అయిదేళ్ళ క్రితం కంటెంట్ తో 2024 లో సినిమా ?

సబ్జెక్ట్ ఎపుడూ వర్తమానానికి ఏదో రకంగా కనెక్ట్ అయి ఉంటేందే విజయం దక్కుతుంది. మనకు నచ్చింది కదా అనో, వీలు చిక్కింది కదా అని ముచ్చట పడో [more]

Update: 2021-04-13 03:30 GMT

సబ్జెక్ట్ ఎపుడూ వర్తమానానికి ఏదో రకంగా కనెక్ట్ అయి ఉంటేందే విజయం దక్కుతుంది. మనకు నచ్చింది కదా అనో, వీలు చిక్కింది కదా అని ముచ్చట పడో అవుట్ డేటెడ్ సబ్జెక్ట్ తో సినిమా తీసే చీదేస్తుంది. సోము వీర్రాజు డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా 2024లో ఏపీ సీఎం జనసేనాని అన్న సినిమా కధ కూడా ఇంచుమించు ఇలాంటిదే అన్న విమర్శలు వస్తున్నాయి. బీజేపీ బాగున్న రోజుల్లో పవన్ ఏంటో జనాలకు తెలియని వేళ ఈ రకమైన రాజకీయ ప్రయోగం చేస్తే జనాల అట్రాక్షన్ కచ్చితంగా ఈ కాంబో మీద ఉండి కంటెంట్ ఎంతో కొంత నచ్చేదే అన్న మాట కూడా ఉంది.

దిగానారిపోతోంది….

బీజేపీ ప్రాభవం గత వైభవంగా మారుతోంది. అఖిల భారతాన మోడీ అంటే ఉన్న క్రేజ్ కూడా పల్లం వైపు పరుగులు తీసే నీరు మాదిరిగా జారుతోంది. ఇక ఏపీ జనాలకు 2014 నుంచి 2019 మధ్యలో బీజేపీ మీద కేవలం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కోపం మాత్రమే ఉంది. ఇపుడు దానికి బోలేడు తోడు అవుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి తెగించడం, విశాఖ స్టీల్ ని బలిపీఠం ఎక్కించడం జనాలకు అసలు నచ్చడంలేదు. ఇక పోలవరానికి నిధులు ఇవ్వకుండా ఎండబెడుతున్న తీరు మీద కూడా ఏపీ జనాలకు గుర్రుగా ఉంది. ఈ నేపధ్యంలో దేశంలోనూ మోజు లేక ఏపీలోనూ సీన్ కాలక బీజేపీతో జట్టు కట్టి పవన్ కల్యాణ్ 2024లో ఏ రకమైన అద్భుతాలు సాధిస్తాడు అన్నదే మేధావుల ప్రశ్న.

టీడీపీకే దెబ్బ….

ఏపీలో మూడవ కూటమిగా ఏపీ పొలిటికల్ సీన్ మీదకు జనసేన బీజేపీ వచ్చినా గట్టిగా గర్జించినా కూడా అది చివరాఖరుకు దెబ్బ తీసేది తెలుగుదేశాన్నే అన్న మాట ఉంది. బీజేపీ ఓటు అయినా పవన్ కల్యాణ్ సామాజిక బలం అయినా కూడా టీడీపీ నుంచే లాగేయాలి. అలా టీడీపీకి చిల్లు పెట్టి వైసీపీని మరోమారు గద్దె మీద కూర్చోబెట్టడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ట్రయాంగిల్ ఫైట్ జరిగితే అది కచ్చితంగా అధికారంలో ఉన్న వైసీపీకి బంగారంలా ఉపయోగపడుతుంది అన్నదే ఎన్నో ఎన్నికలు చూసిన వారి మాట కూడా.

లీడ్ చేయగలరా…?

ఇక ఒక వైపు జగన్ మరో వైపు చంద్రబాబు ఉంటే వారికి పోటీగా బీజేపీ జనసేన కూటమిని పవన్ కల్యాణ్ లీడ్ చేయగలరా అన్న డౌట్లూ ఉన్నాయి. పవన్ ని 2014 నుంచి ఏపీ జనాలు చూస్తున్నారు. ఆయన ప్రసంగాలు వింటున్నారు ఆయన రాజకీయ పోకడలు చూస్తున్నారు. ఇక రాజకీయంగా ఆయన బలమెంతో కూడా 2019 ఎన్నికలు కూడా కళ్ళకు కట్టినట్లుగా చూపించేశాయి. ఇలా పవన్ కల్యాణ్ జనసేన వైపు కూడా రాజకీయంగా చూస్తే చాలానే మైనస్ లు ఉన్నాయి. మరి మైనస్ మైనస్ కలిస్తే ప్లస్ అన్నది గణితంలో జరిగేది. రాజకీయ గణితంలో ఆ లెక్కలన్నీ ఉల్టా అవుతాయి. ఏది ఏమైనా పవన్ కల్యాణ్ సీఎం అన్న మాట బీజేపీ నోట వింటూంటే మాత్రం జనసైనికులకు ఎలాగో ఉందిట. ఆ కిక్కే వేరప్పా అని వారు అనుకుంటూ ఫుల్ జోష్ తో ఉన్నారని టాక్.

Tags:    

Similar News