రాంగ్ డైరెక్షన్ కారణంగానేనా?

రాజకీయాల్లో కొత్త పార్టీలు రావాలి. ప్రజాస్వామ్యానికి అదే అందం, అర్ధం. ఎన్ని పార్టీలు వస్తే అంత ప్రజలకు ఛాయిస్ ఉంటుంది. అయితే రాజకీయాన్ని సైతం జూదంగా మార్చేసినపుడు [more]

Update: 2019-10-27 06:30 GMT

రాజకీయాల్లో కొత్త పార్టీలు రావాలి. ప్రజాస్వామ్యానికి అదే అందం, అర్ధం. ఎన్ని పార్టీలు వస్తే అంత ప్రజలకు ఛాయిస్ ఉంటుంది. అయితే రాజకీయాన్ని సైతం జూదంగా మార్చేసినపుడు మాత్రం ఈ సూత్రం వర్తించదు. అపుడు గెలుపు గుర్రాలే రంగంలో ఉంటాయి, రేసులో పోటీ పడతాయి. ఏపీలో రెండు పార్టీల మధ్యనే సమరం ఫిక్స్ అయి దశాబ్దాలు దాటుతోంది. మూడవ పార్టీ రావడం అన్నది జరగడంలేదు, రాజకీయ మైదానం కూడా ఆ ఛాన్స్ ఇవ్వడంలేదు. అది 2009 అయినా, 2019 అయినా కూడా రాజకీయం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్యనే కేంద్రీకృతం అవుతోంది. దీంతో మూడవ పార్టీని కనీసం పట్టించుకోవడంలేదు. పార్టీ పెట్టగానే గెలిచేటంత బలం బలగం లేని పార్టీలకు రెండవ అవకాశం సైతం దక్కడంలేదు.

గెలుపే కొలమానం….

ఏపీలో మూడు పార్టీలు 2019 ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడ్డాయి. బంపర్ విక్టరీ సాధించి వైసీపీ అధికారంలోకి వచ్చెసింది. టీడీపీ ఘోర ఓటమి పాలు అయి 23 సీట్లకు పరిమితం అయింది. ఇక జనసేనకు ఒకే ఒక్క సీటు దక్కింది. పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. మరో వైపు వైసీపీని మరిన్ని టెర్ములు అధికారంలో ఉంచేందుకు ఆ పార్టీ అధికారాన్ని జాగ్రత్తగా వాడుకుంటోంది. నాలుగు దశాబ్దాల అనుభవంతో టీడీపీ తొడకొడుతోంది. వైసీపీని దింపితే మళ్ళీ తామే అంటున్నారు చంద్రబాబు. ఇక పవన్ కళ్యాణ్ జనసేనలో మాత్రం స్తబ్దత అలాగే కొనసాగుతోంది. పవన్ రాజకీయ విధానం ఏంటన్నది కూడా క్లారిటీగా లేదంటున్నారు. ఆయన అధికార పార్టీని విమర్శించడానికే పరిమితం అవుతున్నారని కూడా కామెంట్స్ పడుతున్నాయి. ఇపుడున్న పరిస్థితుల్లో మళ్ళీ పవన్ కల్యాణ్ తన పార్టీని గెలుపు తీరాలకు నడిపించగలడా అన్న సందేహాలను కూడ ఆ పార్టీలో వ్యక్తం చేస్తున్నారు.

జారుకుంటున్న సైనికులు….

పవన్ కల్యాణ‌్ జనసేన పార్టీ నుంచి వరసగా ఒక్కొక్క నేతా జారుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తీరు ఇందుకు ప్రధాన కారణమని కూడా బయటకు వెళ్ళిన వారు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ప్రెస్ నోట్లు, ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తూ పార్టీ నిర్మాణాన్ని పక్కన పెట్టడంతో అసలు సమస్య వస్తోంది. ఇక రాజకీయ పార్టీగా జనసేనను తయారు చేయాల్సిన తరుణంలో ఎన్జీవో సంస్థ మాదిరిగా పవన్ కల్యాణ‌్ కాలుష్యం, పర్వావరణం అంటూ పొలిటికల్ డైరెక్షన్ తప్పుతున్నారని కూడా జనసేనలో అసంతృప్తి ఉంది. ఇంకోవైపు జనసేనలో మిగిలిన వారిని వైసీపీ టార్గెట్ చేసింది. ఇందుకు కారణం కూడా పవన్ కల్యాణ్ అనే చెప్పుకోవాలి. ఆయన జగన్ ని ప్రెస్ నోట్లు, ప్రకటనల ద్వారా విమర్శిస్తూ వస్తున్నారు. దాంతో పవన్ కల్యాణ‌్ ని నెమ్మదిగా పొలిటికల్ సీన్ నుంచి చిన్న సైజ్ చేయాలన్న ఉద్దేశ్యంతో వైసీపీ హై కమాండ్ పావులు కదుపుతోంది. అందులో భాగంగా తాజాగా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లురి కృష్ణం రాజు వైసీపీలో చేరారు. ప్రధానంగా పవన్ కల్యాణ్ బలం గోదావరి జిల్లాలలో ఉంది. దాంతో అక్కడ ఉన్న నేతలను ఏరేస్తే పవన్ కల్యాణ‌్ జనసేన వీక్ అవుతుందని అంచనా వేస్తోంది వైసీపీ. మరి పవన్ కల్యాణ‌ తన పార్టీని ఎంతవరకు కాపాడుకుంటారన్నది ఇపుడు పెద్ద ప్రశ్నే. చూడాలి.

Tags:    

Similar News