పవన్ సాబ్ జేబులో లేఖ రెడీ ?

వకీల్ సాబ్ గా అదరగొట్టే యాక్షన్ తో అటు అభిమానులను, ఇటు ఆడియన్స్ ని కూడా తెగ ఖుషీ చేసిన పవన్ కళ్యాణ్ ఇపుడు పొలిటికల్ గా [more]

Update: 2021-04-30 02:00 GMT

వకీల్ సాబ్ గా అదరగొట్టే యాక్షన్ తో అటు అభిమానులను, ఇటు ఆడియన్స్ ని కూడా తెగ ఖుషీ చేసిన పవన్ కళ్యాణ్ ఇపుడు పొలిటికల్ గా కూడా దూకుడు చేయాలనుకుంటున్నారుట. ఏపీ రాజకీయాల్లో తన మార్క్ ని చూపించాలని పవన్ ఆరాటపడుతున్నారని టాక్. దానికి ముందు కొన్ని సంచలన నిర్ణయాలను కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఉంటాయని అంటున్నారు. ఏపీలో బీజేపీకి విడాకులు ఇచ్చేందుకు పవన్ రెడీ అవుతున్నారు అన్నది ఇపుడు ప్రచారంలో ఉన్న మాట. బీజేపీతో కలిస్తే ఏమీ లేదు, రాదు అన్నది తేలిపోయాక ఇక కలసి నడవడం దండుగ అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మొక్కుబడిగానే…?

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో పవన్ కళ్యాణ్ ఒకే ఒకసారి అది కూడా మొక్కుబడిగానే ప్రచారం నిర్వహించారు. ఆయన మళ్ళీ వస్తారని బీజేపీ ఎంతో ఆశగా చూసినా కూడా క్వారంటైన్ పేరిట తలుపులు వేసుకున్నారు. దాంతో బీజేపీ శ్రేణులు మొత్తం నీరుకారిపోయాయి. నిజానికి పోటీ బీజేపీది అయిన అఓటు మాత్రం జనసేనదే. ఆ నమ్మకంతోనే బీజేపీ తిరుపతి బరిలో తొడ కొట్టింది. పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రచారం చేస్తే తిరుపతిలో బీజేపీకి బాగానే ఓట్ల పంట పండేది అన్న మాట కూడా ఉంది. కానీ పవన్ కీలకమైన సమయంలో డుమ్మా కొట్టేసారు. ఇది ఫక్త్ పాలిటిక్సే అన్న మాట బీజేపీలో కూడా చర్చకు వస్తోందిట.

అదే ముహూర్తం…?

బీజేపీ విషయంలో పవన్ నాన్ సీరియస్ నెస్ జనసైనికులకు కూడా ఒక సందేశంగానే ఉందిట. దాంతో తిరుపతిలో బీజేపీకి దారుణమైన ఫలితమే రాబోతోంది అన్న మాట ఉంది. సరిగ్గా ఇదే అదనుగా బీజేపీకి పవన్ కళ్యాణ్ రాం రాం అంటూ బయటకు వస్తారు అన్నది ఇపుడు ప్రచారంగా ఉంది. అంటే తన మద్దతు లేని బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో కళ్ళకు చూపించడం ద్వారా తాను తప్పుకోవాలన్నదే పవన్ మార్క్ పాలిటిక్స్ అంటున్నారు. బీజేపీ నుంచి దూరం కావడానికి తిరుపతి ఫలితాన్ని ఆయన ఒక ఆయుధంగా వాడుకుంటారు అన్నది కూడా అంతా చెబుతున్న మాట.

ఎదగాల్సిందే…?

ముందు సొంతంగా ఎదగాలి అన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా ఉందిట. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంతో కొంత ఉనికి జనసేనకు కనిపించింది. ఇక జన సైనికులకు పవన్ కంటే కూడా రాజకీయ కసి ఉంది. దాన్నే ఇపుడు అస్త్రంగా చేసుకుని రానున్న రెండేళ్ళ పాటు పార్టీని పటిష్టపరచే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుడతారు అంటున్నారు. గతంలో మాదిరిగా వెంటనే ఏ పార్టీతోనూ పొత్తులు కుదుర్చుకోరు అన్నది కూడా ప్రచారం లో ఉంది. ముందు జనసేనను గట్టిగా జనంలోకి తీసుకువెళ్ళి బలపడాలన్నదే పవన్ అజెండా అంటున్నారు. 2024 ఎన్నికల వేళకు అప్పటి పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ జేబులో లేఖ ఉందని, బీజేపీకి ఇక తలాఖేనని వస్తున్న వార్తలు మాత్రం కమలనాధులను తెగ కలవరపెడుతున్నాయి.

Tags:    

Similar News