దానికి కూడా ఫుల్ స్టాప్ పడుతుందా? కామా కొనసాగుతుందా?

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాజధాని పరిధిలోనూ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు [more]

Update: 2021-02-03 05:00 GMT

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాజధాని పరిధిలోనూ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు తదితర మండలాల్లోనూ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ను జారీ చేశారు. ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని అన్ని మండలాల్లోనూ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఫలితాలు ప్రభుత్వంపై వ్యతిరేకతను తెలియజేస్తాయని విపక్షం నమ్మకంతో ఉంది.

రాజధాని ప్రాంతంలో…

మూడు రాజధానుల ప్రతిపాదనతో వైసీపీ ప్రభుత్వంపై కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏ మాత్రం ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నది ఈ ఎన్నికల ద్వారా స్పష్టమవుతుంది. రాజధాని ప్రాంతాల్లో దాదాపు 400 రోజులకు పైగానే రైతులు ఉద్యమాలను నిర్వహిస్తున్నారు. రాజధానిని తరలిస్తామన్న ప్రకటనతో ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ పూర్తిగా పడిపోయింది. భూముల ధరలు నేల చూపులు చూడటంతో ఒక వర్గం ప్రజలు మాత్రం అసంతృప్తితో ఉన్నారన్నది వాస్తవం.

ప్రజల మొగ్గు ఎటన్నది….?

ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరిగితే ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. అందుకే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం కోరుకుంటుందని, ఈ ఎన్నికలు జరిగితే ప్రభుత్వ బండారం బయటపడిపోతుందని టీడీపీ గట్టిగా విశ్వసిస్తుంది. అందుకే రాష్ట్ర మంతటా ఫలితాలు ఎలా ఉన్నా గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా రాజధాని ప్రభావం ఉంటుందని టీడీపీ అభిప్రాయపడుతుంది.

అందుకే టీడీపీ, వైసీపీ….

కానీ వైసీపీ మాత్రం ఫలితాలతో సంబంధం లేదని చెబుతుంది. ఒకవేళ ఎన్నికలంటూ జరిగితే రాజధాని ప్రాంతంలోనే తాము అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని చెబుతోంది. అందుకోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగిపోయిన మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పక్కన పెట్టి పంచాయతీ ఎన్నికలను తొలుత నిర్వహించడానికి రెడీ అయ్యారన్న ఆరోపణలను కూడా ఆ పార్టీ చేస్తుంది. మొత్తం మీద పంచాయతీ ఎన్నికలు జరిగితే రాజధాని పై ప్రజాభిప్రాయం ఏమిటన్నది స్పష్టంగా తెలుస్తోంది.

Tags:    

Similar News