మధ్యలో వదిలేయడమేనా? పట్టుకునేది లేదా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలను పెద్దగా సీరియస్ గా తీసుకుంటున్నట్లు కనపడటం లేదు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఇదేరకమైన పోకడ అవలంబిస్తున్నారు. [more]

Update: 2020-04-26 06:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలను పెద్దగా సీరియస్ గా తీసుకుంటున్నట్లు కనపడటం లేదు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఇదేరకమైన పోకడ అవలంబిస్తున్నారు. పవన్ కల్యాణ్ పాలిటిక్స్ ను ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి అంతే. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు కాబట్టి, అక్కడక్కడా మోదీ, చంద్రబాబు పాల్గొన్న సభల్లో మాత్రమే పాల్గొన్నారు. పూర్తి స్థాయి ప్రచారాన్ని అప్పుడు నిర్వహించలేదు.

పూర్తి స్థాయి రాజకీయాలు…..

ఇక 2019 ఎన్నికల నాటికి జనసేన పూర్తి స్థాయి రాజకీయాలు మొదలు పెట్టింది. అప్పటి వరకూ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుదని భావించినా పవన్ కల్యాణ‌ మధ్యలో వదిలేశారు. అధికార పార్టీ కావడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వల్ల తాను నష్టపోయే అవకాశముందని గ్రహించి టీడీపీకి దూరంగా ఉన్నారు. ఇది మంచి రాజకీయ ఎత్తుగడేనని అప్పట్లో అందరూ అన్నారు. కానీ ప్రచారానికి వచ్చే సరికి ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీంతో పరోక్షంగా చంద్రబాబు కు పవన్ కల్యాణ్ సహకరిస్తున్నారన్న ప్రచారం బాగా జరిగింది. ఫలితంగా ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.

రాజధాని రైతుల విషయంలో….

ఇక వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తాను 24 గంటలూ రాజకీయం చేస్తానని ప్రకటించారు. రాజధాని ప్రాంత రైతులకు మద్దతు ప్రకటించారు. కొన్ని రోజులు హడావిడి చేశారు. చివరకు ఇదే విషయంలో బీజేపీతో కలసి నడిచేందుకు ముందుకు వచ్చారు. ఎన్నికలకు నాలుగేళ్లు సమయం ఉన్నా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. రాజధాని రైతుల కోసం లాంగ్ మార్చ్ చేస్తానని ప్రకటించారు. మధ్యలో వదిలేశారు. అదేమంటే ఢిల్లీ ఎన్నికలను సాకుగా చూపారు.

కరోనా సమయంలో…..

ిఇక ఇప్పుడు కరోనా వైరస్ ఏపీలో విలయతాండవం చేస్తుంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే కోరోనా సహాయక చర్యల్లో జనసేన పాలుపంచుకోక పోవడం చర్చనీయాంశంగా మారింది. కేవలం సీఎం సహాయనిధికి విరాళం ప్రకటించి ఊరుకున్నారు. ఒకవైపు చంద్రబాబు ఈ సయమంలో పార్టీ క్యాడర్ ను ఉత్తేజపర్చేందుకు నిత్యం వీడియో కాన్ఫరెన్స్ లను నిర్వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ మాత్రం క్యాడర్ కు దూరంగా కరోనా సమయంలో ఉన్నారు. ఇలా పవన్ కల్యాణ్ సరైన సమయంలో పక్కకు వెళతారన్నది మరోసారి నిజమయిందంటున్నారు.

Tags:    

Similar News