బాబును మించిపోయాడుగా

చంద్రబాబు రాజకీయ వయసు నలభయ్యేళ్ళు.. ఆయనది సుదీర్ఘ రాజకీయ జీవితం. ఓ విధంగా ఇంత లాంగ్ టెర్మ్ పాలిటిక్స్ నిరాటంకంగా కొనసాగించడం ఒక చరిత్ర. అదీ కూడా [more]

Update: 2020-01-17 11:00 GMT

చంద్రబాబు రాజకీయ వయసు నలభయ్యేళ్ళు.. ఆయనది సుదీర్ఘ రాజకీయ జీవితం. ఓ విధంగా ఇంత లాంగ్ టెర్మ్ పాలిటిక్స్ నిరాటంకంగా కొనసాగించడం ఒక చరిత్ర. అదీ కూడా అగ్ర భాగ రాజకీయల్లో ఉండడమే కాకుండా కీలకమైన పదవుల్లో ఉండడం మరో రికార్డ్. దీని వెనక చంద్రబాబు కష్టం. కసరత్తులతో పాటు ఎన్నో యూ టర్నులు కూడా ఉన్నాయి. విపక్షాలకు అవే పెద్ద మైనస్ గా కూడా కనిపిస్తాయి. అందుకే చంద్రబాబుని యూటర్న్ అంకుల్ గా వైసీపీ లాంటి పార్టీలు కామెంట్స్ చేస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే సిధ్ధాంతాలు బొత్తిగా లేని ఈ రోజుల్లో బాబు తన పొలిటికల్ కెరీర్లో అనేక పార్టీలతో జత కట్టడం అన్నది పెద్ద విషయం కాదు, పైగా నాలుగు దశాబ్దాల రాజకీయం కాబట్టి సర్దుకోవచ్చు. కానీ పవన్ కల్యాణ్ ది బొత్తితా ఆరేళ్ళు కూడా నిండని రాజకీయ జీవితం. ఇంతలోనే ఎంత ముదిరిపోయాడా అని అని విపక్షాలు షాక్ తింటున్నాయి.

అలా మొదలెట్టి….

పవన్ కళ్యాణ్ కి సినీ అక్షరాలతో పాటు, రాజకీయ ఓనమాలు దిద్దించినది అన్నయ్య మెగస్టారే కావడం విశేషం. ఆయన వల్లనే పవన్ ప్రజారాజ్యంలో చేరారు. అది ఆయన మొదటి పార్టీ అనుకుంటే తరువాత 2014లో జనసేనను సొంతంగా ప్రారంభించారు. ఇక పొత్తుల విషయానికి వస్తే నాడు తెలుగుదేశం, బీజేపీలతో జత కట్టారు. 2019 ఎన్నికల నాటికి ఉభయ వామపక్షాలు, బహుజన సమాజ్ వాదీ పార్టీతో కలసి పోటీ చేశారు. ఈ లెక్కన ఆరు పార్టీలను కేవలం ఆరేళ్ళ సమయంలో చుట్టేసిన పవన్ మళ్ళీ పొద్దు తిరుగుడు పువ్వులా బీజేపీ కమలం పువ్వు చెంతకు చేరారు. దీంతో బాబు గారి కంటే వేగంగా పవన్ కల్యాణ్ పార్టీలను మార్చేస్తూ పొత్తుల ఎత్తుల్లో ఆరితేరిపోయారని సెటైర్లు పడుతున్నాయి.

అది నిజమేనా…?

సాధారణంగా రాజకీయ నాయకులకు కావాల్సింది నిబద్ధత, స్థిరమైన ఆలోచనా విధానం. ఆ విషయంలో చంద్రబాబును ఎవరూ వంక పెట్టలేరు. ఆయన ఎన్ని మొగ్గలు వేసినా నిబద్ధతతో కూడిన రాజకీయం చేస్తారు, పైగా తనకు కావాల్సినదేంటో కూడా చంద్రబాబుకు తెలుసు. అందుకే స్థిరంగా రాజకీయం ఇన్ని దశాబ్దాలుగా చేయగలుతుతున్నారు. ఇపుడు పవన్ కల్యాణ్ విషయానికి వస్తే ఆయనది చంచల మనస్తత్వమని ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు దేని మీద నిలకడ కానీ, స్థిరత్వం కానీ లేదని చెబుతారు. ఇపుడు పవన్ కల్యాణ్ తీరు చూస్తూంటే అదే నిజమనిపిస్తోందని అన్న వారూ ఉన్నారు. మరి పవన్ కల్యాణ్ కి ఈ రోజుకు బీజేపీ నచ్చిందని, రేపటి రోజున ఎలా ఉంటుందోనన్న మాట కూడా ఉంది.

ఇమేజ్ డ్యామేజ్ ….

రాజకీయం అంటేనే ఒక ఆట. అందులో గెలుపులు తక్కువ. ఓటములే ఎక్కువగా ఉంటాయి. అయితే ఓపిక పడితే గెలుపు పిలుపు కూడా వినిపిస్తుంది. మరి పవన్ కల్యాణ్ కి రాజకీయంగా ఓపిక ఉందా అన్న ప్రశ్న వేసుకున్నపుడు లేదనే జవాబు వస్తుంది. పైగా ఆయన అధికారం చుట్టూనే తిరుగుతారని విమర్శలకు కూడా ఇపుడు కేంద్రంలోని బీజేపీ పొత్తుని ఉదాహరణగా చూపుతున్నారు. జనం నాయకుడిని విశ్వసిస్తే ఒకసారి కాకపోతే మరోసారి అయినా ఆదరిస్తారు. కానీ పవన్ కల్యాణ్ తరచూ తన విశ్వసనీయతను దెబ్బతీసుకునేలా వ్యవహరిస్తున్నారని, అదే ఆయన రాజకీయ ఎదుగుదలకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. మరి చూడాలి.

Tags:    

Similar News