Pattabhi : పట్టాభి ఏమైనా పోటుగాడా? సొంత పార్టీలోనే గుసగుసలు

పట్టాభికి పొగరెక్కువయింది. తానేదో టీడీపీని ఉద్ధరిస్తున్నాడనుకంటున్నాడు. నాలుగు లెక్కలు చెబితే జనం నమ్ముతారా? అసలు పట్టాభికి ఉన్న స్థాయి ఏంటి? ఆయన మాట్లాడుతున్నదేంటి? ఇది ఎవరో బయట [more]

Update: 2021-11-11 00:30 GMT

పట్టాభికి పొగరెక్కువయింది. తానేదో టీడీపీని ఉద్ధరిస్తున్నాడనుకంటున్నాడు. నాలుగు లెక్కలు చెబితే జనం నమ్ముతారా? అసలు పట్టాభికి ఉన్న స్థాయి ఏంటి? ఆయన మాట్లాడుతున్నదేంటి? ఇది ఎవరో బయట వాళ్లు అంటున్న మాటలు కాదు. టీడీపీలో ముఖ్యనేతలే పట్టాభి పట్ల వ్యక్త పరుస్తున్న అభిప్రాయం. పట్టాభి తాను లేకపోతే టీడీపీ లేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నాడని, ఆయనొక్కడే చంద్రబాబుకు, లోకేష్ కు నమ్మకమైన నేత అని చెప్పుకుంటున్నాడని ఛలోక్తులు టీడీపీ నేతలే విసురుతున్నారు.

జైలుకు వెళ్లి వచ్చినంత మాత్రాన…

పట్టాభి పై సొంత పార్టీ నేతలే ఈ కామెంట్స్ చేయడానికి కారణాు లేకపోలేదు. పట్టాభి బోస్ డీకే పదం ఉచ్ఛరించి జైలుకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు అనుమతితో కుటుంబ సభ్యులతో కలసి మాల్దీవులకు వెళ్లి వచ్చారు. అంతవరకూ బాగానే ఉన్నా వచ్చీ రాగానే తాను వైసీపీని వదిలపెట్టబోనని, పసుపు సైనికుడినని, ఎవరికీ భయపడబోనని పట్టాభి మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పుకున్నారు. జైలుకు అచ్చెన్నాయుడు, దూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ కూడా వెళ్లి వచ్చారని, అదేమీ గొప్ప కాదని అంటున్నారు.

గూగుల్ లో సెర్చ్ చేసి…

తాను లెక్కలతో సహా వివరిస్తానని, అందుకే తానంటే వైసీపీ భయపడుతుందని కూడా పట్టాభి చెప్పుకున్నారు. దీనిపై టీడీపీ నేతలకు ఎక్కడో కాలుతుంది. అంటే మేం చెప్పేవన్నీ ఫేక్ వి, పట్టాభి చెప్పేవే అసలైన లెక్కలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తానేదో స్పై చేసి మరీ కనుగొన్నట్లు పట్టాభి చెబుతున్నారని, అది గూగుల్ లో సెర్చ్ చేసి పేపర్లు పట్టుకుని వచ్చి చదవితే అవి ఖచ్చితమైన లెక్కలవుతాయా? అన్న ప్రశ్నలు కూడా పార్టీ నేతల నుంచే వస్తున్నాయి.

ప్రెస్ మీట్లు పెట్టి…..

కేవలం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టి హీరోలు కావాలనుకుంటున్నవారికి పట్టాభి లాంటి వారు మార్గదర్శకంగా మారతారని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే నేతలకంటే పట్టాభి గొప్పవాడా? అని ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు లెక్కలతో సహా చెబుతారని, ఆయన ఎప్పుడూ ఇలా పట్టాభి లా డప్పా కొట్టుకోలేదని కొందరు సీినియర్లు సీరియస్ అవుతున్నారు. పట్టాభిని కంట్రోల్ చేయకపోతే కష్టమని కొందరు చంద్రబాబుకు సయితం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తాను లేకుంటే టీడీపీయేలేదని బిల్డప్ ఇవ్వడం బాగాలేదని కూడా అంటున్నారు.

Tags:    

Similar News