ప‌వ‌న్ ప్రత్యర్థి ఫ్యూచ‌ర్ డిప్యూటీ సీఎం చేతుల్లో

అవును ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రత్యర్థి ఫ్యూచ‌ర్‌ను ఏపీ డిప్యూటీ సీఎం డిసైడ్ చేయ‌నున్నారు.. ప‌వ‌న్ ప్రత్యర్థి ఎవ‌రు ? ఆ డిప్యూటీ సీఎం ఎవ‌రు ? మ‌రి [more]

Update: 2020-12-23 05:00 GMT

అవును ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రత్యర్థి ఫ్యూచ‌ర్‌ను ఏపీ డిప్యూటీ సీఎం డిసైడ్ చేయ‌నున్నారు.. ప‌వ‌న్ ప్రత్యర్థి ఎవ‌రు ? ఆ డిప్యూటీ సీఎం ఎవ‌రు ? మ‌రి ఆయ‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఈ డిప్యూటీ సీఎం చేతుల్లో ఎందుకు ఉందో అన్న ప్రశ్నకు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల‌ను కాస్త లోతుగా ప‌రిశీలించాల్సిందే. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త ఎన్నిక‌ల్లో త‌న సొంత జిల్లాలోని భీమ‌వ‌రంతో పాటు విశాఖ జిల్లాలోని గాజువాక నుంచి అసెంబ్లీకి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. గాజువాక‌లో ఓట‌మి ఎలా ? ఉన్నా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సొంత జిల్లాలో ఆయ‌న సొంత ప్రాంతం అయిన భీమ‌వ‌రంలో ప‌వ‌న్ ఓట‌మి జ‌న‌సేన, ప‌వ‌న్, మెగా అభిమానుల‌కు ఎప్పట‌కీ మింగుడు ప‌డ‌దు. పైగా ఇక్కడ నుంచే ఎంపీగా పోటీ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడు నాగ‌బాబు సైతం ఓడిపోవ‌డంతో పాటు మూడో స్థానంతో స‌రిపెట్టుకున్నారు.

సీనియర్ ఎమ్మెల్యే కావడంతో….

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఓడించిన వారిలో గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డికి జ‌గ‌న్ నామినేటెడ్ ప‌ద‌వి క‌ట్టబెట్టారు. ఇక మిగిలిన గ్రంధి శ్రీను సైతం పెద్ద ప‌ద‌వి మీదే ఆశ‌తో ఉన్నారు. గ్రంధి కూడా సీనియ‌ర్ ఎమ్మెల్యే. 2004లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయ‌న 2014లో వైసీపీ నుంచి ఓడి గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఓడించి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. ఇక వ‌చ్చే ప్రక్షాళ‌న‌లో త‌న‌కు ఖ‌చ్చితంగా కేబినెట్ ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆయ‌న ఎన్నో ఆశ‌ల‌తో ఉండ‌డంతో పాటు ఇప్పటికే ప్రచారం కూడా చేసుకుంటున్నారు. పవ‌న్‌ను ఓడించినందుకు ముందే గ్రంధి శ్రీనివాస్ కి మంత్రి ప‌ద‌వి అనుకున్నా కుద‌ర్లేదు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కాపు సామాజిక వ‌ర్గానికి ఓ మంత్రి ప‌ద‌వి ఎప్పుడూ ఉంటోంది.

ముగ్గురికి మంత్రి పదవులు….

జ‌గ‌న్ ప్రభుత్వం ఏర్పడిన‌ప్పుడు జిల్లాకు మూడు మంత్రి ప‌ద‌వులు ఇచ్చినా కాపు కోటాలో త‌న‌కు స‌న్నిహితుడు అయిన ఆళ్ల నానికి వైద్య శాఖ క‌ట్టబెట్టడంతో పాటు డిప్యూటీ సీఎం పోస్టు క‌ట్టబెట్టారు. ఇక ప్రక్షాళ‌న‌లో చాలా మంది మంత్రుల‌ను త‌ప్పించేయ‌నున్నారు. వీరిలో ప‌శ్చిమ గోదావ‌రి నుంచి ముగ్గురు మంత్రుల‌ను త‌ప్పిస్తారా ? అన్న చ‌ర్చలు కూడా ఉన్నాయి. తానేటి వ‌నిత‌, చెరుకువాడ రంగ‌నాథ రాజుకు క‌నీసం పాస్ మార్కులు కూడా లేవ‌ని వైసీపీ వాళ్లే చెప్పుకుంటున్నారు. ఆళ్ల నాని కాస్తో కూస్తో బెట‌ర్ అనుకుంటున్నా… న‌లుగురు కాపు మంత్రుల్లో మార్పులు, చేర్పులు జ‌రిగితే పేర్ని నాని, క‌న్నబాబు ఆళ్ల కంటే ముందు వ‌రుస‌లో ఉండ‌డంతో ఆళ్ల నానిని కూడా త‌ప్పిస్తారంటున్నారు.

ఆళ్ల‌ను త‌ప్పిస్తేనే గ్రంధికి ఛాన్స్ ..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఓడించిన గ్రంధి శ్రీనివాస్ సామాజిక స‌మీక‌ర‌ణ‌ల్లో త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాదా ? అన్న ఆశ‌తోనే ఉన్నారు. గ్రంధి మంత్రి ప‌ద‌వి ఆశ‌తో ఉన్నార‌ని ఆ పార్టీ అసంతృప్త ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు కూడా ఇప్పటికే ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. ఈ వ్యాఖ్యలే ఆయ‌న కూడా రేసులో ఉన్నార‌ని బ‌ల‌ప‌రుస్తున్నాయి. మంత్రి రేసులో జిల్లా నుంచి బీసీ కోటాలో కారుమూరి నాగేశ్వర‌రావు, ఎస్సీ కోటాలో త‌లారి వెంక‌ట్రావు, క్షత్రియ కోటాలో ముదునూరి ప్రసాద‌రాజు లాంటి నేత‌లు ఉన్నా కాపు కోటాలో గ్రంధి శ్రీనివాసే ముందు వ‌రుస‌లో ఉన్నారు. గ్రంధి కోరిక నెర‌వేరాలంటే ఆళ్ల నానిని త‌ప్పించ‌డం ఒక్కటే మార్గం. ఈ వ‌ర్గం నుంచే జిల్లాలో రెండు బెర్త్‌లు అసాధ్యం. మ‌‌రి జ‌గ‌న్ మ‌దిలో ఏముందో ? చూడాలి.

Tags:    

Similar News