అందుకే ఇన్నాళ్లూ ఆగారా? ఇప్పుడు అవసరమనిపించిందా?

పవన్ కల్యాణ్ కు ఒక ఆలోచన ఉంది. ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉంది. ఓటమి ఎప్పుడూ ఒంటరిని చేయదు. గెలుపు ఎప్పుడూ అధికారంలోనే ఉంచదు. ఇదే [more]

Update: 2021-02-09 12:30 GMT

పవన్ కల్యాణ్ కు ఒక ఆలోచన ఉంది. ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉంది. ఓటమి ఎప్పుడూ ఒంటరిని చేయదు. గెలుపు ఎప్పుడూ అధికారంలోనే ఉంచదు. ఇదే పవన్ కల్యాణ్ ఆలోచన. తనపై కుటుంబ సభ్యుల ప్రభావం ఉండకూడదని పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన నాటి నుంచే ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. ఎవరినీ పార్టీ దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. అంతా బయట వ్యక్తులనే ముఖ్యమైన పదవుల్లో పవన్ కల్యాణ్ నియమించారు.

ఏళ్లుగా దూరంగానే…..

పవన్ కల్యాణ్ తొలి నుంచి తన కుటుంబ సభ్యులను పార్టీకి దూరంగానే ఉంచుతూ వస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ప్రజారాజ్యం పార్టీని పవన్ కల్యాణ‌్ దగ్గర నుంచి చూశారు. ప్రజారాజ్యంలో పవన్ కల్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పడు కూడా ప్రజారాజ్యం పార్టీ గెలుపు కోసం ఆయన అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన ఏమాత్రం తలదూర్చే వారు కాదు. అన్న చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతోనే పవన్ కల్యాణ్ నాడు పనిచేశారు.

అయిన వాళ్లే మోసం చేశారని….

అయితే నాడు తన అన్న చిరంజీవిని కుటుంబ సభ్యులే మోసం చేశారన్న అభిప్రాయం పవన్ కల్యాణ్ లో బలంగా ఉంది. చిరంజీవి చుట్టూ చేరిన కోటరీ వల్లనే నాడు అభ్యర్థుల ఎంపికలో కూడా ప్రజారాజ్యం విమర్శలను ఎదుర్కొనాల్సి వచ్చిందని, అందుకే ముఖ్యమైన నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారని పవన్ కల్యాణ్ బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే తాను జనసేన పార్టీ పెట్టి ఆరేళ్లు దాటుతున్నా పార్టీ గడపను కూడా కుటుంబ సభ్యులను తొక్కనివ్వలేదు.

గత ఎన్నికల సమయంలోనూ….

గత అసెంబ్లీ ఎన్నికల్లో సయితం పవన్ క‌ల్యాణ్ ఒక్కరే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సోదరుడు నాగబాబుకు మాత్రం పార్టీలో అవకాశం ఇచ్చారు. కనీసం ఆ ఎన్నికల్లో తనకు మద్దతుగా ప్రచారం చేయాలని అన్న చిరంజీవిని కోరలేదు. కుటుంబ సభ్యులను దూరంగా ఉంచితేనే తాను ఎవరి ఒత్తిడికి లోను కానని పవన్ కల్యాణ్ భావించారు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ కు కుటుంబ సభ్యులు అవసరం ఆయనకు ఏర్పడిందంటున్నారు.

అన్న ఒక్కరికే ఛాన్స్……

అందుకే తన అన్న చిరంజీవి మద్దతును పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారు. తాను ఒక్కడినే ఎదుర్కొనే శక్తి లేదని పవన్ కల్యాణ్ గ్రహించారు. బయట వ్యక్తుల కంటే బలంగా ఉన్న అన్న చిరంజీవి అండ తనకు కొండంత అని పవన్ కల్యాణ్ విశ్వసిస్తున్నారు. అందుకే పదే పదే చిరంజీవి పేరును ప్రస్తావిస్తున్నారు. వచ్చే ఎన్నికల ప్రచారంలో చిరంజీవి పవన్ కల్యాణ్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తే ప్రభావం బలంగానే ఉంటుంది. అయితే మెగా కుటుంబంలో ఒక్క చిరంజీవికి మాత్రమే స్పేస్ ఇవ్వాలన్నది పవన్ కల్యాణ్ ఆలోచన. మరెవ్వరినీ పార్టీ దరిదాపుల్లోకి కూడా రానివ్వరన్న టాక్ బలంగా విన్పిస్తుంది.

Tags:    

Similar News