టీడీపీలో దడ దడ… ఆ డేట్స్…??

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచించి అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 60 లక్షలకు పైగా ఉన్న డ్వాక్రా మహిళలను తెలుగుదేశం [more]

Update: 2019-04-04 09:30 GMT

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచించి అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 60 లక్షలకు పైగా ఉన్న డ్వాక్రా మహిళలను తెలుగుదేశం వైపు తిప్పుకునే లక్ష్యంతో ఆయన పసుపు – కుంకుమ పథకాన్ని రూపొందించారు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. డ్వాక్రా మహిళలకు నాలుగు విడతల్లో రూ.10 వేలు ఇవ్వాలనేది ఈ పథకం ఉద్దేశ్యం. ఇందుకోసం లబ్ధిదారులకు ఇప్పటికే పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు. ఇప్పటికే రెండు విడతల డబ్బు డ్వాక్రా మహిళలకు అందింది. ఇక, మూడో విడత చెక్కులు రేపు రావాల్సి ఉంది. ఎన్నికల ముందు వచ్చే ఈ డబ్బులతో డ్వాక్రా మహిళలు టీడీపీకి ఓట్లేయడం ఖాయమని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

వరుసగా బ్యాంకు సెలవులు

అయితే, తెలుగుదేశం పార్టీ నేతల ఆశలపై బ్యాంక్ హాలీడేస్ నీళ్లు పోస్తున్నాయి. 5వ తేదీ డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో చెక్కులు వేసుకోవాలి. కానీ, ఆ రోజు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఇక, ఆరో తేదీన ఉగాధి పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు. తర్వాత 7వ తేదీ ఆదివారం కావడం సెలవు. దీంతో డ్వాక్రా మహిళలు 8వ తేదీన చెక్కులు బ్యాంకుల్లో వేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ చెక్కులు కాబట్టి ఒకటి, రెండు రోజుల్లో డబ్బులు ఖాతాల్లో పడే అవకాశం ఉండదు. చెక్కులు చెల్లి డబ్బులు రావడానికి కచ్చితంగా మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంటుంది. 11వ తేదీన ఎన్నికలు ఉన్నందున మళ్లీ సెలవు ఉంటుంది. దీంతో ఎన్నికల తర్వాతే ఈ విడత పసుపు – కుంకుమ డబ్బులు డ్వాక్రా మహిళలకు అందే అవకాశం ఉంది. మరి, ఎన్నికల ముందే డబ్బు మహిళల చేతికందుతుందని, దీంతో వారంతా తమకే ఓటేస్తారని టీడీపీ పెట్టుకున్న ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు.

Tags:    

Similar News