కలసిరారని ఇక డిసైడ్ అయ్యారా..?

అదేంటి పవర్ స్టార్ అని ముందు ట్యాగ్ ఉంది కదా. ఆయన విలన్ ఏంటి అని షాక్ తింటారు కరడు కట్టిన ఫ్యాన్స్ కానీ. హీరో అంటే [more]

Update: 2020-11-06 15:30 GMT

అదేంటి పవర్ స్టార్ అని ముందు ట్యాగ్ ఉంది కదా. ఆయన విలన్ ఏంటి అని షాక్ తింటారు కరడు కట్టిన ఫ్యాన్స్ కానీ. హీరో అంటే సినిమా తెర మీద మాత్రమే. ఇక రియల్ లైఫ్ లో పవన్ కల్యాణ్ అందరికీ హీరోగా కనిపించాలని లేదు కదా. ఆ మాటకు వస్తే జగన్ సినిమాలో పవన్ కల్యాణ్ విలన్. పవన్ సినిమాలో జగన్ విలన్. ఇక చంద్రబాబు సినిమాలో కూడా లేట్ గా అయినా లేటెస్ట్ గా పవన్ కల్యాణ్ విలన్ అయ్యారట. ఇది నిజంగానే గమ్మత్తు అయిన విషయమే. కానీ మాట్లాడుకుంటే ఫక్త్ రాజకీయం అని సరిపెట్టుకోవాలి. ఇక్కడ మిత్రులు శత్రువులు ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఆరేళ్ళుగా చంద్రబాబుకి ప్రియ మిత్రునిగా పవన్ మెలిగారు. మరో వైపు దత్తపుత్రుడు అంటూ వైసీపీ హేళన చేసినా కూడా పవన్ కూడా అదే కమిట్మెంట్ చూపించారని అంటారు.

దూరం అలా ….

పవన్ కల్యాణ్ ఒక విధంగా చెప్పాలంటే ఏపీ రాజకీయాలకే దూరంగా ఉన్నారనుకోవాలి. ఆయన పొత్తు పెట్టుకున్న బీజేపీ విషయం తీసుకుంటే అన్నీ గందరగోళం వ్యవహారంగానే సాగుతోంది. అమరావతి రాజధాని కధ తేల్చదు, ముంచదు, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని సరిపెట్టుకున్న కూడా పోలవరాన్ని తాజాగా ముంచేసే అధ్యాయంగా తేల్చేసింది. దాంతో ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని పవన్ కల్యాణ్ నోరు మెదపలేదు అంటున్నారు. పైగా ఏపీ రాజకీయాలే దారుణంగా ఉన్నాయని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారని టాక్. బీజేపీ విషయంలో కూడా కొంత అసంతృప్తి ఉండడం వల్లనే పవన్ కల్యాణ్ వరసగా సినిమాలకు కమిట్ అవుతున్నారని కూడా చెబుతున్నారు.

గుస్సా అవుతున్న నేస్తం ….

గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కి గాజువాక, భీమవరం లో గెలిచేందుకు పరోక్ష సహకారం ఇచ్చి వైసీపీకి టార్గెట్ అయి తగిన మూల్యాన్ని టీడీపీ చెల్లించుకుంది. ఇక ఏడాదిన్నరగా వైసీపీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాజకీయంగా పోరాడుతోంది. కానీ నమ్ముకున్న పవన్ కాస్తా బీజేపీకి జై కొట్టి టీడీపీకి దూరం కావడాన్ని పసుపు పార్టీ సహించలేకపోతోందిట. అంతే కాదు. చంద్రబాబు కలల రాజధాని అమరావతి విషయంలో పవన్ కల్యాణ్ కనీసం పెదవి విప్పి మాట సాయం అయినా చేయకపోవడం పట్ల కూడా తమ్ముళ్ళు గుస్సా అవుతున్నారట. ఇక ఇపుడు స్థానిక ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా ఆయన చల్లని నీడలో హాయిగా జరిపించుకుందామని, వీలైనంత రాజకీయ లబ్ది పొందుదామని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలకు పవన్ కలసిరాకపోవడం పట్ల కూడా టీడీపీ మండిపోతోందిట. అందుకే అనుకూల మీడియాలో పవన్ కల్యాణ్ మీద మళ్ళీ వ్యతిరేక కధనాలు దగ్గరుండి మరీ రాయిస్తోందని అంటున్నారు. పవన్ కల్యాణ్ ను బదనాం చేసేందుకు మళ్ళీ టీడీపీ కొత్త స్కెచ్ ని వేసిందని అంటున్నారు.

కలసిరారనా…?

పవన్ కళ్యాణ్ ఇక తమతో కలసి రారు అన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చేశారా అన్న డౌట్లు ఇక్కడ వస్తున్నాయి. బీజేపీ వైసీపీల మధ్యన బయటపడని జిగినీ దోస్తీ ఉంది. అలాగే పవన్ కల్యాణ్ కూడా బీజేపీతోనే అంటకాగుతున్నారు. ఏపీలో టీడీపీ పోరాటం ఒంటరిగా మారుతోంది. పవన్ 2024లో నైనా ఇటు వైపు వస్తారన్న గ్యారంటీ కూడా లేకపోవడంతో టీడీపీ తెగించి మరీ ఆయన మీద వ్యతిరేక కధనాలకు ఓకే చెప్పేసింది అంటున్నారు. ఈ దెబ్బతో పవన్ కల్యాణ్ అటో ఇటో తేలిపోవాలి అన్నది టీడీపీ ప్లాన్ అంటున్నారు. కాగా పవన్ ఒకవేళ తమతో కలవకపోయినా ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తే జగన్ వ్యతిరేక ఓట్లు గుత్తమొత్తంగా తమకే పడతాయి అన్న ముందు చూపుతోనే ఇలా టీడీపీ వ్యూహం రూపొందించింది అంటున్నారు. మొత్తానికి పవర్ స్టార్ టీడీపీకి కొత్త విలన్ కావడం రాజకీయ విచిత్రంగానే చూడాలి.

Tags:    

Similar News