సోముదేంపోయింది.. పోయేదంతా పవన్ దేగా?

తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తుంది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ ప్రత్యేకంగా అటెన్షన్ [more]

Update: 2021-04-13 15:30 GMT

తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తుంది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ ప్రత్యేకంగా అటెన్షన్ పెట్టింది. ప్రధానంగా టీడీపీని బలహీనం చేసేందుకు ఆ పార్టీ ఎప్పటికప్పుడు తమ వాదనలను సోషల్ మీడియాలో విన్పిస్తుంది. ప్రత్యేక హోదా పై కలవరపడుతున్న బీజేపీ దానిని చంద్రబాబుపై నెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఇందులో గెలిచినా ఓడినా బీజేపీకి ప్రత్యేకంగా వచ్చే నష్టమేమీలేదు. ఏదైనా నష్టమంటూ జరిగితే అది పార్ట్ నర్ పవన్ కల్యాణ్ కు మాత్రమే.

గెలుపపు అవకాశాలు…

తిరుపతిలో బీజేపీకి గెలుపు అవకాశాలు చాలా తక్కువ. తెలుగుదేశం పార్టీని దాటుకుని రెండో స్థానానికి రావడం కూడా కష్టమే. ఇందుకోసమే బీజేపీ తెలివిగా పవన్ కల్యాణ్ ను బరిలోకి దించింది. ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. పవన్ కల్యాణ్ ను ఒప్పించి ప్రచారానికి రప్పించింది. ఇక్కడ మోదీ, అమిత్ షాలు వచ్చి ప్రచారం చేసిన ఓటమి పాలయితే అది పవన్ కల్యాణ్ ఖాతాలోనే పడుతుంది.

పవన్ ను ప్రచారంలోకి దింపి…..

అందువల్లనే తెలివిగా పవన్ కల్యాణ్ ను వినియోగించుకుంటుంది. నిజానికి జనసేన క్యాడర్ పవన్ కల్యాణ్ చెప్పినా వింటారా? అన్న సందేహం అందరిలోనూ ఉంది. బీజేపీ ఇన్నాళ్లు తమను పట్టించుకోకుండా, తిరుపతి ఉప ఎన్నికల సమయంలో ఆలింగనాలు చేసుకోవడాన్ని జనసేన కార్యకర్తలు తప్పు పడుతున్నారు. ఇప్పటికే జనసేన కార్యకర్తలు వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా మారారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

జనసైనికులు మాత్రం…..

ఇందుకోసమే ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ ను బీజేపీ రంగంలోకి దించింది. అయితే ఇది ఎంతవరకూ వర్క్ అవుట్ అవుతందనేది చెప్పడం కష్టమే. పవన్ కల్యాణ్ గతంలోనే తమ పార్టీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తారని ప్రకటించారు. కానీ బీజేపీ మాత్రం తమకు కావాలని సీటును ఎగరేసుకుపోయింది. ఇవన్నీ గమనిస్తున్న జనసేన కార్యకర్తలు ప్రత్యేకంగా సమావేశమై ఎవరికి మద్దతివ్వాలన్న దానిపై చర్చించారని తెలుస్తోంది. బీజేపీ, వైసీపీకి వ్యతిరేకంగా వారు నడుచుకోవాలని నిర్ణయించు కున్నారట. అంటే టీడీపీకి మద్దతివ్వాలని జనసేన క్యాడర్ డిసైడ్ అయిందంటున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ పరువుకే తిరుపతి ఫలితం ఎసరు పెడుతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News