పరిటాల పుంజుకుంటున్నారా?

తెలుగుదేశం పార్టీలో నేతలంతా దాదాపు సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా రాయలసీమలో అనేక మంది సీనియర్ నేతలున్నా ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. జేసీ బ్రదర్స్ కూడా [more]

Update: 2021-06-17 06:30 GMT

తెలుగుదేశం పార్టీలో నేతలంతా దాదాపు సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా రాయలసీమలో అనేక మంది సీనియర్ నేతలున్నా ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. జేసీ బ్రదర్స్ కూడా ఇటీవల కాలంలో సైలెంట్ అయిపోయారు. అయితే పరిటాల ఫ్యామిలీ మాత్రం ఫుల్లు యాక్టివ్ కావడం విశేషం. రాప్తాడు నియోజకవర్గంలో తిరిగి విజయం దక్కించుకునేందుకు పరిటాల సునీత గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

పట్టున్న ప్రాంతం కావడంతో…?

రాప్తాడు నియోజకవర్గం పరిటాల ఫ్యామిలీకి పట్టున్న నియోజకవర్గం. పరిటాల రవి అభిమానులు మెండుగా ఉన్న ప్రాంతంలో గత ఎన్నికల్లో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. పరిటాల సునీత పోటీకి దూరంగా ఉండటమే ఓటమి గల కారణాలన్న విశ్లేషణలు ఫలితాల అనంతరం విన్పించాయి. గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేయాలని భావిస్తున్నారు.

క్షేత్రస్థాయి పర్యటనలతో….

అందుకోసం ఇప్పటి నుంచే ఆమె క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. రాప్తాడు ప్రస్తుత ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఆయన అవినీతిని ప్రశ్నిస్తున్నారు. పరిటాల సునీత, శ్రీరామ్ లు ఇద్దరూ ఇప్పుడు రాప్తాడుపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. నిత్యం కార్యకర్తలతో సమావేశమవుతూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. పరిటాల శ్రీరామ్ పై వరసగా నమోదవుతున్న కేసులు కూడా తమకు అనుకూలంగా మారతాయన్న భావనలో ఉన్నారు.

సానుభూతితోనే?

తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కూడా రాప్తాడులోనే ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. పరిటాల సునీత సయితం నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో జరిగే కార్యక్రమాలకు స్వయంగా హాజరవుతున్నారు. పరిటాల సునీత పట్ల కొంత సానుభూతి ఇప్పటికీ ఉంది. ఆమె అయితేనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్న భావన చంద్రబాబులోనూ ఉంది. దీంతో పరిటాల సునీతను రాప్తాడులో యాక్టివ్ కావాలని చెప్పడంతోనే ఆమె క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తమ కంచుకోటను కాపాడుకోవడానికి పరిటాల సునీత విశ్వప్రయత్నం చేస్తున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News