జనసేనలో ఎవరూ లేరా? ఉన్నది వారిద్దరేనా?

రాజకీయమన్నాక నమ్మకం ముఖ్యం. అధినేత తమ వెంట ఉంటారన్న విశ్వాసం ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే నేతలు ఉండరు. క్యాడర్ ఉండదు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ [more]

Update: 2021-01-08 08:00 GMT

రాజకీయమన్నాక నమ్మకం ముఖ్యం. అధినేత తమ వెంట ఉంటారన్న విశ్వాసం ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే నేతలు ఉండరు. క్యాడర్ ఉండదు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి అదేనని చెప్పక తప్పదు. గత ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేసిన ఎంతమంది ఇప్పుడు పవన్ కల్యాణ్ వెంట ఉన్నారంటే… చెప్పడం కష్టమే. ఎందుకంటే ఎవరూ లేరన్న సమాధానమే వినిపిస్తుంది. దీనికి కారణం పవన్ కల్యాణ్ పై నమ్మకం లేకపోవడమే.

బీ టీంగా ముద్రపడి….

2014 ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ్ జగన్ ను టార్గెట్ చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీని వదిలి పెట్టి జగన్ ను లక్ష్యంగా చేసుకోవడంతో పవన్ కల్యాణ్ చంద్రబాబు బీ టీంగా ముద్రపడిపోయారు. అంతేకాదు చంద్రబాబు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా అర్జంట్ గా పవన్ కల్యాణ్ వచ్చి వాలిపోతారన్న విమర్శ కూడా ఉంది. దీనికి మరింత బలం చేస్తూ పవన్ కల్యాణ్ పర్యటనలు కొనసాగుతుండటం విశేషం.

క్షేత్రస్థాయిలో బలోపేతానికి….

నిజానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. తన పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలి? తన పార్టీ ఎక్కడ బలంగా ఉంది? అక్కడ సరైన నేతలు ఎవరు? అన్నది ఆలోచించకుండా పవన్ కల్యాణ్ రాజకీయాలను లైట్ గా తీసుకుంటున్నారంటున్నారు. ఎన్నికల సమయంలో తనను చూసి ఓట్లు వేస్తారన్న ధీమాతో ఆయన ఉన్నట్లు కన్పిస్తుంది. అయితే గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సభలకు జనం విరగబడి వచ్చినా ఓట్లు మాత్రం రాలేదు.

ఆయనను నమ్మి…..

దీంతో పవన్ కల్యాణ్ ను నమ్మి రాజకీయాలు చేయలేమని ఇప్పటికే కొందరు జనసేన నేతలు కాడి వదిలేసినట్లు తెలిసింది. కొందరు వేరే పార్టీలోకి వెళ్లగా మరికొందరు ఉన్నా లేనట్లుగానే ఉన్నారు. పవన్ కల్యాణ్ సమావేశం పెట్టినప్పుడు హాజరవ్వడం, తర్వాత తమ పనులును చూసుకోవడం తప్ప పార్టీని పూర్తిగా వదిలేశారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను నమ్ముకుని తాము వందల కోట్లను నష్టపోయామని కొందరు వాపోయే వారు కూడా ఉన్నారు. మొత్తం మీద జనసేన పార్టీలో పవన్ కల్యాణ్ ఒక్కరే ఎన్నికల నాటికి మిగిలేటట్లు కనపడుతుంది.

Tags:    

Similar News