అంత ఇగో ఎందుకు పవన్ ?

రాజకీయాలు మామూలు వేళల్లో చేయాలి. ఇపుడు కష్టకాలం నడుస్తోంది. దేశమంతా కూడా కరోనా గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఈ టైంలో కూడా ఇంకా ఇగోలు, సొంత రాజకీయాలు [more]

Update: 2020-04-04 14:30 GMT

రాజకీయాలు మామూలు వేళల్లో చేయాలి. ఇపుడు కష్టకాలం నడుస్తోంది. దేశమంతా కూడా కరోనా గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఈ టైంలో కూడా ఇంకా ఇగోలు, సొంత రాజకీయాలు చేస్తే ఎవరూ సహించరు కదా, ఈ రకమైన చీప్ ట్రిక్స్ కూడా ఇట్టే తెలిసిపోతాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో తన దాతృత్వాన్ని చూపించారు. రెండు కోట్ల వరకూ ప్రభుత్వాలకు విరాళాలు ఇచ్చి తన‌ ఉదారత్వాన్ని చాటుకున్నారు. అంతవరకూ ఓకే అనుకున్నా ఇక అప్పటి నుంచి జగన్ సర్కార్ మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నట్లుగా ఉంది. ఇది ఒక్కరి సమస్య కాదు. పైగా ఎవరూ ఊహించనిది. కనబడని శత్రువుతో యుధ్ధం చేయడం ఎలాగో తెలియక అగ్ర రాజ్యాలే చేతులెత్తేస్తున్నాయి. మరి పవన్ కల్యాణ్ చేతనైతే మంచి మాటలు చెప్పాలి, కానీ తన ఇమేజ్ పెంచుకోవడానికో, జగన్ సర్కార్ ని తక్కువ చేయడానికో పాలిటిక్స్ చేయడం తగదని వైసీపీ నేతలు అంటున్నారు.

జగన్ అంటేనే …?

జగన్ విషయంలో మొదటి నుంచి పవన్ కల్యాణ్ కి అదో రకమైన అసూయ ఉందని వైసీపీ నేతలు అంటారు. అది చూపించడానికి ఇది కరెక్ట్ సమయం కాదని వారే అంటున్నారు. లాక్ డౌన్ పీరియడ్ లో ఎక్కడి వారు అక్కడ ఉండాలని కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ఇక వలస‌ కార్మికుల విషయం పూర్తి బాధ్యత కేంద్రానిదేనని మరో వైపు సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది. విషయం ఇంత క్లియర్ గా ఉన్నా కూడా జగన్ వలస కార్మికుల విషయంలో అసలు పట్టించుకోవడంలేదన్నట్లుగా పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్స్ పైన వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు.

ఆ లెటరేదో…?

ఇక దేశం మొత్తం మీద వలస వెళ్ళిన కార్మికులు ఏపీ నుంచి ఎక్కువగా ఉన్నారు. వారు లాక్ డౌన్ పీరియడ్ లో చిక్కుకుపోయారు. అలా తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ముంబైలో కూడా ఉన్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం వారిని వెంటనే ఏపీకి తీసుకురావాలని డిమాండ్చేస్తున్నారు. పనిలో పనిగా తన ట్విట్టర్ లో తమిళనాడు, మహారాష్ట్ర సీఎంలకు లేఖలు సంధించారు. వారు కూడా సానుకూలంగా రియాక్ట్ అయ్యారు. సరే దాన్ని అలాగే వదిలేస్తే పవన్ కల్యాణ‌ రాజకీయం ఎలా పూర్తి అవుతుందనుకున్నారో ఏమో. జగన్ రెడ్డి గారు వీరి సంగతి చూడండి, నానా అవస్థలు పడుతున్నారంటూ వలస కార్మికుల వీడియో క్లిప్పింగులు పెట్టి మరీ సర్కార్ పనిచేయడంలేదన్నట్లుగా ఎత్తిచూపుతున్నారట. ఇది వైసీపీ నేతలను బాగా మండిస్తోందిట. సరే పవన్ కల్యాణ్ కి వలస‌ కార్మికుల మీద చిత్త శుధ్ధి ఉంటే ముఖ్యమంత్రి జగన్ కి నేరుగా లెటర్ రాయవచ్చుగా, కనీసం, ట్విట్టర్ ద్వారా అయినా విన్నపం చేయవచ్చు కదా అంటున్నారు.

గుర్తించరుగా…?

దేశంలో అందరు సీఎంలను గుర్తిస్తారు. వారికి మర్యాదలు ఇస్తూ గౌరవనీయ‌, మాననీయ అని కూడా అంటారు, కానీ ఏపీ సీఎం దగ్గరకు వచ్చేసరికి మాత్రం పవన్ కల్యాణ్ కి ఎందుకో ఇగో అడ్డువస్తుందిలా ఉంది. మరి సమస్యలు పరిష్కరించడం అంటే ఇదేనా. విపక్ష నేతలు అహంతో ఉంటే జనాల సమస్యలు ఎలా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారు అన్నది పవన్ కే తెలియాలి అంటున్నారు. తెలంగాణా సీఎంతో ఉన్న సఖ్యత ఏపీ సీఎంతో కూడా ఉంటే పవన్ కల్యాణ్ రాజకీయం బాగానే ఉండేదని, కానీ పవన్ బాధ అంతా జగన్ సీఎం అయ్యారన్నదేనని వైసీపీ నేతలు అంటున్నారేంటే పవన్ కల్యాణ్ తప్పుదోవలోనే ఇంకా నడుస్తున్నట్లే లెక్క. కరోనా వైరస్ విపత్తు వేళ గట్టిగా శ్రమిస్తున్న గ్రామ‌ వాలంటీర్ల వ్యవస్థ మీద కూడా తాజాగా విమర్శలు చేసి బాబు పక్కన నిలబడిన పవన్ ఏపీలో కరోనా వైరా పై చైతన్యం కోసం తన పార్టీ తరఫున చేస్తున్న కార్యక్రమాలేంటో చెప్పాలని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News