పవన్ ను బోల్తా కొట్టించిందా?

రాజకీయాల్లో సరైన అవగాహన లేకుండా చేసే పొరపాట్లు, తడపాట్లు తరువాత కాలంలో పాశాలై కూర్చుంటాయని చరిత్ర చెబుతోంది. రాజకీయాల్లో బేరాలు, రాయబారాలకు మంచి అవగాహన ఉండాలి. ఇవేమీ [more]

Update: 2020-01-17 14:30 GMT

రాజకీయాల్లో సరైన అవగాహన లేకుండా చేసే పొరపాట్లు, తడపాట్లు తరువాత కాలంలో పాశాలై కూర్చుంటాయని చరిత్ర చెబుతోంది. రాజకీయాల్లో బేరాలు, రాయబారాలకు మంచి అవగాహన ఉండాలి. ఇవేమీ లేకుండా ఆదరాబాదరాగా చేసినా, లేక మనవాళ్ళే కదా అంటూ మంచితనంతో వదిలేసినా కూడా అది చాలా పెద్ద ఇబ్బందులను సృష్టిస్తుంది. పవన్ కల్యాణ‌్ విషయంలో ఇపుడు అలాగే జరిగిందని అంటున్నారు.. బీజేపీతో పొత్తు విషయంలో సరైన రాయబేరాలు పవన్ కల్యాణ్ చేయలేకపోయారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఫలితంగా పవన్ కల్యాణ్ అవమానం పాలు అయ్యారని అంటున్నారు. పవన్ కల్యాణ్ ను ఏపీలో సబ్ జూనియర్ పార్టనర్ గా చేసెందుకు బీజేపీ వేసిన తెలివైన ఎత్తుగడ ముందు జనసేనాని బోల్తా కొట్టాడని అంటున్నారు.

ఆనాడు అలా…..

2014 ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ స్థాయి, స్టేచర్ ఒక్క లెక్కలో ఉండేవి. పవన్ కల్యాణ్, నాటి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ, ఏపీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కలసి వేదికల మీద కనిపించేవారు. మోడీ స్వయంగా పవన్ కల్యాణ్ ను తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఇక ఎన్డీయేలో పార్టనర్ గా కూడా మోడీ పవన్ ను గురించి పెద్ద పీట వేశారు. ఆరేళ్ళు తిరిగేసరికి పవన్ కల్యాణ్ ఏపీలోని బీజేపీ నేతలతో సీటు పంచుకోవాల్సివచ్చింది. ఇది నిజంగా పవన్ స్టేచర్ ని తగ్గించడమేనని అంటున్నారు. పవన్ ఎన్నికల్లో ఓడిపోయిఉండవచ్చు,, కానీ ఆయన ప్రముఖ సినీ నటుడు, పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న నటుడు. ఇక పవన్ ఓ బలమైన సామాజికవర్గానికి చెందిన వారు ఇవన్నీ చూసుకున్నపుడైనా పవన్ స్థాయిని ఈ కలయిక తగ్గించిందనే అంటున్నారు.

చిరు చేసిన తప్పు….

అప్పట్లో అంటే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పెట్టి ఓడీన తరువాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసినపుడు కూడా ఇలాగే పొరపాట్లు చేశారని, సరిగ్గా రాయబేరాలు చేసుకోలేకపోయారని అంటున్నారు. దాని వల్ల చిరంజీవి తరువాత కాలంలో పూర్తిగా రాజకీయ తెరపై తన పాత్రనే లేకుడా చేసుకున్నారని అంటున్నారు. ఇపుడు కూడా పవన్ కల్యాణ‌ ని బీజేపీ వాడుకుంటుంది తప్ప జనసేనకు బీజేపీ వల్ల ఒనకూడేది ఏనీ ఉండదు. రేపటి రోజున పవన్ కల్యాణ్ సైతం రాయబేరానికి వీలు లేకుండా ఈ పొత్తులతో చిత్తు అయ్యారని అంటున్నారు.

మోడీ, షా కలవరా?

నిజానికి పవన్ కళ్యాణ్ లాంటి స్టేచర్ ఉన్న నాయకుడితో పొత్తు అంటే అది కచ్చితంగా ఢిల్లీ స్థాయిలో జరిగితే ఒక అందం, అర్ధం ఉండేవని అంటున్నారు.. పైగా మోడీ షాలు పవన్ కల్యాణ్ ప్రచారంతో ఏపీతో పాటు, ఇతర రాష్ట్రాల్లో కూడా గతంలో లబ్ది పొందారు. అటువంటపుడు దానికి బదులుగా అయినా తమ పక్కన పవన్ కల్యాణ్ ను కూర్చోబెట్టుకుని పొత్తుల విషయం అక్కడే ప్రకటించి ఉండాల్సింది. అలా అయితే పవన్ కల్యాణ్ గౌరవం కూడా ఎన్నో రెట్లు పెరిగేది. ఇపుడు విజయవాడలో మీడియా మీట్ వల్ల పవన్ సైతం ఓ ఉప ప్రాంతీయ నాయకుడిగా మారిపోయారు. బీజేపీ నేతలలో ఒకరుగా మారి పవన్ కల్యాణ్ బీజేపీ హై కమాండ్ కి తాను దాసోహం అన్నట్లుగా కలరింగు ఇచ్చినట్లైంది. మొత్తం మీద బీజేపీ, జనసేన పొత్తు వెనకాల ఉన్న వ్యూహాలే ఇపుడు జనసేనలోని మేధావులను సైతం విస్మయపరుస్తున్నాయి. మొదట్లోనే ఇలా డామినెటింగ్ రోల్లో బీజేపీ ఉంటే ముందు ముందు బీజేపీ ఏం చేస్తుందో? ఏ రకంగా చూస్తుందో? అన్న బెంగ మాత్రం కచ్చితంగా జనసైనికులకు ఉందనే చెప్పాలి.

Tags:    

Similar News