బాబే బెటరట.. పవన్ డిసైడ్ అయిపోయారా?

పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు. ఆయనకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా, కర్నాటక, తమిళనాడు లో కూడా ఫ్యాన్స్ బాగా ఉన్నారు. పవన్ 2014 ఎన్నికల వేళ బీజేపీకి [more]

Update: 2020-05-02 00:30 GMT

పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు. ఆయనకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా, కర్నాటక, తమిళనాడు లో కూడా ఫ్యాన్స్ బాగా ఉన్నారు. పవన్ 2014 ఎన్నికల వేళ బీజేపీకి మద్దతు ప్రకటించారు. అప్పట్లో ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీతో స్వయంగా మాట్లాడారు. మోడీ కూడా పవన్ కల్యాణ్ కి ఎంతో విలువ ఇచ్చారు. బీజేపీ నేతల సూచనలతో టీడీపీకి కూడా పవన్ మద్దతు ఇచ్చారు. ఆ తరువాత చంద్రజాలంతో పవన్ కల్యాణ్ పచ్చ శిబిరంలో ముఖ్య మద్దతుదారుగా మారిపోయారు. దాంతో బీజేపీతో దూరం పెరిగింది. మధ్యలో ప్రత్యేక హోదా మీద పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఆయన రాజకీయం సరిగ్గా చేసుకోలేక, మోడీని అర్ధం చేసుకోలేక వేసిన పిల్లి మొగ్గలతో 2019 ఎన్నికల్లో బీజేపీకి బద్ధ విరోధులైన వామపక్షాలతో జట్టుకట్టి భంగపడ్డారు.

పట్టనితనం పైనే …?

ఇక పవన్ కల్యాణ్ మళ్ళీ దారికి వచ్చి ఈ ఏడాది మొదట్లో బీజేపితో పొత్తు పెట్టుకున్నారు. ఆ సమయంలో ఆయన చాలా ధీమాగా మాట్లాడారు. ఏపీలో బలమైన కూటమి తమదని, వైసీపీని గద్దె దించి 2024లో అధికారంలోకి వస్తామని కూడా చెప్పుకున్నారు. అయితే అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరోటిలా సీన్ ఉంది. ఏపీ బీజేపీలో పలు వర్గాలు ఉన్నాయి. పేరుకు ఏపీలో చిన్న పార్టీ అయినా జాతీయ స్థాయి నేపధ్యం ఉండడంతో జనసేనకు అసలు పట్టించుకోవడంలేదని అంటున్నారు. పవన్ కల్యాణ్ విషయంలో బీజేపీ కేంద్ర పెద్దలు కూడా అంతగా ప్రాధాన్యత ఇస్తున్న‌ట్లుగా లేదన్న అసంత్రుప్తి పవన్ లో ఉందని కూడా ప్రచారం సాగుతోంది.

మోడీ అలా…..

ఇక కరోనా వైరస్ తరువాత లాక్ డౌన్ని దేశమంతా విధించిన నేపధ్యంలో ప్రధాని మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు. అలాగే వివిధ పార్టీల అధినేతలతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఏపీ విషయానికి వస్తే చంద్రబాబుకు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. మరి పొత్తు ఉంది, మిత్రపక్షంగా జనసేన ఉంది. అధినేత పవన్ కల్యాణ్ తో మాత్రం మోడీ మాటా మంతీ ఏదీ లేదని, కనీసం ఫోన్ ద్వారా పలకరించింది లేదన్న దానిపైన జనసేనలో చర్చ సాగుతోందిట. మరో వైపు వైసీపీ పెద్దలతో ఢిల్లీ పెద్దలు టచ్ లో ఉంటున్నారని, వారికి అనుకూలంగా ఢిల్లీలో లాబీయింగ్ ఉందని కూడా అనుమానిస్తున్నారు.

టీడీపీతో …..

ఇక ఈ విషయాలు అన్నీ పరిగణలోకి తీసుకుంటున్న జనసేన నాయకులకు టీడీపీతో పొత్తు ఉన్నపుడు వారు చేసిన మర్యాద, ఇచ్చిన గౌరవం గుర్తుకువస్తున్నాయట. చంద్రబాబు స్వయంగా విజయవాడ విమానాశ్రయానికి మంత్రులను సైతం పంపించడం, రెడ్ కార్పెట్ పరచి తానే స్వయంగా ఎదురు వచ్చి స్వాగతం పలకడం వంటివి గుర్తుచేసుకుంటున్న జనసేన పెద్దలు టీడీపీ ట్రేట్ మెంటే వేరబ్బా అనుకుంటున్నారుట. బీజేపీతో ఏపీలో పొత్తు పెట్టుకుని తగ్గిపోయాం తప్ప లాభం లేదని కూడా భావిస్తున్నారుట. ఏపీ వరకూ చూస్తే జనసేన పెద్ద పార్టీ అని, ఏడు శాతం ఓట్లు తమ పార్టీకి వచ్చాయని, అటువంటి పార్టీ పట్ల అనుసరించవలసిన విధానంలో కమలనాధులు లేరని, పైగా బద్ధ శత్రువు వైసీపీతో అంటకాగుతున్నారన్న బాధ కూడా ఉందిట. మొత్తం మీద చూసుకుంటే జనసేనలో తమను అసలు బీజేపీ పట్టుకోవడంలేదన్న అసంతృప్తి ఎక్కువగానే ఉందని అంటున్నారు. ఇది ఏవైపునకు దారితీస్తుందో చూడాలి.

Tags:    

Similar News