పవన్ ఆ ప్రెజర్ వల్లనే ఈ డిసెషన్ తీసుకున్నారా?

పవన్ కల్యాణ్ ఏ ముహూర్తాన పార్టీ పెట్టారో కాని ఆయన ఏ విషయంపైనా ఒక స్పష్టత ఉండటం లేదు. పార్టీ ని స్థాపించిన తర్వాత ఆయన అనేక [more]

Update: 2020-10-18 12:30 GMT

పవన్ కల్యాణ్ ఏ ముహూర్తాన పార్టీ పెట్టారో కాని ఆయన ఏ విషయంపైనా ఒక స్పష్టత ఉండటం లేదు. పార్టీ ని స్థాపించిన తర్వాత ఆయన అనేక పార్టీలతో వేసిన అడుగులే చెప్పకనే చెబుతాయి. ఏపీ విషయంలో జసేనన అధినేత పవన్ కల్యాణ్ సీరియస్ గానే ఉన్నారని చెప్పాలి. అక్కడే తమ పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఆయన కుంది. అయితే తెలంగాణలో పరిస్థితి వేరు. ఇక్కడ పవన్ కల్యాణ్ ను స్థానికేతరుడిగానే గుర్తిస్తారు.

ఏపీలో పొత్తు పెట్టుకున్నా…..

అయితే ఏపీలో పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణలోనూ అదే పద్ధతిని పవన్ కల్యాణ్ కొనసాగించాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఆయన బీజేపీకి బహిరంగంగా మద్దతిచ్చే పరిస్థితి కన్పించడం లేదు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. తెలంగాణ జనసేనను పట్టించుకునే పరిస్థితి లేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన నేతలు పోటీ చేస్తామంటున్నా దానిపై ఇంతవరకూ పవన్ నుంచి క్లారిటీ రాలేదు.

బీజేపీతో కలసి….

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టగానే బండి సంజయ్ ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా కలసి వచ్చారు. భవిష్యత్ లో కలసి పనిచేద్దామని చెప్పారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ‌్ దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. తమ పార్టీ అభ్యర్థులను కూడా ఇక్కడ బరిలోకి దింపే అవకాశం లేదని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే బీజేపీకి కూడా బహిరంగంగా పవన్ కల్యాణ్ మద్దతిచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

అధికార పార్టీ నుంచి వత్తిళ్లు….

ఇందుకు ప్రధాన కారణం అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న వత్తిళ్లేనంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. సినిమా ఇండ్రస్ట్రీ మొత్తం టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంది. గ్రేటర్ ఎన్నికలను మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో సినిమా ఇండ్రస్ట్రీ నుంచి వ్యతిరేకంగా ఎవరూ గళం విప్పే అవకాశం లేదు. ప్రస్తుతం కరోనాతో ఇండ్రస్ట్రీ సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి వచ్చిన వత్తిడులతో పవన్ కల్యాణ్ గ్రేటర్ లో పోటీకి నో చెబుతున్నారని తెలిసింది. ఏపీలో తన మిత్రపక్షమైన బీజేపీకి కూడా ఆయన బహిరంగంగా మద్దతు ప్రకటించే అవకాశం లేదంటున్నారు.

Tags:    

Similar News