పవన్… ఇలా ప్లేట్ ఫిరాయిస్తే ఎలా ?

నిలకడ లేని నాయకుడు పవన్ కల్యాణ్ అన్న విమర్శను ప్రత్యర్థులు తరచూ చేస్తూంటారు. అది తప్పు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత పవన్ మీద ఉంది. కానీ పవన్ [more]

Update: 2020-07-30 13:30 GMT

నిలకడ లేని నాయకుడు పవన్ కల్యాణ్ అన్న విమర్శను ప్రత్యర్థులు తరచూ చేస్తూంటారు. అది తప్పు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత పవన్ మీద ఉంది. కానీ పవన్ తాను అలాగే ఉంటాను అంటున్నట్లుగానే రాజకీయం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తాజాగా ఇచ్చిన ఆన్ లైన్ ఇంటర్వ్యూలను తీసుకుంటే ఆయన విమర్శించాలి కాబట్టి వైసీపీని విమర్శిస్తున్నారా అన్నట్లుగానే తీరు ఉంది. కరోనా మహమ్మారి విషయంలో జగన్ సర్కార్ దే తప్పు అని అంటున్న పవన్ కల్యాణ్ గతంలో తాను ఇదే జగన్ ప్రభుత్వాన్ని పొగిడిన సంగతిని మరచినట్లున్నారు. ఇదే ఇంటర్యూలో పవన్ కల్యాణ్ జగన్ సర్కార్ చేతులెత్తేసింది, అందువల్ల ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని
తామే కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఇదే మాట మరోలా అని ఉంటే పవన్ లో మరో తరహా నాయకుడిని జనం చూసేవారేమో.

అంతలోనే అలా……

పవన్ కల్యాణ్ కి చంద్రబాబుకు తేడా ఉందని జనం అనుకోవడానికి ఆయన భిన్న వైఖరిని ప్రదర్శిస్తేనే వీలు అవుతుంది. చంద్రబాబు వైసీపీ సర్కార్ మంచి చేసినా కూడా అందులో చెడునే చూస్తారు. ఆ సంగతి జనాలకు కూడా తెలుసు. అందుకే వారు బాబు మాటలను ఎపుడూ అంత సీరియస్ గా తీసుకోరు. మరి కొత్త రాజకీయం చేస్తానని వచ్చిన పవన్ కల్యాణ్ కూడా బాబు మాదిరిగానే ఊసుపోని విమర్శలు చేస్తే ఆయనకు విలువ ఏముంటుంది. పైగా తాను అన్న మాటలకే ఆయన కట్టుబడి ఉండకపోతే జనం కూడా ఎందుకు వాటిని ఆలకిస్తారు. జగన్ సర్కార్ కరోనా కట్టడి విషయంలో బాగా పనిచేస్తుందని చెప్పిన పవన్ కల్యాణ్ పట్టుమని పది రోజులు తిరగకుండానే ఫ్లేట్ ఫిరాయిస్తే ఇక ఆయన చెప్పిన మాటలు జన సైనికులు అయినా నమ్ముతారా.

నాడెందుకు చెప్పలేదో …?

అప్పులు ఎప్పుడూ చేటే చేస్తాయి. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఒక చిన్న కుటుంబం అయినా అంతే. ఏపీ ఆర్ధిక పరిస్థితి దారుణంగానే ఉంది. అది అందరికీ తెలిసిందే. జగన్ సర్కార్ సైతం అప్పులు ఎక్కువగా చేస్తోంది. మరి దానికి ముందున్న చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా సంపదను పెంచిందా. నాడు కూడా రెండున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏపీ మీద రుద్దారు. నాడే పవన్ కల్యాణ్ ఇలా అప్పుల గురించి చంద్రబాబుని నిలదీసి ఉంటే ఆయన చిత్తశుధ్ధి ఏపీ పట్ల ఉన్న నిబధ్ధత అర్ధమయ్యేవి. కానీ అయిదేళ్ళ కాలం కళ్ళు మూసుకుని ఇపుడే నిద్ర లేచినట్లుగా జగన్ సర్కార్ అప్పులు చేస్తోంది అంటూ గావు కేకలు పెట్టడం ద్వారా తాను బాబు గుప్పిట మనిషిని అని జనసేనాని చెప్పేసుకుంటున్నారు.

సొంత ఉనికేదీ…?

ఇవన్నీ పక్కన పెడితే నాలుగు దశాబ్దాల టీడీపీ ఓ వైపు ప్రతిపక్షంగా ఉంది. అక్కడ అనుభవం కలిగిన నేత చంద్రబాబు ఉన్నారు. ఎంత కాదనుకున్న వైసీపీ, టీడీపీల మధ్యనే రాజకీయ సమరం సాగుతోంది. మరి మధ్యలో వచ్చిన జనసేన జనం ద్రుష్టిని తనవైపు తిప్పుకోవాలంటే చేయాల్సింది చాలానే ఉంటుంది. బాబుకు అమరావతి రాజధాని జీవన్మరణ సమస్య. ఆయన రాజకీయాలు, అవసరాలు దానితో ముడిపడి ఉన్నాయి. పవన్ కల్యాణ్ కి ఎందుకు ఆ ఆరాటం. మూడు ప్రాంతాల అభివ్రుధ్ధిని తాను కోరుకుంటున్నాను అని చెప్పాల్సిన బాధ్యత కలిగిన పవన్ బాబు మాదిరిగానే అమరావతి ఒకటే రాజధాని అని మొరపెట్టుకుంటే ఆయన్ని జనం ఎందుకు పట్టించుకుంటారు. ఒకవేళ అమరావతే రాజధానిగా ఉన్నా కూడా ఆ క్రెడిట్ చంద్రబాబుకే పోతుంది తప్ప పవన్ కల్యాణ్ కి అక్కడ వారు ఓట్లు వేయరు. ఇక మూడు రాజధానుల విషయంలో సొంత ఆలోచనలకు పదును పెడితేనే పవన్ వైపు జనం చూసేది. కానీ ఇప్పటికీ అయన బాబు లైన్లోనే నడుస్తూంటే 2024 ఎన్నికల మీద కూడా ఆశలు వదులుకోవాలేమో మరి.

Tags:    

Similar News