తన ప్లేస్ తానే సెట్ చేసుకున్నారే

రాజ‌కీయం అంటే అదేనేమో. ఓడలు బళ్ళు అవుతాయి. బళ్ళు ఓడలూ అవుతాయి. రాజకీయంలో ఇమేజ్ అనేది కరిగిపోయే కొవ్వొత్తి లాంటిది. దాన్ని క‌రగకుండా చేతులు అడ్డుపెట్టేందుకే జీవితమంతా [more]

Update: 2019-11-02 03:30 GMT

రాజ‌కీయం అంటే అదేనేమో. ఓడలు బళ్ళు అవుతాయి. బళ్ళు ఓడలూ అవుతాయి. రాజకీయంలో ఇమేజ్ అనేది కరిగిపోయే కొవ్వొత్తి లాంటిది. దాన్ని క‌రగకుండా చేతులు అడ్డుపెట్టేందుకే జీవితమంతా ధారపోస్తారంతా. ఏమీ తెలియకుండా రాజకీయల్లో ప్రయోగాలు చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించాల్సివస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రేషన్ అన్నది రాజకీయాలకు చక్కగా వర్తిస్తుంది. అందుకే ఫస్ట్ షాట్ తోనే గట్టిగా కొట్టి గోల్ రీచ్ కావాలి. ఈ మేధమెటిక్స్, పొలిటికల్ ట్రిక్స్ తెలియకపోతే మాత్రం ఇమేజ్ నీరుకారి అవకాశాలు చేజార్చుకోవాల్సివస్తుంది.

జనసేనను స్థాపించి….

ఇదంతా ఎందుకంటే జనసెన అధినేత పవన్ కళ్యాణ్ గురించే. ఆయన 2008 లో యువరాజ్యం అధినేతగా రాజకీయం రంగు పూసుకున్నా కూడా అసలైన నాయకుడు 2014లోనే బయటకు వచ్చాడు. నాడు విభజనకు వ్యతిరేకంగా అయిదు కోట్ల ఆంధ్రుల తరఫున ఒక్కటిగా గర్జించిన పవన్ కళ్యాణ్ ఆ ఆవేశం లో నుంచే జనసేనను స్థాపించారు. నాడు ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే పవన్ కల్యాణ్ రాజకీయ జాతకం వేరేగా ఉండేది. కానీ ఆయన మద్దతుదారు పాత్రలోకి మారిపోయి ఇమేజ్ ని ఫణంగా పెట్టారు. ఇక 2019 ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవాల్సిన సందర్భంలో విడిగా నిలబడి పడిపోయారు.

మద్దతు కోరిన పవన్….

ఎలాంటి పవన్ కళ్యాణ్ ఎలా అయిపొయారని ఇపుడు సెటైర్లు పడుతున్నాయంటే తప్పేం ఉంది. పవన్ కళ్యాణ్ మద్దతు కావాలంటూ ఆయన ఇంటి ముంగిట అప్పటికి మూడున్నర దశాబ్దాల‌ రాజకీయ జీవితం నిండి, రెండు మార్లు సీఎం గా పనిచేసిన చంద్రబాబు నిలబడ్డారంటే ఆ పవన్ కళ్యాణ్ ఎంతటి శిఖరం మీద ఉన్నారో వూహించుకోవాలి. ఇక ప్రధాని అభ్యర్ధి మోడీ పవన్ కళ్యాణ్ ను గౌరవించి తన సరసన కూర్చోబెట్టుకున్న తీరుని తెలుగుదేశం మొత్తం గమనించింది. మరి అదే మోడీ రెండవసారి ప్రధాని అయిన తరువాత తన ప్రమాణానికి పవన్ కళ్యాణ్ ని పిలవకపోవడం కూడా అందరికీ గుర్తే. ఇపుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయి పార్టీ కూడా చతికిలపడి ఉన్నారు. ఈ రోజు ఆయన తాను చేపట్టే ఆందోళనలకు, తనకూ మద్దతుగా నిలబడమని బాబుతో సహా బీజేపీ నేతలకు విన్నపాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అసలు బలం రట్టు అయ్యాక ఆయా పార్టీల స్పందన కూడా అలాగే ఉంటుందిక.

జూనియర్ పాత్రలోనేనా ….

ఏపీలో చంద్రబాబు పార్టీ ప్రధాన ప్రతిపక్షం. అది ఇప్పటివరకూ ఉన్న పొలిటికల్ సీన్. అయితే మరో వైపు బీజేపీ తాము కూడా రేసులో ఉన్నామని చెబుతోంది. ఆ పార్టీకి కేంద్రంలో అధికారం ఉంది కానీ ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. మరి దాదాపుగా ఏడు శాతం ఓట్ల షేర్, కనీసం ఒక సీటు కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకిలా బేలగా మద్దతు రాగాలు ఆలపిస్తున్నారు. జగన్ మీద తొడగొట్టిన పవన్ కళ్యాణ్ సొంతంగా తానే ఎందుకు ఆందోళనలు చేపట్టలేకపోతున్నారు.

బీజేపీ చెప్పినా…..

ఏ పార్టీకి ఆ పార్టీ తమకున్న బలాన్ని పెంచుకోవడానికే ఆందోళన‌లను చేస్తూ ఉంటాయి. ప్రజాసమస్యలపై పోరాటాలే ఎవరికైనా బలన్ని, బలగాన్ని ఇస్తాయి. అది తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ తనకు మద్దతు ఇవ్వండి అంటూ టీడీపీ, బీజేపీలను కోరడంతో అర్ధముందా అంటున్నారు. తాము ఏపీలో ఎవరికీ జూనియర్ పార్టనర్స్ కాదలచుకోలేదని ఇప్పటికే బీజేపీ క్లారిటీగా చెప్పేసింది. మరి ఆ ధైర్యం పవన్ కళ్యాణ్ కి లేదా అని విమర్శలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తాను జూనియర్ పార్టన‌ర్ గా ఉండేందుకు ఇష్టపడుతున్నారా అన్న డౌట్లు కూడా పుట్టుకువస్తున్నాయి. ఇప్పటికైతే మద్దతు వరకూ వచ్చిన పవన్ రేపటి రోజున ఏం చేస్తారో తెలియదు కానీ ఏపీ రాజకీయాలో థర్డ్ ఫోర్స్ గా నిలబడతాడనుకున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ టీడీపీ పక్కన నిలబడడం ద్వారా తన ప్లేస్ తానే సెలెక్ట్ చేసుకున్నారని అంటున్నారు.

Tags:    

Similar News