ఇక పవన్ పాదయాత్ర… అంతా వారి డైరెక్షన్ లోనే ?

అవును. పాదయాత్ర. అధికార పీఠానికి దగ్గర తోవ. పాదయాత్ర చేసి ఏపీలో ముగ్గురు నాయకులు ముఖ్యమంత్రి కుర్చీ పట్టేసారు. మొదట వైఎస్సార్ పాదయాత్రను ఏపీలో తొలి రాజకీయ [more]

Update: 2020-07-02 05:00 GMT

అవును. పాదయాత్ర. అధికార పీఠానికి దగ్గర తోవ. పాదయాత్ర చేసి ఏపీలో ముగ్గురు నాయకులు ముఖ్యమంత్రి కుర్చీ పట్టేసారు. మొదట వైఎస్సార్ పాదయాత్రను ఏపీలో తొలి రాజకీయ ప్రయోగంగా చేపడితే చంద్రబాబు దాన్ని అనుసరించి 2014లో సీఎం అయ్యారు. ఇక 2017లో జగన్ పాదయాత్ర స్టార్ట్ చేసి 2019 నాటికి ముఖ్యమంత్రి అయిపోయారు. దీన్ని బట్టి అర్ధమైంది ఏంటి అంటే పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రులు అవుతారని, బహుశా ఇపుడు జనసేనాని పవన్ కల్యాణ్ కి కూడా ఇదే రాజమార్గంగా తోస్తోందిలా ఉంది. ఆయన కూడా పాదయాత్ర చేయాలనుకుంటున్నారుట. దాని వెనక బీజేపీ పెద్దల డైరెక్షన్ కూడా ఉందని అంటున్నారు.

అది ముహూర్తం …..

షెడ్యూల్ చూస్తే సార్వత్రిక ఎన్నికలు ఏపీలో 2024లో జరుగుతాయని అంటున్నారు. దానికి రెండేళ్ళు ముందు అంటే 2022 నాటికి పవన్ కల్యాణ్ పాదయాత్ర మొదలుపెడతారని, మెల్లగా ఊర్లూ, పల్లెలూ దాటుకుంటూ గమ్యం చేరేసరికి ఎన్నికలు వస్తాయని ఆ వేడిలో పరిస్థితిని మొత్తం సానుకూలం చేసుకోవచ్చినని పధక రచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే పవన్ ఇపుడు ధీమాగా ఉన్నారని, ఎక్కడికీ కదలడంలేదని అంటున్నారు. ఇక 2020ని పూర్తిగా కరోనాకు అంకితం చేస్తున వేళ 2021 నాటికి పెండింగు పనులు అన్నీ పూర్తి చేసుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారుట. పెండింగు పనులు అంటే సినిమా షూటింగులు వగైరాలన్న మాట.

బీజేపీ దన్ను ….

ఇక పవన్ కల్యాణ్ పాదయాత్ర మొత్తం బీజేపీ కనుసన్నల్లో జరుగుతుంది అంటున్నారు. బీజేపీకి ఏపీలో ఎటూ ఫేస్ వాల్యూ ఉన్న నాయకులు లేరు. దాంతో పవన్నే నమ్ముకుంది. పవన్ని ముందు పెట్టి బొమ్మాడించాలనుకుంటోంది. ఆ విధంగా పవర్ స్టార్ కనుక 2022లో మంచి రోజు చూసుకుని తొలి అడుగు వేస్తే వెనకాల షెడ్యూల్ అంతా చూసుకోవాలని రాజకీయ నిర్మాత బీజేపీ భావిస్తోందిట. పవన్ కల్యాణ్ కి రాజకీయం తెలియదు కాబట్టి. ఆయన్ని ఎలా ఫోకస్ చేయాలి. ఏ రకంగా స్పీచ్ ఇప్పించాలి.మూడు ప్రాంతాల్లో ఏ విధంగా జనాల సమస్యలు వల్లించాలి. ఏ విధంగా హామీలు ఇవ్వాలి. ఎలా జనం మనసు గెలవాలి ఇలా అన్నీ కూడా బీజేపీ డైరెక్షన్లోనే సాగుతాయని అంటున్నారు.

వర్కౌట్ అవుతుందా …..

ఏపీలో పాదయాత్ర ఎపుడు టార్గెట్ ని తప్పలేదు. ఛేదించిన బాణం కచ్చితంగా రాజకీయ లక్ష్యాన్ని చేరుకుని ఫలితాన్ని ఇచ్చింది. అయితే అన్ని వేళ్ళల్లోనూ అది సాధ్యమా అంటే చెప్పలేమని అంటున్నారు. నాయకుడికి బలం ఉండాలి, పార్టీ పటిష్టంగా ఉండాలి. జనంలో అతని నాయకత్వం మీద నమ్మకం ఉండాలి. అపుడే పాదయాత్ర సక్సెస్ అవుతుంది. ఒకపుడు పాదయాత్రను మాజీ ప్రధాని దివంగత నేత చంద్రశేఖర్ మొదలుపెట్టి దేశమంతా తిరిగారు. కానీ రాజకీయ లాభం ఒక్క ఎంపీగా కూడా రాలేదు. కారణం ఆయనకు స్వతహాగా పార్టీ బలం లేకపోవడమే. ఇపుడు ఏపీలో కూడా బీజేపీ, జనసేన వంటి పార్టీలకు సంస్థాగతంగా పెద్దగా బలం లేదు. టీడీపీ, వైసీపీ గట్టి పార్టీలుగా ఉన్నాయి. ఇక పవన్ కల్యాణ్ నిలకడ లేని రాజకీయం చేస్తారని పేరు. దాంతో పాదయాత్ర నాటికి పవన్, ఆయన పొత్తుల పార్టీలు మారితే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో.

Tags:    

Similar News