ఎరక్కపోయి ఇరుక్కున్నట్లున్నారుగా?

రాష్ట్రంలో రాజ‌కీయ వ్యూహాలు మారుతున్నాయి. నాయ‌కులు ఒక‌టి త‌లిస్తే మ‌రొక‌టి జ‌రుగుతోంది. ముఖ్యంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో రాజ‌కీయాలు అస్సలు క‌లిసి రావ‌డం లేద‌నే [more]

Update: 2020-02-17 08:00 GMT

రాష్ట్రంలో రాజ‌కీయ వ్యూహాలు మారుతున్నాయి. నాయ‌కులు ఒక‌టి త‌లిస్తే మ‌రొక‌టి జ‌రుగుతోంది. ముఖ్యంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో రాజ‌కీయాలు అస్సలు క‌లిసి రావ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. స్వంతంత్రంగా ఎద‌గాల‌ని ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో రాజ‌కీయాల‌కు టైం కేటాయించే ప‌రిస్థితి లేక‌పోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ప‌వ‌న్ పొలిటిక‌ల్‌గా ఎవ‌రితోనో ఒక‌రితో పొత్తు పెట్టుకోక త‌ప్పని ప‌రిస్థితి ఏర్పడింది. అయితే ఈ పొత్తుల విష‌యంలో ప‌వ‌న్ కల్యాణ‌్ డింకీలు కొడుతున్నాడు. గ‌తంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఆయ‌న గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు విభేదించ‌డం తెలిసిందే.

ఒంటరిగానే దిగి…..

ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒంట‌రిగానే ఆయ‌న ప‌య‌నించాడు. అయితే, ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లి ఉంటే ఈ ప‌రిస్థితి ఉండేది కాద‌ని ప‌వ‌న్ కల్యాణ్ అనేక వేదిక‌ల‌పై బాహాటంగా వ్యాఖ్యానించిన సంద‌ర్భాలున్నాయి. టీడీపీని వైసీపీ అధినేత జ‌గ‌న్ ఊహించ‌ని విధంగా ఎన్నిక‌ల్లో దెబ్బకొట్టడంతో ఆ పార్టీ ప‌రిస్థితి అగమ్యగోచ‌రంగా మారింది. దీంతో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా త‌న‌కు ఒరిగేది ఏమీ లేద‌ని, త‌న హ‌వాతో టీడీపీ పుంజుకునే అవ‌కాశం ఉంటుంద‌ని భావించిన ప‌వ‌న్‌ ప‌క్కకు త‌ప్పుకొ న్నారు.

పొత్తు పెట్టుకున్న తర్వాత…..

ఇప్పుడు ఆర్థిక అవ‌స‌ర‌మో? లేక వేరే కార‌ణ‌మో? పోయి పోయి బీజేపీతోనే జ‌ట్టుక‌ట్టారు. వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీకి సిద్ధమ‌వుతున్నారు. అయితే, ఒక‌ప‌క్క ప‌వ‌న్ కల్యాణ‌ ఇలా ప్రయ‌త్నాలు చేస్తుంటే అధికార వైసీపీ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి వైసీ పీకి మ‌ధ్య సానుకూల ప‌రిణామాలు ఏర్పడుతుండ‌డం జ‌న‌సేనానిని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వ‌ర‌కు జ‌గ‌న్‌ను, ఆయ‌న పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన జ‌న‌సేనాని ఇప్పుడు నోరు మెద‌పాలంటేనే బీజేపీ నేత‌ల పెద్దల నుంచి వ‌స్తున్న సూచ‌న‌లు, స‌ల‌హాల‌తో వెన‌క్కి త‌గ్గాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. దీంతో జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌ కుండా ఉండలేక‌, అలాగ‌ని ఇప్పుడే పొత్తు పెట్టుకున్న బీజేపీతో విభేదించ‌లేక ప‌వ‌న్ కల్యాణ్ నానా ప్రయాస‌ప‌డుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో వైసీపీ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగుల‌కు ప‌వ‌న్ కల్యాణ‌్ ఇరుకున‌ప‌డుతున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News