పవన్ రూట్ ను వారు పసిగట్టేశారా…!!

ఎన్నో ఆశలు పెట్టుకుని తాజా ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనానికి చివరికి ఫలితాలతో తల బొప్పి కట్టింది. తాను పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమి ఎదురుకావడంతో [more]

Update: 2019-07-13 12:30 GMT

ఎన్నో ఆశలు పెట్టుకుని తాజా ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనానికి చివరికి ఫలితాలతో తల బొప్పి కట్టింది. తాను పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమి ఎదురుకావడంతో పొలిటికల్ స్ర్కిప్ట్ లో తప్పు బాగా జరిగిందని వూహించారు. పవన్ ఇక్కడే రాజకీయంగా కొంత తెలివిడి ప్రదర్శించారనుకోవాలి. తాను ఓటమి పాలు అయినా రాజకీయాలను వీడిపోనని చెప్పడం పవన్ మొదటి మంచి ముందడుగు. ఇక రెండవది తన ఒక్కడి గ్లామర్ మాత్రమే పార్టీనకి ఇంధనం కాదని, ఏకపక్ష విజయాలు కాదు కదా, గెలుపు కూడా తన వరకైనా సాధ్యపడదని పవన్ బాగానే పోస్ట్ మార్టం చేసుకున్నారు. ఇపుడు అధికారం సంపాదించడం కోసం సరైన రూట్ మ్యాప్ ని కూడా పవన్ సిధ్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. పవన్ ఇపుడు అందరికీ అందుబాటులో ఉన్న క్రౌడ్ పుల్లర్. పవన్ని ఉపయోగించుకున్న వారికి రాజకీయంగా లాభం. మరి పవన్ కేంటి లాభం.

బీజేపీతో దోస్తీ ….

అందుకె పవన్ ఉభయ తారకంగా ఉండే రూట్ మ్యాప్ నే కనుగొన్నారు. బీజేపీకి ఏపీలో నాయకత్వ సమస్య ఉంది. పవన్ వరకూ పటిష్టమైన పార్టీ సహకారం కావాలి. ఇలా ఒకరి అవసరాలు మరొకరు తీర్చే విధంగా పవన్ బీజేపీ వైపుగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. విదేశంలో బీజేపీ కీలక నేత రాం మాధవ్ తో పవన్ ఏకాంత చర్చల సారం ప్రస్తుతానికి బయటపడకపోయినా పవన్ కమలం వైపుగా కాస్తా మొగ్గు చూపుతున్నట్లుగా అర్ధమవుతోంది. అదే జరిగితే మాత్రం పవన్ రాజకీయం బాగానే ఉంటుంది. ఆయన సినీ గ్లామర్, సామాజిక వర్గం బలం బీజేపీకి రాజకీయ పెట్టుబడి అయితే బీజేపీ అండా దండా పవన్ అధికార అవకాశాలకు నిచ్చెన మెట్లుగా పనికివస్తాయి. దీంతో ఇప్పుడు పవన్ కి కాస్తా రిలీఫ్ దొరికినట్లే.

పసిగట్టిన ఎర్రన్నలు….

ఇక రాజకీయాల్లో తమవారు, పర వాళ్ళు అన్నది కనిపెట్టడం పెద్ద విషయం కాదు. ఎన్నో దశాబ్దాలు పాటు రాజకీయాల్లో ఉన్న కామ్రేడ్స్ కి ఇపుడు పవన్ కొత్త బాట కలవరం కలిగిస్తోంది అంటున్నారు. తమతో పాటు అడుగులు వేసిన పవన్ ఏపీలో కొత్త రాజకీయాన్ని మూడవ రాజకీయ వేదికను నిర్మిస్తారని ఆశపడిన ఎర్రన్నలకు ఫలితాలు తేడా కొట్టాయి. అయినా రానున్న అయిదేళ్ళూ పోరాడితే మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్న వేళ పవన్ మాత్రం కమలం వైపు మొగ్గుతున్నట్లుగా ఆయన వైఖరి తేలడంతో కామ్రేడ్స్ కి ఎక్కడలేని కోపం వస్తోందట. దాంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా ఎర్రన్నల గొంతు ఇపుడు పవన్ కి వ్యతిరేకంగా గట్టిగా వినిపిస్తోంది.

పవన్ వల్లనేనట…..

తాజా ఎన్నికల్లో తమ కూటమి ఓటమికి పవన్ రాజకీయ పోకడలే కారణమి ఎటువంటి మొహమాటం లేకుండా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు విమర్శిస్తున్నారు. పవన్ పోటీ చేసిన చోటకు బాబు ప్రచారనికి రాకపోవడం, పవన్ సైతం మంగళగిరి ప్రచారానికి వెళ్లకపోవడం వల్లనే ప్రజలు ఈ రెండు పార్టీల మధ్య ఏదో ఉందని భావించి ఓడించారని ఆయన అంటున్నారు. మంగళగిరిని పొత్తులో భాగంగా సీపీఐ కి ఇచ్చారు ఇక్కడ పోటీ చేసింది ముప్పాళ్ళ కావడంతో ఆయన ఆవేదన ఇంకా ఎక్కువగా ఉంది. మొత్తానికి పవన్ కి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు గొంతు సవరిస్తున్నారు. ఎర్రన్నలకు ఇపుడు ఏపీలో తమ దారి ఎటో తెలియడంలేదులా ఉంది.

Tags:    

Similar News