బొమ్మ అదిరిపోద్దటగా

పాత‌మిత్రులు కొత్తగా చేతులు క‌లిపారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో తిట్టుకున్న నాయ‌కులు భుజాలు భుజాలు క‌లుపుకొని ఒకే వేదిక‌ను పంచుకున్నారు. ఇక నుంచి తాము రెండు జెండాలు [more]

Update: 2020-01-28 05:00 GMT

పాత‌మిత్రులు కొత్తగా చేతులు క‌లిపారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో తిట్టుకున్న నాయ‌కులు భుజాలు భుజాలు క‌లుపుకొని ఒకే వేదిక‌ను పంచుకున్నారు. ఇక నుంచి తాము రెండు జెండాలు ప‌ట్టుకుని తిరిగినా.. అజెండా మాత్రం ఒక్కటిగానే ఉంటామ‌ని చెప్పుకొచ్చారు. వారే జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కులు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీ వెళ్లడం.. అక్కడ బీజేపీ పెద్దల‌తో భేటీ కావ‌డం.. అనంత‌రంఈ రెండు పార్టీ మ‌ధ్య పొత్తు క‌మ‌లం విక‌సించ‌డం తెలిసిందే. అయితే, అంతంత మాత్రంగా ఉన్న బీజేపీకి, అస‌లేమీ లేద‌నే రేంజ్‌లో ఉన్న జ‌న‌సేన సాయం చేస్తుందా? లేక‌, బీజేపీ ద‌న్నుతో జ‌న‌సేన బ‌ల‌ప‌డుతుందా? అనే చర్చ ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చింది.

రెస్ట్ తీసుకుంటే…?

జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే.. పార్టీ అధినేత ప‌వ‌న్ కల్యాణ్ త‌ప్ప పార్టీలో యాక్టివ్‌గా ఉన్న నాయ‌కుడు మ‌రొక‌రు క‌నిపించ‌డం లేదు. ఆయ‌న ఉంటేనే పార్టీ వాయిస్ వినిపిస్తోంది. ఆయ‌న ఏమాత్రం నాలుగు రోజులు రెస్ట్ తీసుకున్నా.. జ‌న‌సేన గురించి మాట్లాడే వారు కానీ, జ‌న‌సేన‌ను ప‌ట్టించుకునేవారుకానీ క‌నిపించ‌డం లేదు. పైగా ఇటీవ‌ల కాలంలో ఈ పార్టీ నుంచి చాలా మంది నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చారు., త్వర‌లోనే మ‌రింత మంది బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రెడీ అయ్యార‌ని అప్పట్లో వార్తలు కూడా వ‌చ్చాయి. దీనికితోడు పార్టీని న‌డిపించేందుకు త‌న ద‌గ్గర డ‌బ్బులు కూడా లేవ‌ని జ‌న‌సేనాని ప‌లు మార్లు చెప్పుకొచ్చారు.

నాయకులున్నప్పటికీ….

ఈ ప‌రిణామాల నుంచి పార్టీని బ‌య‌ట ప‌డేసేందుకు, ఆర్థికంగా పార్టీకి ఊతం ఇచ్చేందుకు ప‌వ‌న్ కల్యాణ్ బీజేపీతో జ‌ట్టుక‌ట్టి కొంత‌మేర‌కు లాభ‌ప‌డ్డార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, బీజేపీ విష‌యానికి వ‌స్తే.. ఆ పార్టీలో నాయ‌కుల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. కొన్ని ద‌శాబ్దాలుగా క‌మ‌లం జెండాను, అజెండాను మోస్తున్న నాయ‌కులు చాలా మంది ఉన్నారు. అయితే, ఎవ‌రూ కూడా ప్రస్తుత ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య రేంజ్‌ను అందుకోలేక పోయారు. ప్రజాబ‌లం ఉన్న నాయ‌కులుగా ముద్ర వేసుకోలేక పోయారు. ఏదైనా స‌భ పెట్టాలంటే ప‌ట్టుమ‌ని ఓ వంద‌మందిని గేద‌ర్ చేసే ప‌రిస్థితి కూడా లేదు. దీంతో త‌మ‌కు ప్రజాబ‌లం ఉన్న నాయ‌కుడు అవ‌స‌ర‌మని ఈ పార్టీ పెద్దలు ప‌లు సంద‌ర్భాల్లో మ‌న‌సులో మాట‌ను వ్యక్తీక‌రించారు.

వ్యూహం బాగున్నా….

వ్యూహం బాగున్నా.. ప్రజ‌లు రిసీవ్ చేసుకునేలా ముందుకు తీసుకువెళ్లే నాయ‌కుడు త‌మ‌కు అవ‌స‌రం క‌నుక జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు ఎలాగూ ప్రజాక‌ర్షణ శ‌క్తి(అది ఓట్ల రూపంలో ఉంటుందో లేదో త‌ర్వాత మాట‌) ఉంది క‌నుక ఈయ‌న‌తో జ‌త క‌ట్టాల‌ని భావించి ఉంటార‌ని అంటున్నారు. మొత్తానికి ఈ రెండు పార్టీలూ వ్యూహ ప్రతివ్యూహాల‌తోనే భుజాలు క‌లిపాయ‌ని అంటున్నారు. మ‌రి ఈ రెండు పార్టీల‌ ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుందో కాల‌మే ఆన్సర్ చేయ‌నుంది.

Tags:    

Similar News