ధైర్యం, దమ్మూ దుమ్ముకొట్టుకుపోయాయా?

పరిటాల కుటుంబం అంటే దమ్ము, ధైర్యం ఉన్నదిగా పేరు. పరిటాల పేరు వింటేనే ఒక ధైర్యం, ఒక భరోసా. ఇది ఒకప్పటి మాట. పరిటాల రవీంద్ర బతికి [more]

Update: 2020-09-19 12:30 GMT

పరిటాల కుటుంబం అంటే దమ్ము, ధైర్యం ఉన్నదిగా పేరు. పరిటాల పేరు వింటేనే ఒక ధైర్యం, ఒక భరోసా. ఇది ఒకప్పటి మాట. పరిటాల రవీంద్ర బతికి ఉన్నప్పుడు పార్టీ క్యాడర్ ఎన్నడూ భయపడేది కాదు. దేనికీ తలవంచేది కాదు. కానీ పరిటాల రవీంద్ర హత్యానంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పరిటాల కుటుంబం పేరు చెప్పినా ఎవరూ వణికేది లేదు. అంతేకాదు ఆ కుటుంబం వెంట నడవాలన్న ఆసక్తి కూడా లేదు. దీనికి కారణం ఏంటి?

ఆయన చూపు కోసం…..

ఒకనాడు పరిటాల రవీంద్ర ఎక్కడ ఉన్నా ఎంత హడావిడి ఉండేది. కేవలం సొంత పనుల కోసమే కాు. ఆయనను చూడటం కోసం, ఆయన పలకరింపు కోసమే జనం వచ్చేవాళ్లు. రవి భుజం మీద చేయి వేస్తే మురిసిపోయేవారు. అలాంటి కుటుంబం ఇప్పుడు మౌనంగా ఉంటుంది. పరిటాల రవి హత్యానంతరం ఆయన సతీమణి పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో గెలిచిన వెంటనే చంద్రబాబు సునీతను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

ఓటమి తర్వాత…..

2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన కుమారుడు పరిటాల శ్రీరామ్ కు టిక్కెట్ అడిగి ఇప్పించుకున్నారు. పరిటాల రవి పరువు తీసేలా శ్రీరామ్ రాప్తాడు లో ఓటమి పాలయ్యారు. సరే ఓటమి, గెలుపులు ఎవరి చేతుల్లో ఉండవు. దానికి ఎవరు అతీతులు కారని సరిపెట్టుకున్నా ఎన్నికల అనంతరం పరిటాల కుటుంబం తీరును చూసి రవి అనుచరులు, అభిమానులే ముక్కున వేలేసుకుంటున్నారు. గత ఏడాదిన్నర నుంచి బయటకే రాకపోవడాన్ని తప్పు పడుతున్నారు.

విమర్శలకూ కౌంటర్ లేకుండా….

ఇక పరిటాల కుటుంబం పై అనేక ఆరోపణలు వచ్చాయి. అమరావతిలో భూములను కొనుగోలు చేశారని వైసీపీ నేతలు విమర్శించినా దానిపై స్పందించలేదు. ఇక తాజాగా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి పరిటాల కుటుంబంపై పదే పదే విమర్శలు చేస్తున్నప్పటికీ దానికి కౌంటర్ ఇచ్చే సాహసాన్ని చేయలేకపోతున్నారు. దీంతో పరిటాల కుటుంబానికి ఏమైందన్న సందేహాలు అభిమానులు, అనుచరుల్లో వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉండగా పదవులు పొంది, పవర్ పోగానే పార్టీకి దూరం జరగడమేంటని టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తుండటం విశేషం.

Tags:    

Similar News