో పోటీ ప‌డ్డ చంద్రబాబు నేడు చిరు సోద‌రుడు ప‌వ‌న్‌తో పోటీ ప‌డాల్సి వ‌చ్చింది.

ఏ ఎన్నిక చూసినా…?

2009లో ఏ కాపుల ఓట్లు భారీగా చీలిపోవ‌డంతో చంద్రబాబు అధికారానికి దూర‌మ‌య్యారో ? 2019లో ప‌వ‌న్ కూడా కాపుల ఓట్లు భారీగా చీల్చడంతోనే చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. 2014లో జ‌న‌సేన స‌పోర్ట్ కాపులు ఎక్కువుగా ఉన్న చోట్ల టీడీపీకి తిరుగులేని మెజార్టీ క‌ట్టబెట్టింది. గ‌త ఎన్నిక‌ల్లో అదే కాపుల ఓట్లు కొన్ని ప‌వ‌న్‌కు.. మ‌రికొన్ని వైసీపీకి చీలిపోవ‌డంతో బాబు ఆ బెల్ట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో దెబ్బతిన్నారు. చిరు 2009 ఎన్నిక‌ల్లో చంద్రబాబును దెబ్బకొట్టాక మ‌ళ్లీ ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌లేదు. మ‌ధ్యలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఉప ఎన్నిక‌ల్లో మాత్రమే ప్ర‌జారాజ్యం పోటీ చేసింది. ఆ ఎన్నిక‌ల్లోనూ నాటి ప్రజారాజ్యం అభ్యర్థి దువ్వాడ శ్రీనుకు దాదాపు 30 వేల ఓట్లు వ‌చ్చాయి. కానీ ఆ ఉప ఎన్నిక‌ల్లో అచ్చెన్నాయుడు కేవ‌లం 7 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు.

ఈ నియోజకవర్గాల్లో…..

అంటే చిరు పోటీ చేస్తే ఆ ఓట్లు టీడీపీకి ప‌డేవే ఎక్కువుగా చీల్చిన‌ట్టు అర్థమ‌వుతోంది. ఇప్పుడు జ‌రిగే ఏపీ స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లోనూ అదే దెబ్బ చంద్రబాబుకు త‌గిలే ఛాన్సులు ఉన్నాయి. పైగా ఈ సారి ప‌వ‌న్‌కు తోడు బీజేపీ కూడా ఉంది. హిందువులు, ఆర్ఎస్ఎస్ సానుభూతిప‌రుల్లో కొంద‌రి ఓట్లు అయినా ఈ కూట‌మికి ప‌డితే మ‌ళ్లీ చంద్రబాబుకు గ‌ట్టి దెబ్బ త‌ప్పేలా లేదు. ముఖ్యంగా ప‌వ‌న్ సొంత జిల్లా అయిన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో డెల్టాలో మూడు, నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన కూట‌మి ప్రభావం ఎక్కువుగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లోనే టీడీపీ జ‌న‌సేన దెబ్బతో న‌ర‌సాపురం, భీమ‌వ‌రంలో మూడో స్థానంలో ఉంది.

క్యాడర్ లేకపోయినా….?

ఇప్పుడు కూడా పవన్ కల్యాణ్ ‌కు కేడ‌ర్ లేక‌పోయినా సామాజిక వ‌ర్గ బ‌లం అధికంగా ఉండ‌డంతో వీరిలో యువ‌త‌తో పాటు మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాలు ప‌వ‌న్ వైపు ఆ త‌ర్వాత వైసీపీ వైపు మ‌ళ్లే ఛాన్సులు ఉన్నాయి. ఈ ఓట్లను రాబ‌ట్టడంలో టీడీపీ మూడో ప్లేస్‌లో ఉంటే మ‌ళ్లీ బాబుకు ఘోర‌మైన ఓట‌మి త‌ప్పదు. కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు త‌మ వ్యక్తిగ‌త ఇమేజ్‌తో బండి లాగాల్సిందే త‌ప్పా లేక‌పోతే టీడీపీ గెలుపును ఆశించ‌లేం. ఇదే ప‌రిస్థితి అటు తూర్పు గోదావ‌రి జిల్లా కోన‌సీమ‌తో పాటు కాపుల ప్రాబ‌ల్యం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. వైజాగ్‌లో చాలా చోట్ల ఉంది. తూర్పు గోదావ‌రిలో జ‌న‌సేన గెలిచిన రాజోలు లాంటి చోట్ల మొన్నే టీడీపీకి మూడో ప్లేస్ వ‌చ్చింది. ఇప్పుడు కోన‌సీమ‌లో నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు మెట్టలో జ‌గ్గంపేట‌, ప్రత్తిపాడు, తునితో పాటు కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ జ‌న‌సేన దెబ్బతో కుదేల‌వుతోంది.

Tags:    

Similar News