ఎల్లో మీడియా ఎత్తేస్తోందిగా..?

ఏపీలో ఒక్క జగన్ తప్ప ఎవరైనా ఓకే అన్న థియరీని టీడీపీ దాని అనుకూల మీడియా బాగా ఫాలో అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ని ఆయన పార్టీ [more]

Update: 2021-01-20 13:30 GMT

ఏపీలో ఒక్క జగన్ తప్ప ఎవరైనా ఓకే అన్న థియరీని టీడీపీ దాని అనుకూల మీడియా బాగా ఫాలో అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ని ఆయన పార్టీ జనసేనని ఆ మధ్యకాలమంతా విమర్శించిన అనుకూల మీడియా ఇపుడు ఒక్కసారిగా స్టాండ్ మార్చుకుంది. పవన్ నిజాయతీపరుడు అంటూ అదే పనిగా కీర్తిస్తోంది. గంటల తరబడి డిబేట్లు పెట్టి మరీ పవన్ టూర్ల మీద ఫోకస్ పెంచుతోంది. పవన్ కల్యాణ్ సినీ నటుడు. పైగా మళ్లీ ముఖానికి రంగేసుకున్నాడు. క్యూలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఆ గ్లామర్ తో పవన్ కల్యాణ్ సభలకు జనాలు వస్తారు. దాన్ని జగన్ కి యాంటీ అని చూపించేందుకు టీడీపీ అనుకూల మీడియా పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావుగా.

ధీటైన ప్రచారం …..

ఈ మధ్య చంద్రబాబు బావమరిది బాలక్రిష్ణ హిందూపురం టూర్ చేశారు. రోడ్ షోలు కూడా పెట్టారు. ఆయన పదునైన డైలాగులే జగన్ సర్కార్ మీద పేల్చారు. వైసీపీ మంత్రులకు కూడా సీరియస్ వార్నింగులు ఇచ్చారు. కానీ ఆయన విషయం పెద్దగా టీడీపీ అనుకూల మీడియా పట్టించుకోకపోవడం విడ్డూరమే. అదే సమయంలో గుడివాడలో పవన్ కల్యాణ్ మీటింగు నుంచి దివీస్ ఫ్యాక్టరీకి యాంటీగా పవన్ కల్యాణ‌్ పెట్టిన సభల దాకా ఏ ఒక్కటీ వదలకుండా కవర్ చేస్తూ పవన్ని పూర్తిగా ఎత్తేస్తున్న వైనం మాత్రం విస్మయం కలిగిస్తోంది.

కొత్త వ్యూహమే….?

పవన్ కల్యాణ్ ఇపుడు బీజేపీ పొత్తులో ఉన్నారు. అయితే ఇది సాంకేతికమేనని తమ్ముళ్లతో సహా అంతా భావిస్తున్నారు. పవన్ కి బీజేపీకి అసలు పొసగదు అని కూడా నమ్ముతున్నారు. పవన్ తన మానాన తాను సొంతంగా ఏపీలో టూర్లు వేస్తున్నారు. మాట వరసకైనా ఎక్కడా బీజేపీ గురించి ఆయన ప్రస్థావించడంలేదు. పైగా పవన్ కల్యాణ్ సభల్లో జనసేన జెండాలు తప్ప బీజేపీ జాడ లేకుండా ఉంది. దాంతో పవన్ దాదాపుగా ఒంటరిగానే రాజకీయ ప్రస్థానం చేస్తున్నారని టీడీపీ అనుకూల మీడియా అంచనా వేసుకుంటోంది. ఆయన్ని ఎలాగైనా టీడీపీలో కలపాలన్నదే కొత్త వ్యూహంగా ఉంది. దాని కోసం అదిరిపోయే మీడియా కవరేజి ఇపుడు ఉదాత్తంగా పవన్ కల్యాణ్ కి అందిస్తున్నారు అంటున్నారు.

రెండిందాల లాభం….

పవన్ కల్యాణ్ కి ప్రధాన శత్రువు వైసీపీ, జగన్. అందువల్ల ఆయనకు ప్రచారం చేస్తే కచ్చితంగా జగన్ కి యాంటీగానే జనంలో ప్రొజెక్ట్ అవుతుంది. అది మొదటి లాభం. ఇక పవన్ కల్యాణ్ కి ఇలా పాజిటివ్ గా సిగ్నల్స్ పంపిస్తే ఇవాళ కాకపోయినా రేపు అయినా టీడీపీ వైపు చూస్తారు. ఏపీలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీయే పొత్తులకు ఎత్తులకు పెద్దన్న అన్నది అనుకూల మీడియ భావన. దాంతో పవన్ కల్యాణ్ ని ప్రొజెక్ట్ చేస్తూ జనాల్లో జగన్ కి వ్యతిరేకత పెంచితే అంతిమంగా దాని లాభాలు, ఫలితాలు అన్నీ కూడా టీడీపీ ఖాతాలోకే వచ్చి చేరాలన్నదే ఎత్తుగడ. అందుకోసమే పవన్ కల్యాణ్ నిజాయతీపరుడని, ఎప్పటికైనా సీఎం కాగలవాడు అంటూ తెగ కీర్తిస్తున్నారు అంటున్నారు. చూడబోతే టీడీపీ అంచనాలు తప్పేట్లు కూడా లేవు అనే అనిపిస్తోంది. జగన్ పొడ గిట్టని పవన్ కల్యాణ్ కి చంద్రబాబు లో మిత్రుడు ఎపుడూ కనిపిస్తాడని చెబుతారు. అలాగే పవన్ సహా మిత్రుల అండ కోసం చూస్తున్న టీడీపీకి ఏదో రోజు ఆ స్నేహ హస్తం అందడం ఖాయ‌మనే అంటున్నారు.

Tags:    

Similar News