ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారే?

బెల్లం చుట్టూనే ఈగలు ముసురుతాయి. అలాగే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా వస్తారు. అధికారం రాదని తెలిస్తే అటు వైపు ఎవరూ చూడరు. ప్రస్తుతం తమిళనాడులో అధికార [more]

Update: 2020-11-03 17:30 GMT

బెల్లం చుట్టూనే ఈగలు ముసురుతాయి. అలాగే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా వస్తారు. అధికారం రాదని తెలిస్తే అటు వైపు ఎవరూ చూడరు. ప్రస్తుతం తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పరిస్థితి అలాగే ఉంది. అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఉన్న పార్టీలు తమ దారి తాము చూసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఏడాది ముందు పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న కూటమి పార్టీలు శాసనసభ ఎన్నికల దగ్గరపడుతున్న సమయంలో పక్కకు తప్పుకునే ప్రయత్నంలో ఉన్నాయి.

పార్లమెంటు ఎన్నికల్లో……

మొన్న పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో బీజేపీతో పాటు డీఎండీకే, పీఎంకే వంటి పార్టీలు ఉన్నాయి. అయితే లోక్ సభ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానం ఈ కూటమి గెలుచుకుంది. అదీ తేనీ నియోజకవర్గం నుంచి పన్నీర్ సెల్వం కుమారుడు మాత్రమే గెలవగలిగారు. మిగిలిన 37 లోక్ సభ స్థానాల్లో ఈ కూటమి కుదేలయింది. ఇప్పుడు శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరోసారి కూటమితోనే వెళ్లాలని అన్నాడీఎంకే నిర్ణయించింది.

పీఎంకే రజనీ వైపు….

అయితే ఇప్పటికే పీఎంకే అన్నాడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతోంది. పీఎంకే అధినేత రాందాస్ రిజర్వేషన్ల ఉద్యమాన్ని భుజనాకెత్తుకున్నారు. కులాల వారీగా కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేసిన పీఎంకే ఎక్కడా గెలవలేకపోయింది. దీంతో పీఎంకే తన దారి తాను చూసుకోవాలను కుంటుంది. రజనీకాంత్ పార్టీతో పీఎంకే పొత్తు పెట్టుకునే అవకాశముంది.

తన దారి తనదేనంటున్న డీఎండీకే…..

అలాగే డీఎండీకే కూడా కూటమి నుంచి వైదొలుగుతుంది. డీఎండీకే ఈసారి అన్నాడీఎంకేతో కలసి పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. తమ నేతృత్వంలోనే తృతీయ కూటమిని ఏర్పాటు చేయాలని డీఎండీకే నిర్ణయించింది. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే కూటమితోనే వెళుతుందని ఆ పార్టీ నేత విజయ్ ప్రభాకరన్ తెలిపారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా కూటమిని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. దీంతో అధికార అన్నాడీఎంకే కూటమి నుంచి ఎన్నికల వేళకు ఒక్కొక్క పార్టీ వెళ్లిపోతాయంటున్నారు పరిశీలికులు.

Tags:    

Similar News