ప‌రిటాల వార‌సుడి వ‌న్ ఇయ‌ర్ పాలిటిక్స్‌.. డైల‌మా వీడారా…?

అనంత‌పురం జిల్లాకు చెందిన ప‌రిటాల ఫ్యామిలీ రాజ‌కీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే సాగుతుంటాయి. ప‌రిటాల ర‌వి జీవించిన స‌మ‌యంలోనూ త‌ర్వాత ఆయ‌న స‌తీమ‌ణి ఎంట్రీతోనూ రాజ‌కీయాలు ఎప్పుడూ [more]

Update: 2020-06-05 00:30 GMT

అనంత‌పురం జిల్లాకు చెందిన ప‌రిటాల ఫ్యామిలీ రాజ‌కీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే సాగుతుంటాయి. ప‌రిటాల ర‌వి జీవించిన స‌మ‌యంలోనూ త‌ర్వాత ఆయ‌న స‌తీమ‌ణి ఎంట్రీతోనూ రాజ‌కీయాలు ఎప్పుడూ ఆస‌క్తిక‌ర‌మే. టీడీపీలో కీల‌క నేత‌లుగా ఉన్న ప‌రిటాల కుటుంబం నుంచి గ‌త ఏడాది వార‌సుడు తెర‌మీదికి వ‌చ్చారు. ఆయ‌నే ప‌రిటాల శ్రీరాం. నిజానికి రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అయిన‌ప్పటికీ.. ప‌రిటాల కుటుంబం ఊహించ‌ని ప‌రిణామం గ‌త ఎన్నిక‌ల్లో చోటు చేసుకుంది. ప‌రిటాల శ్రీరాం ఎంట్రీతో అనూహ్య విజ‌యం ద‌క్కుతుంద‌ని భావించిన మాజీ మంత్రి ప‌రిటాల సునీత ఖంగుతినేలా.. ప‌రిటాల శ్రీరాం ఓట‌మి పాల‌య్యారు. ఇది జ‌రిగి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో యువ నాయ‌కుడిగా ప‌రిటాల శ్రీరాం వేసుకున్న పునాదులు ఏంటి? ఎలాంటి వ్యూహంతో ఆయ‌న ముందుకు సాగుతున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు జోరుగా చ‌ర్చకు వ‌స్తున్నాయి.

తొలి ఓటమి కుంగదీసినా….

రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు ప‌రిటాల సునీత విజ‌యం సాధించారు. 2009, 2014లోనూ ఆమె గెలుపు గుర్రం ఎక్కారు. ఆ రెండు సార్లూ కూడా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పైనే ఆమె గెలుపు సాధించారు. అయితే, మెజారిటీ మాత్రం నామ‌మాత్రం. కానీ, గ‌త ఏడాది ప‌రిటాల శ్రీరాం కూడా ఇక్కడ నుంచే పోటీ చేసినా.. ఈ ద‌ఫా మాత్రం ప్రజ‌లు తోపుదుర్తిని గెలిపించారు. అంతేకాదు, పాతిక వేల మెజారిటీ క‌ట్టబెట్టారు. ఈ ప‌రిణామం నిజంగా ప‌రిటాల వ‌ర్గాన్ని కుంగ‌దీసింది. ఓడిపోయిన బాధ క‌న్నా కూడా మెజారిటీ పైనే బెంగ పెట్టుకున్నారు. అయితే, తొలి ఓట‌మి నుంచి ప‌రిటాల శ్రీరాం వెంట‌నే తేరుకున్నా.. పార్టీ ప‌రిస్థితి ఆయ‌న‌ను మ‌రింత కుంగ దీసింది. జిల్లాలో పార్టీ ప‌రిస్తితి నానాటికీ తీసిక‌ట్టుగా మారింది.

భవిష్యత్ ఏంటన్న దానిపై….

