పవన్ పునాది వేశారా?

సినీ స్టార్ గా వచ్చి పొలిటికల్ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పాఠాలు తొందరగానే నేర్చుకుంటున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఇసుక [more]

Update: 2019-11-01 09:30 GMT

సినీ స్టార్ గా వచ్చి పొలిటికల్ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పాఠాలు తొందరగానే నేర్చుకుంటున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఇసుక సమస్యపై జనసేన తలపెట్టిన ఉద్యమం విజయవంతానికి పవన్ తెలుగుదేశం సహా అన్ని పార్టీల మద్దతు కోరడం చర్చనీయాంశం అవుతుంది. కామ్రేడ్ లు ఎలాగూ తనతోబాటే కాబట్టి మిగిలివున్న విపక్షాలను కలుపుకుని పోయి బలమైన అధికారపార్టీపై ఉద్యమించాలని జనసేనాని వ్యూహం రచించారు. ఉమ్మడి శత్రువు జగన్ పై యుద్ధం చేయడం అంత ఈజీ కాదని గ్రహించిన పవన్ కల్యాణ్ అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. దీనిద్వారా విపక్షాల్లో ఐక్యతను కూడగట్టే పునాదిని తొలిసారిగా విశాఖ వేదికగా చేసేందుకు పవన్ శ్రీకారం చుట్టారు.

మైలేజ్ సమస్య ను పక్కన పెట్టి …

రాజకీయ పార్టీలు ప్రజాసమస్యలపై పోరాడే కార్యక్రమాల్లో మైలేజ్ ఏ పార్టీకి వస్తుందనే అంశం ప్రధానంగా లెక్కేసుకుంటాయి. సమైక్యాంధ్ర ఉద్యమం కానీ, ఎపి కి ప్రత్యేక హోదా అంశంలోనూ ఈ మైలేజ్ గొడవే ప్రధానమయ్యి అసలు అజెండా పక్కన పడింది. ఎవరికి వారే విడివిడిగా పోరాటాలు చేయడం ఒకరి విధానాన్ని మరొకరు ఎగతాళి చేసుకోవడంతో పోరాటం వృధా అయ్యింది. ఇది గుర్తించిన జనసేన పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టక తప్పదని తొలిఅడుగు పవన్ కల్యాణ్ వేశారు.

మైలేజీ కోసమేనా?

తమ పార్టీకి మైలేజ్ కన్నా ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమనే సంకేతాన్ని జనంలోకి బలంగా పంపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ కార్యక్రమం విజయవంతం అయితే అధిక మైలేజ్ జనసేనకు దక్కడంతో బాటు రాజకీయాలకు అతీతంతంగా తమ పార్టీ వెళుతుందనే భావన రావాలన్నది పవన్ కల్యాణ్ ఆలోచనగా విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News