Pattabhi : పట్టాభీ… పేట్రేగి పోమాకు.. కొంచెం ఆగు

ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నాం. ఇన్నాళ్లకు బయటపడ్డారు. పార్టీలో కొందరికి ప్రాధాన్యత ఇస్తున్నారని, వారిని కంట్రోల్ చేయాలని చంద్రబాబుకు నేతలు పదే పదే చెబుతున్నారు. వారి వల్ల పార్టీ [more]

Update: 2021-10-16 06:30 GMT

ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నాం. ఇన్నాళ్లకు బయటపడ్డారు. పార్టీలో కొందరికి ప్రాధాన్యత ఇస్తున్నారని, వారిని కంట్రోల్ చేయాలని చంద్రబాబుకు నేతలు పదే పదే చెబుతున్నారు. వారి వల్ల పార్టీ ఇబ్బందుల పాలవుతుందంటున్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా చెప్పుకుంటూ పట్టాభి పార్టీని మరింత భ్రష్టు పట్టిస్తున్నారని కొందరు పార్టీకి ఫిర్యాదు చేశారు. పార్టీ విశ్వసనీయత కోల్పోతుందని ఆరోపిస్తున్నారు.

పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత….

పార్టీలో 2019 ఎన్నికల తర్వాత మాత్రమే పట్టాభి పార్టీలో వెలుగులోకి వచ్చారు. ఆయన చేస్తున్న ఆరోపణల్లో సరైన ఆధారాలు లేకపోవడం, స్పష్టత లేకపోవడం వంటి వాటితో ప్రజలు కూడా నమ్మడం లేదు. రోజుకో ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ లో సీనియర్లు ఎవరూ లేరని పట్టాభి చాటుకునే ప్రయత్నం అధిష్టానం వద్ద చేస్తున్నారని, విజయవాడలోని తన ఇంటివద్ద పట్టాభిపై కొందరు దాడి చేసిన దగ్గర నుంచి మరింత పేట్రేగి పోతున్నారని విజయవాడ నేతలు కొందరు ఫిర్యాదు చేశారు.

రాజకీయాల్లోనూ వేలు పెడుతూ…

విజయవాడ రాజకీయాల్లో కూడా వేలు పెడుతున్నారని, కేశినేని నాని, బుద్దా వెంకన్నల మధ్య జరిగిన వివాదలో కూడా జోక్యం చేసుకుంటున్నారని చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విజయవాడ నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరయితే తాను పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే పట్టాభికి రిజర్వ్ అయిందని పార్టీ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారని కూడా నేరుగా చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ముందస్తు సమాచారం లేకుండా….

ఇక ఇటీవల కాకినాడలో పట్టాభి చేసిన వ్యవహారం కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. డ్రగ్స్ ఆరోపణలు చేస్తూ పట్టాభి మత్స్యకారులను ఉచ్చులోకి లాగారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా నేతలు ఈ మేరకు పట్టాభిని కంట్రోల్ చేయాలని కోరారట. జిల్లాకు వచ్చే ముందు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వచ్చి హడావిడి చేశారని వారు పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో పట్టాభిని కంట్రోల్ లో పెట్టాలని చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలను ఆదేశించినట్లు తెలిసింది.

Tags:    

Similar News