పవన్ ను దూరం చేసే పక్కా ప్లాన్ ?

పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకం అవుతున్నారు. ఆయన సొంతంగా ఎక్కడా ఒక్క సీటు గెలవలేదు, ఏకైక‌ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ పార్టీలో ఉన్నాలేనట్లే. అయినా [more]

Update: 2020-08-08 12:30 GMT

పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకం అవుతున్నారు. ఆయన సొంతంగా ఎక్కడా ఒక్క సీటు గెలవలేదు, ఏకైక‌ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ పార్టీలో ఉన్నాలేనట్లే. అయినా పవన్ పొలిటికల్ గ్లామర్ మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. పవన్ ని మచ్చిన చేసుకుని బీజేపీ చంద్రబాబుకు భారీ దెబ్బ కొట్టింది. లేకపోతే ఈపాటికి అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు పక్కన నిలబడి గట్టిగా గర్జించేవారే. కానీ ఇపుడు ఆయన కాషాయం పార్టీ లైన్లోని వెళ్ళిపోయారు. అంతే కాదు, చంద్రబాబు మీద డైరెక్ట్ గా బాణాలు వేస్తున్నారు. తప్పంతా అసలు బాబుదేనని కూడా అంటున్నారు.

కాంగ్రెస్ ద్వారా….

ఇక అమరావతి ఉద్యమం అన్నది ఏదో అన్నట్లుగా సాగుతోంది. నిజానికి జగన్ సర్కార్ మూడు రాజధానుల బిల్లునకు గవర్నర్ ఆమోదం తెలిపిన నాడు అతి పెద్ద భూకంపమే వస్తుందనుకున్నారు. దాంతో అమరావతి ప్రాంతంతో పాటు, రాజ్ భవన్ వద్ద కూడా గట్టి పోలీస్ బందోబస్తు కూడా పెట్టారు, కేంద్ర బలగాలను వైసీపీ సర్కార్ కోరినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అలా అక్కడేమీ జరగలేదు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మహిళా నేత సుంకర పద్మశ్రీ, జేఏసీ తరఫున నేతలు హాజరరయ్యారు. మొదటి రోజు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరరావు హడావుడి చేశారంతే. అయితే కాంగ్రెస్ నేత పద్మశ్రీ మాత్రం పవన్ మీద బాణాలు వేశారు. ప్రశ్నిస్తాను అని వచ్చిన పవన్ కళ్యాణ్ రైతులను పచ్చి దగా చేశారని కూడా దుయ్యబెట్టారు.

వత్తిడిలో సేనాని…

ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీ నేతలను టీడీపీ నేరుగా విమర్శించకుండా విపక్షాల ద్వారా కాగలకార్యాన్ని నడిపిస్తోంది. ఇప్పటికే సీపీఐ నేత నారాయణ మోదీ మీద గట్టిగా విరుచుకుపడ్డారు. ఇదంతా మోడీ చేస్తున్నారు అని కూడా ఆయన ఆరోపించారు. తెరవెనక బీజేపీ లేకపోతే జగన్ ఇంత సాహసం చేయరని కూడా నారాయణ విసుర్లు విసిరారు. ఇక పీసీసీ ప్రెసిడెంట్ శైలజానాధ్ కూడా మోడీ, బీజేపీ దగ్గరుండి జగన్ చేత అంతా చేయిస్తున్నారని విరుకుపడ్డారు. ఏపీని విచ్చిన్నం చేయడానికి బీజేపీ కంకణం కట్టుకుంది అని కూడా గట్టిగానే తగులుకున్నారు ఈ పరిణామాలు ఇపుడు జనసేనాని పవన్ కళ్యాణ్ పై బాగానే వత్తిడి తెస్తున్నాయని అంటున్నారు. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుని నోరు కట్టేసుకుంటున్నారు. అమరావతి వచ్చి రైతులకు ఇచ్చిన మాట తప్పారని, పోరాటం చేయడం లేదని కూడా పవన్ కళ్యాణ్ మీద అన్ని పార్టీలు విమర్శలు చేయడంతో తాము రైతుల పక్షానేనని ప్రకటన చేయాల్సివచ్చింది.

విడగొడతారా….

చంద్రబాబు మాస్టర్ బ్రెయిన్ చూస్తూంటే తాను తెర వెనక ఉండి ఏపీలో బీజేపీని బదనాం చేయలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. 2019 ఎన్నికల వేళ డైరెక్ట్ గా ఫైట్ చేసి మోడీని దూషించి ఇంతదాకా తెచ్చుకున్న చంద్రబాబు ఇపుడు తాను మౌనంగా ఉంటూ ఏపీలో బీజేపీని కాలు పెట్టనీయకుండా చేసే వ్యూహానికి పదును పెడుతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా కేంద్రంలోని మోడీని విమర్శించకుండా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజును మాత్రం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చెడుగుడు ఆడుకున్నారు. అమరావతి రాజధాని మీద పూటకోమాట మాట్లాడే వీర్రాజు బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పగలరా అంటూ అయ్యన్న మండిపడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అమరావతి జేఏసీతో కలవాలని, బీజేపీని వీడి రావాలని రైతులు కోరుతున్నారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ఉద్యమం చేస్తే మద్దతుగా ఉంటామని సుంకరి పద్మశ్రీ వంటి వారు చెబుతున్నారు. మరి పవన్ బీజేపీతో పొత్తు తెంచుకుని రాగలరా. అయితే బాబు మాత్రం ఏపీలో పొలిటికల్ మంటలు గట్టిగా రేపితే అనివార్యంగా పవన్ కళ్యాణ్ బయటకు రావచ్చు అని కూడా అంటున్నారు చూడాలి మరి.

Tags:    

Similar News