ఉక్కు లెక్క తేల్చనున్న గబ్బర్ సింగ్ … ?

నాకు కొంచెం తిక్క ఉంది. దానికి లెక్క ఉంది అంటూ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ఫేమస్ డైలాగ్ ఉంది. అది ఎప్పటికీ పాపులరే. ఇపుడు [more]

Update: 2021-07-31 05:00 GMT

నాకు కొంచెం తిక్క ఉంది. దానికి లెక్క ఉంది అంటూ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ఫేమస్ డైలాగ్ ఉంది. అది ఎప్పటికీ పాపులరే. ఇపుడు పవన్ కల్యాణ్ ఏపీలో తేల్చాల్సిన మరో లెక్క కూడా ఉందిట. అదే విశాఖ ఉక్కు లెక్క. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసే విషయంలో పవన్ కల్యాణ్ నూటికి నూరు పాళ్ళూ బీజేపీని వ్యతిరేకిస్తున్నారుట. విశాఖకే కాకుండా ఏపీ మొత్తానికి గర్వకారణమైన పరిశ్రమను హఠాత్తుగా పీక నొక్కుతామంటే ఎలా అంటున్నారుట పవన్ కల్యాణ్. ఈ విషయంలోనే ఆయన బీజేపీ పొత్తు లెక్క కూడా తేల్చడానికి సిధ్ధపడుతున్నారని టాక్.

ఎవరూ లేని చోట….

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం అవుతూంటే ఏపీలోని ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ టీడీపీ పెద్దగా నోరు మెదపడంలేదు. తూతూమంత్రంగానే వారి స్పందన ఉంటోంది. నిజానికి ఇటు గల్లీలో అటు ఢిల్లీలో కూడా ఈపాటికే ఉక్కు సెగ ఉవ్వెత్తున రగ‌ల్చాలి. కానీ వైసీపీ ఢిల్లీ పెద్దలకు మెత్తమెత్తగా విన్నపాలు చేస్తూ ఉంటే టీడీపీ ఈ విషయంలో వైసీపీని కార్నర్ చేస్తూ సొంత రాజకీయానికి తెర తీస్తోంది. దాంతో విశాఖ ఉక్కు కార్మికులు విలవిలలాడుతున్నారు. తమ తరఫున గట్టిగా పోరాడాలని వారు కోరుతున్నారు. సరిగ్గా ఇదే సమయంగా భావించి తొందరలోనే విశాఖలో పవన్ కల్యాణ్ ప్రత్యక్షం అవుతారు అంటున్నారు.

బీజేపీ మీద గుస్సా….

ఏపీలో బీజేపీతో పొత్తు విషయంలో పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని టాక్. తాను మనస్పూర్తిగా బీజేపీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ నాయకులు మాత్రం లైట్ గా తీసుకుంటున్నారు అన్నదే పవన్ కల్యాణ్ ఆవేదనగా ఉందిట. ఇక్కడో విషయం ప్రచారంలో ఉంది. తిరుపతి ఉప ఎన్నికల తరువాత పవన్ తో ఇప్పటిదాకా బీజేపీ నాయకులు ఎవరూ మాట్లాడింది లేదుట. దాంతో పాటు తాను కరోనా బారిన పడి కోలుకుంటే పరామర్శించే వారు కూడా ఆ పార్టీ నుంచి లేకపోవడంతో పవన్ కల్యాణ్ చాలా నొచ్చుకున్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో గోవధ నిషేధం, టిప్పు సుల్తాన్ విగ్రహం అంటూ నాన్ సీరియస్ పాలిటిక్స్ చేస్తూ బీజేపీ పొద్దుపుచ్చడం పట్ల కూడా పవన్ కల్యాణ్ గుర్రుగా ఉన్నారుట.

తెర వెనక గంటా….

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ ఉక్కు పోరాటం ఆలోచన వెనక ఉన్నారని అంటున్నారు. ఏపీలో రాజకీయంగా జనసేన పుంజుకునేందుకు ఇదే సమయం అని కూడా ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తోంది. విశాఖలో గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు. ఇపుడు అదే విశాఖలో జెండా ఎగరేయడానికి ఉక్కు పోరు కచ్చితంగా ఉపయోగపడుతుందని కూడా పవన్ భావిస్తున్నారుట. సైలెంట్ గా ఆపరేషన్ మొదలెట్టిన గంటా పవన్ కల్యాణ్ ని రంగంలోకి దింపి అటు బీజేపీకే కాదు, ఇటు వైసీపీ, టీడీపీలకు కూడా ఉక్కు సెగ రుచి చూపిస్తారు అంటున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్ రంగంలోకి దిగితే మాత్రం ఉక్కు పోరు కొత్త మలుపు తీసుకుంటుంది అని చెప్పకతప్పదు.

Tags:    

Similar News