పవన్ లైన్ మార్చుకున్నారే… అందుకేనా ….?

నిన్న మొన్నటివరకు టిడిపి ప్రో గా వున్న జనసేన గొంతు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అదేమిటి అంటే బిజెపి స్లోగన్ నే జనసేన డిటో వినిపించడం గమనార్హం. [more]

Update: 2020-08-03 12:30 GMT

నిన్న మొన్నటివరకు టిడిపి ప్రో గా వున్న జనసేన గొంతు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అదేమిటి అంటే బిజెపి స్లోగన్ నే జనసేన డిటో వినిపించడం గమనార్హం. జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశంపై జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మూడు గంటలకు పైగా సుదీర్ఘ చర్చ సాగించింది. అది పూర్తి అయిన తరువాత జనసేనాని పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు ల వ్యాఖ్యలు బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఏ వ్యాఖ్యలు చేశారో ఇంచుమించు అదే అర్ధం వచ్చేలా లైన్ తీసుకున్నారు. రైతుల పక్షాన తాము నిలుస్తామని చెప్పడంతో బాటు తెలుగుదేశం వల్లే ఇన్ని అనర్ధాలు అంటూ చంద్రబాబు దే తప్పంతా అని తేల్చేశారు. ఇక పనిలో పని అధికారపక్షం, విపక్షం రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం విశేషం.

టార్గెట్ వారే …

జనసేన, బిజెపి లను టార్గెట్ చేస్తూ శుక్రవారం నుంచి టిడిపి మీడియా ప్రచారం హోరెత్తించింది. తప్పంతా కేంద్రం డైరక్షన్ లోనే జరిగిందని ఆరోపిస్తూ ఈ కథనాలు నడిచాయి. వీటిపై బిజెపి ఇప్పటికే దాడి మొదలు పెట్టింది. చంద్రబాబు అమరావతిని ఎంపిక చేసినప్పుడు కానీ జగన్ మూడు రాజధానులు చేస్తామన్నప్పుడు కేంద్రానికి ఏమి సంబంధం అంటూ వ్యాఖ్యానించింది. తాజాగా టిడిపి బ్లేమ్ గేమ్ ను జనసేన సైతం తీవ్రంగా దుయ్యబట్టింది.

రెండు పార్టీలను….

ఐదేళ్ళు పరిపాలించిన టిడిపి ఒక్క భవనాన్ని పూర్తి చేయకుండా ఇప్పుడు రాజకీయం చేయడాన్ని జనసేన తప్పుపట్టింది. రైతుల కన్నీళ్ళ తో కొత్త రాజధాని నిర్మాణం సరికాదంటూ వైసిపి కి చురకలు వేసింది. ఇలా రెండు పార్టీలు రైతులను నిండా ముంచాయంటూ వారికి మద్దతుగా తాము ఉంటామంటూ బిజెపి ఎజండా నే జనసేన పట్టుకుంది. అధికార విపక్షాలు అన్యాయం చేశాయని తామే వారికి అండగా నిలబడుతున్నట్లు చెప్పుకురావడం విశేషం.

Tags:    

Similar News