పవన్ దెబ్బకు వంద కోట్లకు మునిగారా.. ?

జనసేనాని పవన్ కల్యాణ్ కి తన మీద అతి నమ్మకం. ఇక ఆయన అభిమానులకు వీర నమ్మకం. పవన్ని దేవాంశ సంభూతుడిగా వారు భావిస్తారు. పవన్ కల్యాణ్ [more]

Update: 2020-12-10 08:00 GMT

జనసేనాని పవన్ కల్యాణ్ కి తన మీద అతి నమ్మకం. ఇక ఆయన అభిమానులకు వీర నమ్మకం. పవన్ని దేవాంశ సంభూతుడిగా వారు భావిస్తారు. పవన్ కల్యాణ్ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ విజయం దక్కడం ఖాయమని వారు విశ్వసిస్తారు. అయితే ఇదంతా 2019 ముందు నాటిది అన్నమాట. అప్పట్లో పవన్ భీమవరం నుంచి, గాజువాక నుంచి పోటీ చేశారు. ఇక పవన్ రెండు సీట్లు మంచి మెజారిటీతో నెగ్గుతారని, ప్రత్యర్ధులు ఎవరైనా తుళ్ళిపోతారని అభిమానులు కొండంత నమ్మకంగా ఉండేవారు. దాంతో గాజువాకలో పవన్ కల్యాణ్ గెలుపు మీద పెద్ద ఎత్తున బెట్టింగులు అప్పట్లో జరిగాయిట.

లాడ్జీల్లో దిగి మరీ…

పవన్ కల్యాణ్ గెలుపు ఖాయం ఎంత మెజారిటీ అన్న దాని మీద విశాఖ వచ్చి మరీ లాడ్జీల్లో పందెం రాయుళ్ళు దిగిపోయారుట. ఇక పవన్ గెలుపు మీద సర్వేలు చేసిన వారూ ఉన్నారుట. ఇల పవన్ గెలుపు మెజారిటీల మీద లక్షలు, కోట్లలోనే బెట్టింగులు జరిగాయట. చివరికి వారంతా నిండా మునిగిపోయారట. గాజువాక ఎన్నికల సభలో రీల్ హీరో కావాలా రియల్ హీరో కావాలా అంటూ వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపుతో మొత్తానికి మొత్తం గాజువాక వైసీపీక వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డికి టర్న్ అయిన సంగతి విదితమే.

దారుణమైన పందేలు….

ఇక గాజువాకలో పవన్ గెలుపు మీద భీమవరంలో కూడా పందేలు జరిగాయట. అలా పంతం మీద సాగిన పందేలు వంద కోట్ల దాకా పెరిగి పవన్ కల్యాణ్ తరఫున ఆవేశంలో బెట్టింగ్ కాసిన వారంతా దారుణంగా నష్టపోయారని తాజాగా గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆనాటి ముచ్చట్లను బయట పెట్టాడు. ఈ విధంగా ఎంతో మంది పవన్ కల్యాణ్ అభిమానులు నాడు పందేలు కాశారని ఆయన చెప్పుకొచ్చారు. దీన్ని తనకు భీమవరం నుంచి చాలా మంది మిత్రులు ఫోన్ చేసి మరీ చెప్పారని కూడా తిప్పల ఫ్లాష్ బ్యాక్ గుట్టు విప్పారు.

అపుడే తెలిసిందా…?

అయితే స్వతహాగా రాజకీయ నాయకుడు అయిన తిప్పల నాగిరెడ్డికి పవన్ కల్యాణ్ ఎన్నికల్లో ఓడిపోతారని ముందే తెలుసట. తాను ప్రత్యర్ధిగా ఉన్నానని కాదు కానీ పవన్ నామినేషన్ కి వచ్చిన జనాలు, జగన్ మీటింగుకు వచ్చిన జనాలు, వారి స్పందనను బేరీజు వేసుకున్న మీదటనే తన గెలుపు ఖాయమని పోలింగునకు ముందే నిర్ధారణకు వచ్చినట్లుగా నాగిరెడ్డి చెప్పారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ అంటే అంత పిచ్చి అభిమానం తో నాడు ఫ్యాన్స్ ఇలా చేశారు పందేలు కాశారు అంటే నిజంగా విచిత్రమే మరి. రాజకీయాల్లో ఒక్క ఓటు కూడా అటూ ఇటూ ఫలితాన్ని మారుస్తుంది. అందువల్ల ఇది సినిమా అనుకుని పందేలు కాస్తే పోయేది జీవితాలే మరి. ఏ పార్టీ వారు అయినా దీన్ని గుర్తించాలి కూడా.

Tags:    

Similar News