జనసేనానితో కొత్త కాంబినేషన్… ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి విశేషమైన సినీ అభిమాన జనం ఉన్నారు. వారిని జాగ్రత్తగా రాజకీయాలకు కన్వర్ట్ చేసుకుంటే కధ బాగానే ఉంటుంది. అయితే 2014 [more]

Update: 2021-06-01 02:00 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి విశేషమైన సినీ అభిమాన జనం ఉన్నారు. వారిని జాగ్రత్తగా రాజకీయాలకు కన్వర్ట్ చేసుకుంటే కధ బాగానే ఉంటుంది. అయితే 2014 లో చంద్రబాబు ఆ పని చేసుకోగలిగారు. సీఎం అయ్యారు. 2019 కి వచ్చేసరికి సొంతంగా పోటీకి దిగిన పవన్ కళ్యాణ్ ఈ విషయంలో అభిమానులను ఓట్లుగా మార్చుకోలేక దెబ్బ తిన్నారు అన్న విశ్లేషణలు అయితే ఉన్నాయి. ఇక్కడ రాజకీయ పండితులకు అర్ధమయ్యే విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లర్. పైగా యూత్ లో విశేష ప్రభావం కలిగిన నాయకుడు. ఆయన్ని మంచి చేసుకుంటే ఆ ఓట్లలో మెజారిటీ ఏ పార్టీకైనా టర్న్ అవుతాయి అని.

కొత్త నేస్తమా…?

పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా రాజకీయ తెరపైన జత కట్టని కొత్త కాంబోతో ఫ్యూచర్ లో కనిపిస్తారు అన్న ప్రచారం అయితే సాగుతోంది. పవన్ కళ్యాణ్ బలం తెలిసిన తెలంగాణా అధికార పార్టీ ఆయన కోసం స్నేహ హస్తం చాచుతోంది అంటున్నారు. పవన్ కనుక సరే అంటే వచ్చే ఎన్నికల్లో ఆయనతో పొత్తు కలిపేందుకు కూడా రెడీ అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. 2023లో తెలంగాణాలో జరిగే ఎన్నికలు చాలా సంచలనంగా ఉంటాయని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికి రెండు సార్లు అధికారంలోకి వచ్చి టీయారెస్ జనాలకు కొంత బోర్ కొడుతుంది. అదే సమయంలో అధికారం కోసం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ గట్టిగానే పోటీ పడతాయి. ఈ విషమ పరిస్థితుల నుంచి బయటపడేందుకే టీయారెస్ కొత్త నేస్తాల కోసం చూస్తోందిట.

అంతా ఓకేనా…?

పవన్ కళ్యాణ్ ఏడేళ్ల రాజకీయం చూస్తే ఆయన 2014 మార్చిలో జనసేన పార్టీని పెట్టినపుడు ఆ తరువాత మరి కొన్ని సందర్భాలలో తప్ప ఎన్నడూ టీయారెస్ ని విమర్శించలేదు అన్నది తెలిసిందే. ఇక కేసీయార్ ని పవన్ కళ్యాణ్ అనేకసార్లు బాహాటంగానే మెచ్చుకున్న సంఘటనలూ ఉన్నాయి. మరో వైపు చూస్తే మెగా ఫ్యామిలీకి కల్వకుంట వారి కుటుంబానికి మంచి చక్కని స్నేహ సంబంధాలు ఉన్నాయి. కేటీయార్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మిత్రుడు అయితే కేసీఆర్ తో మంచి దోస్తీ మెగా స్టార్ చిరంజీవికి ఉంది. దాంతో పవన్ కళ్యాణ్ జనసేన టీయారెస్ కి మద్దతుగా ఉండడం అన్నది అసంభవం కానీ అసహజ పరిణామం కానీ కాదనే ఎవరైనా అంటారు.

సమీకరణలు మారితే…?

ఇక ఏపీలో కూడా జనసేన ఉంది. పైగా కేసీయార్ టీయరెస్ కి తెలంగాణా మాత్రమే ముఖ్యం. అక్కడ టీయారెస్ కి మద్దతు ఇస్తే జల వివాదాల విషయంలో కానీ ఏపీ హక్కుల విషయంలో కానీ మాట్లాడేందుకు ఇబ్బందికరమైన పరిస్థితులు పవన్ కళ్యాణ్ కి తప్పకుండా వస్తాయి. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో కేసీయార్ ని ఎదిరించే ఏపీ నేతలు కూడా ఎవరూ లేరనే అంతారు. జగన్ కి ఆయనతో దోస్తీ ఉందని చెబుతారు. అలాగే చంద్రబాబు కూడా కేసీయార్ ని పల్లెత్తు మాట అని ఎరగరు. ఈ నేపధ్యంలో బీజేపీ కాంగ్రెస్ ల నుంచే సమస్యలు వస్తాయి. వాటికి ఏపీలో ఉన్న రాజకీయ భూమికను చూసినట్లు అయితే పెద్దగా పట్టించుకోవాల్సింది లేదు అనే అంటారు. మొత్తానికి జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల వేళకు కొత్త పొత్తులు ఎత్తులతో ముందుకు వస్తారు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News