పనబాక ఒప్పుకోవడం లేదా?

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. డేట్ ఇంకా ఫిక్స్ కాకపోయినా మరి కొద్ది నెలల్లో ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే టీడీపీ తరుపున ఎవరు [more]

Update: 2020-10-20 05:00 GMT

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. డేట్ ఇంకా ఫిక్స్ కాకపోయినా మరి కొద్ది నెలల్లో ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే టీడీపీ తరుపున ఎవరు బరిలోకి దిగుతారన్న విషయం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయని పనబాక లక్ష్మి ఉప ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతున్నారని తెలిసింది. పోటీ చేసినా గెలుపు దక్కదన్న ఆలోచనతోనే ఉప ఎన్నికలో తాను పోటీ చేయనని టీడీపీ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం.

నాలుగు సార్లు గెలిచి….

పనబాక లక్ష్మి గతంలో కేందమంత్రిగా పనిచేశారు. నాలుగు సార్లు లోక్ సభకు పనబాక లక్ష్మి ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ లోనే ఆమె నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్ర విభజనతో పనబాక లక్ష్మి కుటుంబం గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చింది. చంద్రబాబు ఆమెకు తిరుపతి పార్లమెంటు టిక్కెట్ ఇచ్చినప్పటికీ గెలవలేకపోయారు. చంద్రబాబు సొంత జిల్లా కావడంతో పనబాక లక్ష్మి అప్పట్లో టీడీపీ లో చేరారు.

పోటీ చేసినా…..

కానీ ఇప్పుడు ఉప ఎన్నిక జరిగే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ అధికారంలో ఉంది. దీంతో తన గెలుపు కష్టమని పనబాక లక్ష్మి భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఎంపీ గా పనిచేస్తూ మృతి చెందిన బల్లి దుర్గాప్రసాదరావు కుటుంబానికి వైసీపీ టిక్కెట్ ఇస్తుండటం కూడా పనబాక లక్ష్మి విముఖతకు కారణంగా చెబుతున్నారు. సానుభూతితో బల్లి కుటుంబమే తిరిగి వస్తుందన్న అంచనాలు ఉండటంతో పనబాక లక్ష్మి టీడీపీ అధినేత ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది.

ప్రత్యామ్నాయం వైపు…..

పనబాక లక్ష్మి పోటీకి విముఖత చేయడంతో టీడీపీ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది. పనబాక లక్ష్మి అయితే గత ఎన్నికలలో పోటీ చేసి ఓటమి చెందడంతో ఆమెకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావించారు. కానీ ఆమె నో చెప్పడంతో ఇప్పుడు తిరుపతి పార్లమెంటుకు వర్ల రామయ్య పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ పోటీ చేయదలచుకుంటే తిరుపతి టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్య అభ్యర్థి అవుతారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మొత్తం మీద పనబాక లక్ష్మి పోటీకి విముఖత వ్యక్తం చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News