మ‌రోప‌క్క, పార్టీలో కీల‌క‌మైన ధ‌ర్మవ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి వంటి వారు సైకిల్ దిగేశారు. దీంతో భ‌విష్యత్తు ప‌రిస్థితి ఏంటి ? అనేది ప‌రిటాల శ్రీరాంను వెంటాడుతోంది. దీనికితోడు ఓట‌మి త‌ర్వాత ప్రజ‌ల్లో పెద్దగా ఉండ‌డం లేదు. పార్టీ అధినేత చంద్రబాబు ప్రజ‌ల్లో ఉండాల‌ని పిలుపు నిస్తున్నా.. జిల్లాలో ప‌రిస్థితి నేప‌థ్యంలో ప‌రిటాల శ్రీరాం త‌న సొంత వ్యాపారాల‌కు, వ్యవ‌హారాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. పైగా జ‌గ‌న్ ప్రభుత్వంపై విమ‌ర్శలు సంధించాలంటే కూడా ఆయ‌న వెనుకాడుతున్నారు. గ‌తంలో ఎప్పుడూ మీడియాలో ఉంటే.. ఇప్పుడు మాత్రం ఇంటిప‌ట్టునే ఉంటున్నారు. మ‌రోప‌క్క, త‌మ‌కు ధ‌ర్మవ‌రం నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌ల‌ను కూడా అప్పగించాల‌ని కొన్నాళ్లు ఆయ‌న పార్టీలో డిమాండ్ చేశారు. అయితే, ఈ వ్యవ‌హారంపై చంద్రబాబు ఎటూ తేల్చ‌లేదు.

అదే కలవరపర్చే అంశం…

ఈ ప‌రిణామాలు ఒక‌వైపు వెంటాడుతుండ‌డ‌గా.. పార్టీలో యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తామ‌ని, పార్టీ ప‌ద‌వుల‌ను కూడా క‌ట్టబెడ‌తామ‌ని ప‌దే ప‌దే చెబుతున్న చంద్రబాబు ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి ప‌ద‌వులు ఎవ‌రికీ ఇవ్వలేదు. ఇది కూడా ప‌రిటాల శ్రీరాంను క‌ల‌వ‌ర‌పరుస్తోంది. నిజానికి ఓడినా గెలిచినా.. ప్రజ‌ల్లో ఉండాల్సిన యువ నాయ‌కుడు, త‌నకంటూ.. ప్రత్యేక పునాదులు ఏర్పాటు చేసుకోవాల్సిన నాయ‌కుడు ఇలా మౌనంగా ఉండ‌డంతో స్థానికంగా కార్యక‌ర్తలు, కేడ‌ర్ కూడా నిరుత్సాహంలో మునిగిపోయారు.

బీసీలు దూరమవ్వడంతో…

ఇక నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిటాల కుటుంబం, టీడీపీకి ఎప్పుడు వెన్నుద‌న్నుగా ఉండే బీసీలు పూర్తిగా దూర‌మ‌య్యారు. దీంతో ఇప్పుడున్న ప‌రిస్తితుల్లో ఇప్పుడు ప‌రిటాల ఫ్యామిలీ తిరిగి రాప్తాడులో పోటీ చేసేందుకు కూడా భ‌య‌ప‌డుతోన్న ప‌రిస్థితి. ఇక ధ‌ర్మవ‌రం వెళ‌దామంటే అక్కడ కూడా వైసీపీ చాలా బ‌లంగా ఉంది. ఇక ఎన్నిక‌లు గ‌డిచి ఇప్పటికే ఏడాది గ‌డిచిపోయింది. స్థానిక ఎన్నిక‌ల్లో అయినా స‌త్తాచాటేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంది. పార్టీ క‌న్నా.. త‌న భ‌విష్యత్తు కోస‌మైనా ప‌రిటాల శ్రీరాం అడుగులు వేగంగా వేయాల‌నేది ప‌రిశీల‌కుల భావ‌న‌. మ‌రి యువ నేత ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News