పవన్ ది తప్పించుకునే ధోరణి కాక మరేమిటి?

జనసేన పార్టీలో ఎవరి రూట్ ఏమిటో ఎవరికి అర్ధం కావడం లేదు. ఆ పార్టీ కి ఉన్న ఏకైక ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ ఏ పార్టీలో ఉన్నారో [more]

Update: 2020-05-24 16:30 GMT

జనసేన పార్టీలో ఎవరి రూట్ ఏమిటో ఎవరికి అర్ధం కావడం లేదు. ఆ పార్టీ కి ఉన్న ఏకైక ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ ఏ పార్టీలో ఉన్నారో అధినేత పవన్ కల్యాణ్ కే అర్ధం కాని పరిస్థితి. ఇక సోదరుడు నాగబాబు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా అది ఆయన వ్యక్తిగతం అని పవన్ కల్యాణ్ ప్రకటించాలిసి వచ్చింది. అంటే పార్టీ లో క్రమశిక్షణ అంశం లేనట్లేనని విమర్శకులు, విశ్లేషకులు తేల్చేస్తున్నారు. ఇలా గత ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటినుంచి మరింత కిందా మీదా పడుతుంది జనసేన.

నాగబాబు వ్యాఖ్యలపై తటస్థ ధోరణి…

ప్రశ్నిస్తా అంటూ రాజకీయ తెరపై అరంగేట్రం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ పార్టీలో జరుగుతున్న అనేక పరిణామాలను అంతా ప్రశ్నలు సంధించే తీరుగా పార్టీని నడుపుతున్నారు. అదే ఇప్పుడు జనసేన కార్యకర్తలను వేధిస్తుంది. ప్రస్తుతం పార్టీలో ఉన్నవారు కేవలం పవన్ వీరభక్తులే అధికం. గత ఎన్నికల ఫలితాల తరువాత ఆయారాం గయారాం లు మూటాముల్లె సర్దుకుని నచ్చిన పార్టీల్లోకి వెళ్ళి సెటిల్ అయ్యారు. దాంతో పవన్ కల్యాణ్ మాట ను వేదం గా భావించే వారే అంతా ఉన్నా సొంత సోదరుడి వ్యాఖ్యలు ఖండించలేని పరిస్థితి అధినేతకు వచ్చింది.

ఇరకాటంలోకి నెట్టిన సోదరుడు …

గాంధీ, గాడ్సే లపై అన్న నాగబాబు వ్యాఖ్యలను సమర్ధిస్తే ఒక ఇబ్బంది వ్యతిరేకిస్తే మరొక సమస్య అన్న రీతిలో వ్యక్తిగతం ఆ వ్యాఖ్యలు అని తప్పించుకునే ధోరణినే పవన్ కల్యాణ్ ఎంచుకున్నారన్న విమర్శలు నెట్టింట మొదలు అయ్యాయి. ఇవే వ్యాఖ్యలు జనసేన లోని నేతలు కానీ, కార్యకర్తలు చేస్తే పవన్ కల్యాణ్ వ్యక్తిగతం అనేందుకు సాహసిస్తారా అన్నది మరో చర్చకు తెరతీసింది. మొత్తానికి జనసేన లో క్రమశిక్షణ అనేది కరువు అవుతున్న నేపథ్యంలో పార్టీని అధినేత దారిలో పెట్టడం మొదలు పెట్టాలిసి ఉందని అంటున్నారు. అదే విధంగా పార్టీ కి వచ్చే నాలుగేళ్లలో ఏం చేయాలి ఎలా చేయాలి అనేదానిపై దిశా దశా అధినేత పవన్ కల్యాణ్ డిసైడ్ చేయాలన్నది క్యాడర్ కోరుకుంటున్నది. మరి పవన్ కళ్యాణ్ ఇకపై ఎలాంటి అడుగులు వేస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News