పవన్.. మళ్ళీ ఒకటి నుంచి మొదలెట్టాలా ?

ఏ రంగంలోనైనా షార్ట్ కట్స్ ఉండవు. కష్టపడితేనే ఫలితాలు. అంతవరకూ ఎందుకు పవన్ కల్యాణ‌్ ఉన్న సినీ రంగంలో కూడా ఆయన మెగాస్టార్ తమ్ముడిగా అరంగ్రేట్రం చేసినా [more]

Update: 2020-12-09 00:30 GMT

ఏ రంగంలోనైనా షార్ట్ కట్స్ ఉండవు. కష్టపడితేనే ఫలితాలు. అంతవరకూ ఎందుకు పవన్ కల్యాణ‌్ ఉన్న సినీ రంగంలో కూడా ఆయన మెగాస్టార్ తమ్ముడిగా అరంగ్రేట్రం చేసినా తనను తాను రుజువు చేసుకోవడానికి బాగానే కష్టపడాల్సివచ్చిందిగా. మరి ఆ సోయి రాజకీయాల్లో కూడా ఉంటే పవన్ కల్యాణ‌్ ఈపాటికి చట్ట సభల్లో ఉండేవారు. కానీ ఎంత సేపూ తనను తాను అతిగా ఊహించుకోవడంతో పాటు ఎవరు భుజాల మీదనో కూర్చుని అందలం ఎక్కాలన్న ఆరాటంతో ఉండడం వల్లనే ఎప్పటికపుడు కధ మొదటికి వస్తోంది.

అన్నీ తిరిగినా….

ఈ మధ్యనే సినీ నటుడు ప్రకాష్ రాజ్, అలాగే మత ప్రభోధకుడు కేఏ పాల్ పవన్ కల్యాణ‌్ గురించి ఆయన రాజకీయం గురించి చెప్పాక ఫ్లాష్ బ్యాక్ అందరి కళ్ల ముందూ ఒక్కసారిగా తిరిగింది. ఈ ఆరేడేళ్లలో పవన్ ఇన్ని పార్టీలు మార్చారా అన్న డౌట్ కూడా వచ్చేసింది. అదే మరి పవన్ కల్యాణ‌్ రాజకీయం అంటే. తనను తాను అతిగా చేసుకుని ఎదుటి వారిని వాడేసుకుని పాలిటిక్స్ లో అందలాలు ఎక్కాలని అమాయకంగా వేసిన ఎత్తులు చిత్తు అయి పవన్ కల్యాణ‌్ మళ్ళీ నేల మీదకే వచ్చారు. ఇపుడు పవన్ రైతుల పరామర్శ పేరిట ఒంటరిగానే తిరుగుతున్నారు. బీజేపీ మిత్ర పక్షం ఉంది కదా. అయినా వారికి మాట మాత్రం కూడా కబురు చేయకుండా పవన్ కల్యాణ‌్ జనసేనానిగానే జనంలోకి వెళ్తున్నారు.

మేలుకొలుపేనా…?

విమర్శలు ఎపుడు మేలు కొలుపుగానే ఉంటాయి. ప్రకాష్ రాజ్ అన్నారని బాధ కానీ నిజాలే చెప్పారు కదా అన్నది అంతరాత్మకు తెలుసు కదా. పవన్ కల్యాణ‌్ పార్టీ పెట్టింది పోటీ చేయడానికి, తాడో పేడో జనంలోనే ఉంటూ తేల్చుకోవడానికి. అందుకే పవన్ జనంలో ఉండాలి. వారి సమస్యల మీద పోరాడాలి. ఏమీ కాకుండా సినిమాలు చేసుకుంటాను, మీరు రాజకీయం చేయండి ఫలితాలు కలసి పంచుకుందామంటే పొత్తు పార్టీలతో కుదిరే వ్యవహారమేనా. మొత్తానికి పవన్ కల్యాణ‌్ కి జనంలోనే ఉండాలని తెలిసిరావడం శుభ పరిణామంగా పార్టీ క్యాడర్ సంతోషపడుతోంది.

నిలకడతోనే ….

సరే పవన్ కల్యాణ‌్ తుఫాన్ కి దెబ్బ తిన్న రైతులను పరామర్శించారు. బాగానే ఉంది. ఇది ఇంతటితో ఆగిపోకూడదు, సమస్యలకూ సాగరకెరటాలకు అంతం ఉండదు, ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారితోనే ఉంటేనే పవన్ కల్యాణ‌్ కీ ఆయన పార్టీకి శ్రీరామ రక్ష. ఎన్నికల వేళ పొత్తులు ఎత్తులు చూసుకోవచ్చు కానీ ఇపుడు మాత్రం జనంలో ఉంటూ పార్టీని పటిష్టం చేసుకోవడం మీద పవన్ కల్యాణ‌్ దృష్టి పెట్టాలి. అదే కనుక జరిగితేనే జనసేన నిలదొక్కుకుంటుంది. రేపటి రోజుల ఏ పార్టీతో పొత్తుల గురించి బేరమాడడానికి శక్తి కూడా వస్తుంది. మొత్తానికి పవన్ కల్యాణ‌్ మళ్ళీ ఒకటి నుంచి రాజకీయ ప్రయాణం మొదలుపెడుతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News