చిన్నమ్మ వచ్చే అవకాశమే లేదటగా?

శశికళ కోసం తమిళనాడులో ప్రధాన పార్టీలన్నీ ఎదురు చూస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల సమయానికి శశికళ విడుదల అవుతారా? లేదా? అన్నది కూడా చర్చనీయాంశమైంది. వచ్చే ఏడాదిలో తమిళనాడు [more]

Update: 2020-09-29 18:29 GMT

శశికళ కోసం తమిళనాడులో ప్రధాన పార్టీలన్నీ ఎదురు చూస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల సమయానికి శశికళ విడుదల అవుతారా? లేదా? అన్నది కూడా చర్చనీయాంశమైంది. వచ్చే ఏడాదిలో తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి. అయితే శశికళ ఈ నెలలో విడుదలవుతారని అందరూ భావించారు. అయితే శశికళ శిక్షాకాలం వచ్చే ఏడాది జనవరికి గాని పూర్తి కాదని జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ సెలవులు తీసేస్తే శశికళ విడుదల ఈనెల లేదా వచ్చే నెలలో ఉంటుందని అమ్మ మక్కల మున్నేట్ర కళగం నేతలు చెబుతున్నారు.

ఢిల్లీ లెవెల్లో…..

కానీ శశికళ విడుదల కోసం ఢిల్లీ లెవెల్లో అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. శశికళ మేనల్లుడు దినకరన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలసి వచ్చినట్లు తెలిసింది. శశికళను సత్వరం విడుదల కోసం దినకరన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఎన్నికల సమాయానికి అన్నాడీఎంకే బలపడాలంటే శశికళ బయటకు రావాలనే కోరుకుంటుంది. రజనీకాంత్ పార్టీని ప్రకటించేలోపు శశికళను జైలు నుంచి విడుదల చేయాలని కూడా రాష్ట్ర బీజేపీ నేతలు కొందరు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కోరినట్లు చెబుతున్నారు.

శిక్షాకాలం పూర్తయ్యేది…..?

శశికళ జయలలిత అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం పరప్పణ అగ్రహార జైలులో ఉన్నారు. 2017 ఫిబ్రవరి నెలలో ఆమె జైలుకు వెళ్లారు. శశికళకు పదికోట్ల జరిమానాతో పాటు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ శిక్ష పూర్తి కావడానికి మరో నాలుగునెలలకు పైగానే ఉంది. సత్ప్రవర్తన పేరిట విడుదల చేస్తారనుకున్నా, జైలులో ఉండగానే శశికళపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సత్ప్రవర్తన అనేది పరిగణనలోకి తీసుకోరంటున్నారు. మరోవైపు జైలు శిక్షలో ఆమెకున్న సెలవులను పరిగణనలోకి తీసుకుంటారని చెబుతున్నారు.

సెలవులు కూడా…..

శశికళ తన శిక్షాకాలంలో రెండు, మూడుసార్లు పెరోల్్ పై బయటకు వచ్చారు. ఒకసారి భర్త ఆరోగ్యం బాగా లేకపోవడంతో పెరోల్ పై బయటకు వచ్చారు. పదిరోజులకు పైగానే ఉన్నారు. భర్త మరణించిన తర్వాత కూడా మరోసారి పెరోల్ పై వచ్చారు. దీంతో శశికళకు సెలవులు ఏమీ లేవని కొందరు చెబుతున్నారు. మొత్తం మీద శశికళ విడుదల కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల చేతిలోనే ఉందని దినకరన్ భావిస్తుండటంతో ఆయన ఢిల్లీకి వెళ్లారంటున్నారు. మొత్తం మీద శశికళ విడుదల ఎప్పుడన్నది తమిళనాడు రాజకీయ పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News