రాజు కాదు బాలుడే…?

విశాఖ ప్రాంతంలో సీనియర్ నేత పసుపులేటి బాలరాజు రాజాకీయల్లో వేసుకున్నఅంచనాలన్నీ తప్పుతూనే ఉన్నాయి. అన్నీ కలసి వచ్చి ఉంటే ఆయన జగన్ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉండేవారు. కానీ [more]

Update: 2019-09-07 11:00 GMT

విశాఖ ప్రాంతంలో సీనియర్ నేత పసుపులేటి బాలరాజు రాజాకీయల్లో వేసుకున్నఅంచనాలన్నీ తప్పుతూనే ఉన్నాయి. అన్నీ కలసి వచ్చి ఉంటే ఆయన జగన్ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉండేవారు. కానీ ఆయన తలరాత బాగోక గాజు గ్లాస్ అందుకున్నారు. అదే బాలరాజు కొంపముంచింది. మాజీ మంత్రిగా, సీనియర్ నేతగా విశాఖ ప్రాంతంలో పేరున్న బాలరాజు నేడు మళ్లీ వైసీపీ గూటికి చేరేందుకు ప్రయత్నించడమే ఇందుకు ఉదాహరణ. మన్యంలో పట్టున్న నేతగా బాలారాజుకు పేరుంది. విశాఖ పేరుచెబితే పదేళ్ల క్రితం బాలరాజు పేరు గుర్తుకు వచ్చేంతలా ఉండేది.

రాంగ్ స్టెప్ లతో…..

కాని కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా? పసుపులేటి బాల రాజు వేసిన రాంగ్ స్టెప్ లతో ఆయన రాజకీయ జీవితం ఆటుపోట్లకు గురవుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బాలరాజు తిరుగులేని నేత. మంత్రిగా కూడా కూడా పనిచేశారు. వైఎస్ కు వీరవిధేయుడిగా పేరుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత బాలరాజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనూ కీలకంగానే వ్యహరించారు.తన హవాను నడిపించుకున్నారు. రాష్ట్ర విభజన జరగడంతోనే అసలు సమస్య ప్రారంభమయింది. బాలరాజు ఇక్కడే తప్పటడుగులు వేశారు. అందుకే ఆయన పేరుకు తగ్గట్లు రాజకీయాల్లో బాలుడిగా మిత్రులు సెటైర్ వేస్తారు.

వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినా….

కాంగ్రెస్ లోనే ఉండి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలకు ముందు బాలరాజు జనసేన పార్టీలో చేరారు. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని బాలరాజు భావించారు. గిడ్డి ఈశ్వరి పార్టీ నుంచివెళ్లి పోవడానికి కూడా కారణం బాలరాజే. బాలరాజు వస్తే తన స్థానానికి ఎసరు పెడతారని భావించి గిడ్డి ఈశ్వరి వెళ్లిపోయారు. అయితే జగన్ మాత్రం బాలరాజుకు అరకు పార్లమెంటు నుంచి పోటీ చేయాలని చెప్పారు.కానీ బాలరాజు మాత్రం తనకు పాడేరు సీటు కావాలని పట్టుబట్టారు. దీనికి జగన్ నో చెప్పడంతో జనసేనలోకి వెళ్లి చేతులు కాల్చుకున్నారు.

విజయసాయి రెడ్డితో….

ఇప్పుడు మళ్లీ వైసీపీలోకి వచ్చేందుకు బాలరాజు ప్రయత్నాలు ప్రారంభించారు. జగన్ కు దగ్గరవ్వాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లే కన్పిస్తుంది. మన్యం ప్రాంతంలో తన పట్టును కోల్పోకుండా ఉండేందుకే బాలరాజు అధికార పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన జగన్ పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డితో బాలరాజు సంప్రదింపులు జరిపారని, జగన్ కూడాబాలరాజు చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇలా బాలరాజు కరెక్ట్ టైంలో అంచనా వేయలేక రాజకీయంగా దెబ్బతిన్నారు. మరివైసీపీలో ఆయన చేరికతో పార్టీకి బలం చేకూరినా…మరో నాలుగున్నరేళ్ల పాటు బాలరాజుకు మాత్రం ఎలాంటి పదవి ఉండదన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్.

Tags:    

Similar News